ఫిబ్రవరి 22న ప్రసారమయ్యే మన్ కీ బాత్ కార్యక్రమానికి సూచనలివ్వాలని కోరిన ప్రధాని

మారుమూల గ్రామాలైనా, రద్దీగా ఉండే నగరాలైనా ప్రజలకు విశ్వసనీయమైన స్వరంగా నిలిచిన మాధ్యమాన్ని ప్రశంసించడమే ప్రపంచ రేడియో దినోత్సవం ప్రధానోద్దేశమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అనేక సంవత్సరాలుగా ప్రజలకు సకాలంలో సమాచారాన్ని రేడియో అందిస్తోందని, ప్రతిభను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తోందని శ్రీ మోదీ చెప్పారు.

‘‘మన ప్రజల్లోని సామాజిక శక్తిని వెలికి తీయడంలో రేడియో సామర్థ్యాన్ని మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా నేను ప్రత్యక్షంగా చూశాను. ఫిబ్రవరి, 22 ఆదివారం నాడు నెలవారీ కార్యక్రమం ప్రసారమవుతుంది. దీనికి మీ సూచనలను అందించండి’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘మారుమూల ప్రాంతాలైనా, రద్దీగా ఉండే నగరాలైనా, ప్రజలకు విశ్వసనీయమైన స్వరంగా నిలిచిన మాధ్యమాన్ని ప్రశంసించడమే ప్రపంచ రేడియో దినోత్సవ ముఖ్యోద్దేశం. అనేక ఏళ్లుగా సకాలంలో సమాచారాన్ని రేడియో అందిస్తోంది. ప్రతిభను, సృజనాత్మకతను ప్రోత్సహిస్తోంది. ఈ మాధ్యమంతో అనుసంధానమై ఉన్న అందరి కృషిని గుర్తించాల్సిన రోజు ఇది.

మన ప్రజల్లో ఉన్న సామాజిక శక్తిని వెలికి తీయడంలో రేడియోకున్న సామర్థ్యాన్ని మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ నెల కార్యక్రమం ఫిబ్రవరి 22న ప్రసారమవుతుంది. దీనికి మీ సూచనలను అందించండి.’’

https://mygov.in/group-issue/inviting-ideas-mann-ki-baat-prime-minister-narendra-modi-22nd-february-2026/?target=inapp&type=group_issue&nid=366266

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Odisha’s Dhenkanal farmers export 3 tonne of mango to London

Media Coverage

Odisha’s Dhenkanal farmers export 3 tonne of mango to London
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 మే 2026
May 14, 2026

Kisan Kalyan to Viksit Bharat: PM Modi Delivers Jobs, Markets & Dignity Across Rural and Industrial India