భారతదేశం మరియు రష్యా మధ్య స్నేహం కాల పరీక్షగా నిలిచింది: ప్రధాని మోదీ
మహమ్మారి మా ద్వైపాక్షిక సహకారంలో ఆరోగ్యం మరియు ఫార్మా రంగాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేసింది: వ్లాడివోస్టాక్‌లో తూర్పు ఆర్థిక వేదిక వద్ద ప్రధాని
భారతదేశం - రష్యా శక్తి భాగస్వామ్యం ప్రపంచ ఇంధన మార్కెట్‌లో స్థిరత్వాన్ని తీసుకురావడానికి సహాయపడుతుంది: ప్రధాని మోదీ

ర‌ష్య‌న్ ఫెడ‌రేశ‌న్ అధ్య‌క్షుడు,
ప్రియ‌మైన నా మిత్రుడు శ్రీ పుతిన్‌,
ఎక్స్‌లన్సిజ్,
ఈస్ట‌ర్న్ ఇక‌నామిక్ ఫోర‌మ్ లో పాలుపంచుకొంటున్న వారంద‌రికీ
న‌మ‌స్తే,

ఈస్ట‌ర్న్ ఇక‌నామిక్ ఫోర‌మ్ ను ఉద్దేశించి ప్ర‌సంగిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.  మ‌రి ఈ గౌర‌వాన్ని ఇచ్చినందుకు అధ్య‌క్షుడు శ్రీ పుతిన్ కు నేను ధ‌న్యావాదాలు వ్యక్తం చేస్తున్నాను.

మిత్రులారా,

‘సంగమ్’ అనే మాట కు భార‌త‌దేశం చ‌రిత్ర లో, భార‌త‌దేశం నాగ‌రక‌త లో ఒక ప్ర‌త్యేక‌మైన అర్థమంటూ ఉంది.  దీనికి న‌దుల క‌ల‌యిక‌, ప్ర‌జ‌ల స‌మ్మేళ‌నం  లేదా ఆలోచ‌న‌ల క‌ల‌బోత అనేటటువంటి అర్థాలు ఉన్నాయి.  నా దృష్టి లో, వ్లాదివోస్తోక్ అనేది ప‌సిఫిక్, ఇంకా యూరేశియా ల వాస్త‌విక ‘సంగమం’గా ఉంది.  ర‌ష్యా లో దూర ప్రాచ్య ప్రాంతం అభివృద్ధి ప‌ట్ల శ్రీ పుతిన్ కు ఉన్న దృష్టి కోణాన్ని నేను మెచ్చుకొంటున్నాను.  ఈ దార్శ‌నిక‌త ను సాకారం చేయ‌డం లో ర‌ష్యా కు భార‌త‌దేశం ఒక న‌మ్మ‌ద‌గిన భాగ‌స్వామి గా ఉండగలదు.  2019 లో ఈ ఫోరానికి హాజ‌రు కావ‌డం కోసం  నేను వ్లాదివోస్తోక్ ను సంద‌ర్శించిన‌ప్పుడు భార‌త‌దేశం ‘‘యాక్ట్ ఫార్-ఈస్ట్‌’’ విధానాని కి కట్టుబడి ఉందని ప్రక‌టించాను.  ర‌ష్యా తో మాకు గల ప్ర‌త్యేక‌మైన‌టువంటి, విశేష అధికారాలు కలిగివున్న‌టువంటి వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం లో ఈ విధానాని కి ఒక ముఖ్య‌మైన పాత్ర అంటూ ఉంది.  

