ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో అమెరికా జాతీయ భద్రత సలహాదారు శ్రీ జేక్ సలివన్ ఈ రోజు న సమావేశమయ్యారు.
ద్వైపాక్షిక సహకారం నెలకొన్న వివిధ రంగాల లో చోటు చేసుకొన్న పురోగతి ని గురించి అమెరికా జాతీయ భద్రత సలహాదారు శ్రీ సులివన్ ప్రధాన మంత్రి దృ ష్టి కి తీసుకు వచ్చారు. అమెరికా అధ్యక్షుడు శ్రీ బైడెన్ ప్రధాన మంత్రి ఆధికారిక పర్యటన సందర్భం లో ఆయన కు స్వాగతం పలకడానికి ఉత్సాహం తో ఉన్నారని శ్రీ సులివన్ వెల్లడించారు.
భారతదేశానికి మరియు అమెరికా కు మధ్య సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం పెరుగుతూ ఉండడం తో పాటు బలపడుతూ ఉన్నందుకు ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
అధ్యక్షుడు శ్రీ బైడెన్ ను కలుసుకొని పరస్పర హితం ముడిపడ్డ ద్వైపాక్షిక, ప్రాంతీయ మరియు ప్రపంచ అంశాల పైన ఉపయోగకరమైన పర్యటన తో పాటు చర్చ ల కోసం తాను ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానని ప్రధాన మంత్రి అన్నారు.
Glad to receive US National Security Advisor @JakeSullivan46. Reviewed progress under India-US Initiative on Critical & Emerging Technologies (iCET) and other issues of bilateral cooperation. Look forward to meeting @POTUS @JoeBiden during my upcoming State Visit to the US. pic.twitter.com/jqG77WgMIE
— Narendra Modi (@narendramodi) June 13, 2023


