స్పెయిన్ అధ్యక్షుడు శ్రీ పెడ్రో సాంచెజ్ ప్రస్తుతం భారత్ పర్యటనలో ఉన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు  ఫిబ్రవరి 18,19 న ‘ఏఐ ఇంపాక్ట్ సదస్సు 2026’లో ఆయన పాల్గొంటున్నారు. 2024 అక్టోబర్ 27, 29 ద్వైపాక్షిక పర్యటన తర్వాత ఆయనకు ఇది రెండో అధికారిక భారత పర్యటన. ఆయనతో పాటు స్పెయిన్ డిజిటల్ పరివర్తన, పౌర సేవల మంత్రి శ్రీ ఆస్కార్ లోపెజ్ అగ్యుడా, వ్యవసాయ, మత్స్య, ఆహార శాఖ మంత్రి శ్రీ లూయిస్ ప్లానాస్ పుచాడెస్ కూడా ఉన్నారు.

ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు సాంచెజ్ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, మౌలిక సదుపాయాలు, వాతావరణం, పునరుత్పాదక ఇంధనం, రక్షణ, భద్రత, అంతరిక్షం, సంస్కృతి, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలతో సహా భారత్-స్పెయిన్ సంబంధాల సమగ్ర అంశాలను వారు సమీక్షించారు. ధ్వైపాక్షిక సహకారంలో కనిపిస్తున్న సానుకూల వేగాన్ని నేతలు స్వాగతించారు. అక్టోబర్ 2024లో వారు సంయుక్తంగా ప్రారంభించిన వడోదరలోని సీ-295 రవాణా విమానాల ఫైనల్ అసెంబ్లీ లైన్ కోసం జరుగుతున్న టాటా-ఎయిర్‌బస్ భాగస్వామ్య పురోగతిపై హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో సహ-అభివృద్ధి, సహ-ఉత్పత్తి  ఆధారిత రక్షణ పారిశ్రామిక సహకారం ప్రాముఖ్యతను ఇరునేతలు వివరించారు.

రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది జరుపుకుంటున్న భారత్-స్పెయిన్ సంస్కృతి, పర్యాటకం, కృత్రిమమేధ ద్వైవార్షికోత్సవానికి ఉన్న విశేష అవకాశాలను ఇరు నేతలు ప్రస్తావించారు. ఈ కార్యక్రమం ద్వారా  రెండు దేశాల మధ్య సాంకేతికత, ఆవిష్కరణలు, వ్యాపారం, ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని వారు పేర్కొన్నారు.

ఏఐ ఇంపాక్ట్ సదస్సు ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ.. ఈ సమావేశ ఫలితాలు ప్రపంచ స్థాయి ఏఐ పాలన రూపకల్పనకు అర్థవంతంగా దోహదపడతాయని స్పెయిన్ అధ్యక్షుడు శాంచెజ్ విశ్వాసం వ్యక్తం చేశారు. కృత్రిమ మేధను ఒక పరివర్తన శక్తిగా గుర్తించిన ఇరు నేతలు.. దీని సామర్థ్యాన్ని  సమగ్రాభివృద్ధికి, సామాజిక ప్రయోజనాలకు సమర్థవంతంగా వినియోగించేందుకు భారత్-స్పెయిన్ మధ్య సన్నిహిత సహకారం అవసరమని తెలిపారు.

భారత్ లో నూతన విద్యా విధానం నేపథ్యంలో విద్యా రంగంలో సహకారం సాధ్యాసాధ్యాలపై ఇరు నేతలు చర్చించారు. ఫిబ్రవరి 19, 20 తేదీలలో న్యూఢిల్లీలో జరగనున్న భారత విశ్వవిద్యాలయాల వైస్-చాన్సలర్లు, స్పెయిన్ విశ్వవిద్యాలయాల రెక్టర్ల సదస్సును వారు స్వాగతించారు. రెండు దేశాల మధ్య పర్యాటక రంగంలో కనిపిస్తున్న అద్భుతమైన వృద్ధి, ఆర్థిక కార్యకలాపాలను పెంచడమే కాక ప్రజల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని నేతలు గుర్తించారు. నూతన విద్యా విధానం కింద భారత్‌లో క్యాంపసులు ప్రారంభించాలని ముఖ్యంగా ఎస్ టీఈఎం, సాంకేతిక రంగాల్లోని ప్రముఖ స్పానిష్ విశ్వవిద్యాలయాలు, సంస్థలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీఆహ్వానించారు.

ఇండో-పసిఫిక్ సముద్రాల కార్యాక్రమంలో చేరాలనే స్పెయిన్ నిర్ణయంతో సహా పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. భారత్-యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పంద చర్చలు విజయవంతంగా ముగియడం కీలక మైలురాయిగా వారు అభివర్ణంచారు. ఇది భారత్, స్పెయిన్ మధ్య మాత్రమే కాకుండా యూరప్‌తో కూడా అపారమైన వాణిజ్య, పెట్టుబడి అవకాశాలను వెలికితీయడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాద నిర్మూలనకు అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అన్ని రూపాల్లో ఉగ్రవాదాన్ని వారు ఖండిస్తూ, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సహకారాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ధ్వైవార్షికోత్సవం ద్వారా బలపడిన ద్వైపాక్షిక సంబంధాల విస్తరణ భారత్-స్పెయిన్ భాగస్వామ్యానికి కొత్త ఊపును ఇస్తుందని ఇరు నేతలు విశ్వాసం వ్యక్తం చేశారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Italy and India: A strategic partnership for the Indo-Mediterranean

Media Coverage

Italy and India: A strategic partnership for the Indo-Mediterranean
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 మే 2026
May 19, 2026

Exports Up, Economy Strong, World Collaborating: PM Modi's Reforms Delivering Jobs, Growth & Green Future