ఎక్స్‌లన్సి,

2019 లో నా సందర్శన వేళ వ్లాదివోస్తోక్ నుంచి జ్వెజ్ దా కు ప‌డ‌వ లో ప్ర‌యాణించిన సంద‌ర్భం లో అధ్య‌క్షుడు శ్రీ పుతిన్‌ తో నేను జ‌రిపిన ఒక స‌మ‌గ్ర‌ సంభాష‌ణ ను నేను జ్ఞ‌ప్తి కి తెచ్చుకొంటున్నాను.  మీరు జ్వెజ్ దా లో ఆధునిక నౌకా నిర్మాణ కేంద్రాన్ని నాకు చూపెట్టారు.  ఆ ఘ‌న‌మైనటువంటి వాణిజ్య సంస్థ లో భార‌త‌దేశం పాలుపంచుకోగ‌ల‌ద‌న్న ఆశాభావాన్ని కూడా మీరు వ్య‌క్తం చేశారు.  ఈ రోజు న, భార‌త‌దేశం లో అతి పెద్ద శిప్ యార్డుల లో ఒక శిప్ యార్డ్ అయిన‌టువంటి మాఝ్ గావ్ డాక్స్ లిమిటెడ్ ప్ర‌పంచం లో అత్యంత ముఖ్య‌మైన‌టువంటి వాణిజ్య త‌ర‌హా నౌక‌ల ను కొన్నింటిని నిర్మించ‌డం కోసం ‘జ్వెజ్ దా’ తో భాగస్వామ్యం ఏర్పరచుకోనుండడం తో నాకు సంతోషం కలుగుతున్నది.  గ‌గ‌న్ యాన్ కార్య‌క్ర‌మం ద్వారా అంత‌రిక్షాన్ని అన్వేషించ‌డం లో ర‌ష్యా, భార‌త‌దేశం భాగ‌స్వామ్య దేశాలు గా ఉన్నాయి. అంత‌ర్జాతీయ వ్యాపారం మ‌రియు వాణిజ్యం కోసం నార్థ‌ర్న్ సీ రూట్ ను తెర‌వ‌డం లో కూడాను భార‌త‌దేశం, ర‌ష్యా చేతులు కలుపుతాయియి.

మిత్రులారా,

భార‌త‌దేశాని కి , ర‌ష్యా కు మ‌ధ్య గల మైత్రి కాల ప‌రీక్ష కు త‌ట్టుకొని నిల‌చింది.  ఈ మైత్రి ని ఇటీవ‌లే కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి కాలం లో టీకా మందు ల రంగం సహా పలు అంశాల లో మ‌న మ‌ధ్య ఏర్ప‌డినటువంటి ప‌టిష్ట‌మైన స‌హ‌కారం లో సైతం గ‌మనించ‌వ‌చ్చును.  మ‌న ద్వైపాక్షిక స‌హ‌కారం లో ఆరోగ్య రంగానికి, ఔష‌ధ నిర్మాణ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని విశ్వ‌మారి ప్ర‌ముఖం గా చాటి చెప్పింది.  శ‌క్తి రంగం మ‌న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం లో మ‌రొక ప్ర‌ధాన‌మైన స్తంభం గా ఉంది.  ప్ర‌పంచ శ‌క్తి బ‌జారు లో స్థిర‌త్వాన్ని తీసుకు రావ‌డం లో భార‌త‌దేశం- ర‌ష్యా శ‌క్తి భాగ‌స్వామ్యం స‌హాయ‌కారి కాగ‌ల‌దు.  ఈ ఫోర‌మ్ లో భార‌త‌దేశాని కి ప్రాతినిధ్యం వ‌హించ‌డం కోసం నా ప్ర‌భుత్వం లో పెట్రోలియ‌మ్‌, స‌హ‌జ‌ వాయువు ల శాఖ మంత్రి శ్రీ హ‌ర్ దీప్ పురి వ్లాదివోస్తోక్ కు  విచ్చేశారు.  అంతేకాదు, భార‌త‌దేశ శ్రామికులు అమూర్ ప్రాంతం లో, యామల్ నుంచి వ్లాదివోస్తోక్ వ‌ర‌కు, అలాగే చెన్నై వ‌ర‌కు ఉన్న ప్ర‌ధాన‌మైన గ్యాస్ ప్రాజెక్టుల లో పాల్గొంటున్నారు.  మ‌నం ఒక శ‌క్తి మ‌రియు వ్యాపార ద‌ళాన్ని ఏర్పాటు చేయాలి అని ఆశిస్తున్నాం.  చెన్నై-వ్లాదివోస్తోక్ మేరిటైమ్ కారిడార్ ప‌నులు పురోగ‌మిస్తూ ఉండ‌టం నాకు సంతోషాన్ని ఇస్తోంది.  ఈ సంధాన ప‌థ‌కం తో పాటు, ఇంట‌ర్ నేశన‌ల్ నార్థ్-సౌథ్ కారిడార్ భార‌త‌దేశాన్ని, ర‌ష్యా ను భౌతికం గా ఒక‌దానితో మ‌రొక‌దానిని స‌న్నిహితం చేయ‌నున్నాయి.  మ‌హ‌మ్మారి సంబంధిత ఆంక్ష‌ లు అమ‌లవుతున్నా కూడాను అనేక రంగాల లో మ‌న వ్యాపార సంబంధాల ను ప‌టిష్ట ప‌ర‌చుకోవ‌డం లో చ‌క్క‌ని పురోగ‌తి చోటుచేసుకొంది.   భార‌త‌దేశ ఉక్కు ప‌రిశ్ర‌మ కు కోకింగ్ కోల్ ను దీర్ఘ‌కాలం పాటు స‌ర‌ఫ‌రా చేయ‌డం అనేది దీనిలో భాగం గా ఉంది.  మ‌నం వ్యావ‌సాయ‌క ప‌రిశ్ర‌మ‌, సిరామిక్స్‌, స్ట్ర‌టీజిక్ అండ్ రేర్ అర్థ్ మిన‌రల్స్, వ‌జ్రాల వంటి రంగాల లో కొత్త కొత్త అవ‌కాశాల ను సైతం అన్వేషిస్తున్నాం.  స‌ఖా-యాకూతియా, గుజ‌రాత్ ల వ‌జ్రాల రంగ ప్ర‌తినిధులు ఈ ఫోర‌మ్ లో భాగం గా విడి గా  స‌ంభాషణ జ‌రుపుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను.   2019 లో ప్ర‌క‌టించిన బిలియ‌న్ డాల‌ర్ సాఫ్ట్ క్రెడిట్ లైన్ ఉభ‌య దేశాల మ‌ధ్య అనేక వ్యాపార అవ‌కాశాల ను ఏర్పరుస్తుంద‌న్న న‌మ్మ‌కం నాలో ఉంది.

ర‌ష్యా లో దూర ప్రాచ్య ప్రాంతాల‌ కు చెందిన అతి ముఖ్య‌మైన భాగ‌స్వాముల‌ ను, అలాగే భార‌త‌దేశం లో కొన్ని రాష్ట్రాల వారిని ఒకే వేదిక మీద‌కు తీసుకు రావ‌డం కూడా ప్ర‌యోజ‌నాల‌ ను అందించేదే.  2019 లో కీల‌క భార‌త‌దేశ రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల సంద‌ర్శ‌న కాలం లో జ‌రిగిన ఉప‌యోగ‌క‌ర‌మైన చ‌ర్చ‌ల ను మ‌నం మరింత ముందుకు తీసుకు పోవ‌ల‌సి ఉంది.   వీలైనంత త్వ‌ర‌గా భార‌త‌దేశం సంద‌ర్శ‌న కు త‌ర‌లి రావ‌ల‌సిందిగా ర‌ష్యా లో 11 దూర ప్రాచ్య ప్రాంతాల గ‌వ‌ర్న‌ర్ లను నేను ఆహ్వానించ‌ద‌ల‌చుకొన్నాను.

మిత్రులారా,

2019 లో ఈ ఫోర‌మ్ లో నేను చెప్పినట్లు, ప్ర‌పంచం లో వ‌న‌రులు స‌మృద్ధం గా ఉన్న అనేక ప్రాంతాల లో అభివృద్ధి ప్ర‌క్రియ కు భార‌త‌దేశ ప్ర‌తిభావంతులు తోడ్ప‌డ్డారు.  భార‌త‌దేశం లో ప్ర‌తిభావంతులైన‌టువంటి మ‌రియు స‌మ‌ర్ప‌ణ భావం క‌లిగిన‌టువంటి శ్ర‌మ శ‌క్తి ఉన్నది.  దూర ప్రాచ్య ప్రాంతాల లో వ‌న‌రులు పుష్క‌లం గా ఉన్నాయి.  అంటే ర‌ష్యా లోని దూర ప్రాచ్య ప్రాంతాల అభివృద్ధి కి తోడ్పాటు ను అందించ‌డానికి భార‌త‌దేశం శ్ర‌మ శ‌క్తి కి ఎంతో అవ‌కాశం ఉంద‌న్న‌ మాట‌.  ఈ ఫోర‌మ్ ను నిర్వహిస్తున్న ఫార్ ఈస్టర్న్ ఫెడ‌ర‌ల్ యూనివ‌ర్సిటి లో భార‌త‌దేశాని కి చెందిన చాలా మంది విద్యార్థులకు విద్యాబోధన ను అందిస్తున్నది.

ఎక్స్‌లన్సి,

అధ్య‌క్షుడు శ్రీ పుతిన్, ఈ ఫోర‌మ్ లో ప్ర‌సంగించే అవకాశాన్ని ఇచ్చినందుకు గాను మీకు నేను మరో సారి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను.  మీరు ఎల్ల‌వేళ‌లా భార‌త‌దేశాని కి ఒక గొప్ప స్నేహితుడి గా ఉన్నారు.  మ‌రి మీ మార్గ‌ద‌ర్శ‌క‌త్వం లో మ‌న వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం మ‌రింత‌గా బ‌లోపేతం అవుతూపోతుంది.  ఈస్టర్న్ ఇక‌నామిక్ ఫోర‌మ్ లో పాలుపంచుకొంటున్న వ‌ర్గాల‌న్నింటికీ స‌ఫ‌ల‌త సిద్ధించాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను.

స్పసీబా.

మీకు ధ‌న్య‌వాదాలు,

మీకు చాలా చాలా ధ‌న్య‌వాదాలు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era

Media Coverage

India’s Defence Exports Explode: ₹40,000 Crore Milestone Signals a New Manufacturing Era
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Text of PM’s remarks during inauguration of Swaminarayan Hindu Temple in Paris
September 06, 2026

पूज्य महंत स्वामी, फ्रांस सरकार के सम्मानित प्रतिनिधिगण, उपस्थित अतिथिगण, इंडियन कम्युनिटी के मेरे साथी, देश दुनिया से जुड़े सभी हरि भक्त, देवियों और सज्जनों, जय स्वामीनारायण!

आज फ्रांस की राजधानी पेरिस में भव्य स्वामीनारायण मंदिर का लोकार्पण हो रहा है। यह लोकार्पण भारत और फ्रांस के सांस्कृतिक संबंधों का नया युग स्तंभ है। पूज्य संत जनों और सनातन परंपरा के श्रेष्ठ जनों के आशीर्वाद के साथ आज इस लोकार्पण का मंच ‘वसुधैव कुटुम्बकम’ के भाव का मंच बन गया है। भगवान स्वामीनारायण की कृपा और हमारे संतों का स्नेह, संतों का आशीर्वाद, मेरा सौभाग्य है कि मुझे ऐसे पुण्य अवसरों से जुड़ने का अवसर हमेशा मिलता रहता है। आज भी मैं भले ही पेरिस में आप सबके बीच उपस्थित नहीं हूं, लेकिन मन से और हृदय से, मैं स्वयं को आपके बीच ही अनुभव कर रहा हूं।

साथियों,

आज इस अवसर पर मैं परम पूज्य प्रमुख स्वामी जी महाराज का भी श्रद्धापूर्वक स्मरण करता हूं। प्राचीन काल में भारत का जो सांस्कृतिक आध्यात्मिक वैभव था, उन्होंने उसके पुनर्जागरण का एक अभियान शुरू किया था। आज उसका प्रकाश यूरोप समेत पूरी दुनिया में फैल रहा है। 2024 में अबू धाबी में भव्य मंदिर का लोकार्पण हुआ था। आज वहां हजारों लोग दर्शन करने जाते हैं और अब यहां पेरिस में स्वामीनारायण मंदिर का निर्माण सृजन की यह निरंतरता, यह संतों की संकल्प शक्ति का ही प्रमाण है। मैं पुनीत कार्य के लिए पूज्य महंत स्वामी का आभार प्रकट करता हूं, मैं उनके चरणों में प्रणाम करता हूं। मैं BAPS स्वामीनारायण संस्था को और करोड़ों हरि भक्तों को इस अवसर पर हृदय की गहराई से बधाई देता हूं।

साथियों,

BAPS के माध्यम से जब अलग-अलग देश में मंदिरों की प्राण प्रतिष्ठा होती है, तो वहां भारत के प्राचीन विचार और मानवीय मूल्य भी साथ-साथ ही जाते हैं और भारत का विचार कहता है ‘समानं मनः सह चित्तमेषाम्’ अर्थात हमारे मन समान हो, हमारे हृदय साथ जुड़े। इसलिए आज जब फ्रांस में इतना भव्य मंदिर बनकर तैयार हुआ है, यह फ्रांस की विविधता को तो समृद्ध करेगा ही, इससे भारत और फ्रांस के सांस्कृतिक संबंधों को भी ऊर्जा मिलेगी।

साथियों,

बीते वर्षों में भारत और फ्रांस के संबंध नई ऊंचाइयों तक पहुंचे हैं। मेरे मित्र, प्रेसिडेंट मैक्रों के साथ मिलकर दोनों देश एक Special Global Strategic Partnership बना रहे हैं। Technology, AI और Defence से लेकर Space और Climate Action तक हम एक नई गति और नई ऊर्जा के साथ मिलकर के आगे बढ़ रहे हैं। हम 2026 को India-France Year of Innovation के रूप में भी सेलिब्रेट कर रहे हैं। भारत-फ्रांस की ये Strategic Partnership इसलिए भी खास है, क्योंकि ये हमारे पुराने सांस्कृतिक-राजनैतिक सम्बन्धों की मजबूत बुनियाद पर टिकी है। इतिहास गवाह है, फ्रांस में भारतीय सैनिकों के बलिदान का इतिहास आज भी मन-मंदिर में जीवित है। भाषा से जुड़े विषयों में रुचि रखने वाले लोग यह भी जानते हैं कि फ्रेंच स्कॉलर्स ने संस्कृत को लोकप्रिय बनाने में कितनी अहम भूमिका निभाई है। रामकृष्ण परमहंस और स्वामी विवेकानंद पर रोमाँ रोलाँ की की लेखनी हमारी सोसाइटीज़ को और करीब लाई है। पेरिस से पुडुचेरी के अरबिंदो आश्रम तक 'The mother' की spiritual journey, उसने कितने ही भारतीय और फ्रेंच साधकों को inspire किया है।

साथियों,

दशकों पहले श्रील प्रभुपाद स्वामी भी फ्रांस आए थे। इस्कॉन के जरिए भारत फ्रांस के बीच आध्यात्मिक सम्बन्धों का नया अध्याय उन्होंने शुरू किया था। आज योग भी भारत-फ्रांस के people to people कनेक्ट का एक माध्यम बन चुका है। 'इंटरनेशनल योगा डे' पर एफिल टॉवर के सामने से आने वाली तस्वीरें फ्रांस में योग की लोकप्रियता का उदाहरण बनती हैं और अब BAPS के इस भव्य मंदिर के जरिए, हमारे उन सांस्कृतिक सम्बन्धों में एक नया अध्याय जुड़ रहा है।

साथियों,

इन दिनों, भारत फ्रांस Joint Ventures की संभावनाओं पर बातें होती हैं। स्वामीनारायण मंदिर ने इस संभावना में भी एक नया आयाम जोड़ा है। यह मंदिर 'मेड इन इंडिया' है और 'बिल्ट इन फ्रांस' है। इसके काफी पत्थरों को भारत में तराशा गया है। भारत की प्राचीन प्रतिभा यहाँ फ्रांस में आधुनिक इंजीनियरिंग से आकर जुड़ चुकी है। पेरिस में इस भव्य मंदिर ने आकार लिया है। इसलिए, मैं आशा करता हूँ, यह मंदिर सदियों तक भारत और फ्रांस के बीच सहयोग और संभावनाओं का भी प्रतीक बनकर उभरेगा।

साथियों,

स्वामीनारायण मंदिर हमेशा से भक्ति के साथ-साथ सेवा का माध्यम भी रहे हैं। मुझे बताया गया है, यह मंदिर भी सेवा प्रकल्पों का वैसा ही केंद्र बनेगा। मुझे विश्वास है कि यहाँ से भारतीय संस्कृति के जो स्वर निकलेंगे, उनका लाभ पूरे यूरोप में लोगों को मिलेगा। भविष्य में मुझे जब भी समय मिलेगा, मैं इस मंदिर में दर्शन करने का प्रयास अवश्य करूंगा। इन्हीं शब्दों के साथ, एक बार फिर आज के इस लोकार्पण समारोह में सम्मिलित सभी अतिथिगणों को, सभी परिवारों को, सभी हरि भक्तों को और पूरी Indian Diaspora को मेरी ओर से इस शुभारंभ पर्व की ढेरों शुभकामनाएं!

बहुत-बहुत धन्यवाद!

मर्सी बोकू!

जय स्वामीनारायण!