సెనిట్ లో మెజారిటీ లీడర్ శ్రీ చార్ల్ స్ శూమర్ యొక్క నాయకత్వం లో తొమ్మిది మంది సెనటర్ లతో కూడిన యుఎస్ కాంగ్రెస్ ప్రతినిధి వర్గమొకటి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు న సమావేశమైంది. ఈ ప్రతినిధి వర్గం లో సెనటర్ లు శ్రీయుతులు రాన్ విడెన్, జేక్ రీడ్, మార్క్ వార్నర్, గేరీ పీటర్స్, పీటర్ వెల్చ్ తో పాటు మరియా కేంట్ వెల్, ఎమీ క్లోబుచర్, కేథరిన్ కార్టెజ్ మాస్తో గారు లు ఉన్నారు.
కాంగ్రెస్ యొక్క ప్రతినిధి వర్గాన్ని భారతదేశం లోకి ప్రధాన మంత్రి స్వాగతించారు. భారతదేశం-యుఎస్ ద్వైపాక్షిక సంబంధాల ను మరింత పటిష్టపరచేందుకు యుఎస్ కాంగ్రెస్ అందిస్తున్నటువంటి నిరంతరమైన ద్విసభయుక్తమైన సమర్థన ను ప్రశంసించారు. సమకాలీన ప్రపంచ సవాళ్ల ను పరిష్కరించడం కోసం ‘ఇండియా-యుఎస్ కాంప్రిహెన్సివ్ గ్లోబల్ స్ట్రటీజిక్ పార్ట్ నర్ శిప్’ ను ముందుకు తీసుకు పోవడం కోసం అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ బైడెన్ తో ఇటీవల తాను ఫోన్ మాధ్యం ద్వారా జరిపిన సంభాషణ ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించారు. నేత లు ఇద్దరి యొక్క ఉమ్మడి దృష్టికోణాన్ని గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భం లో ఉట్టంకించారు.
ప్రధాన మంత్రి మరియు యుఎస్ ప్రతినిధి వర్గం ఉమ్మడి ప్రజాస్వామిక విలువలు, బలమైనటువంటి ద్వైపాక్షిక సహకారం, ప్రజల మధ్య పరస్పరం దృఢమైన సంబంధాల తో పాటు యుఎస్ లో ఉత్సాహవంతులైన భారతీయ సముదాయం.. ఇవి ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాని కి చక్కని స్తంభాలు గా నిలబడ్డాయని గుర్తించారు.
కీలకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాలు, స్వచ్ఛ శక్తి దిశ గా పరివర్తన చెందడం, కలసి అభివృద్ధి, ఉత్పత్తి మరియు విశ్వసనీయమైనటువంటి, ఇంకా ఉదారపూర్ణమైనటువంటి సప్లయ్ చైన్ లలో భారతదేశం-యుఎస్ సంబంధాలను బలోపేతం చేయడం లో క్రొత్త అవకాశాల పై యుఎస్ ప్రతినిధి వర్గం తో ప్రధాన మంత్రి చర్చించారు.
Wonderful to interact with US Congressional delegation led by Senate Majority Leader @SenSchumer. Appreciate the strong bipartisan support from the US Congress for deepening India-US ties anchored in shared democratic values and strong people-to-people ties. pic.twitter.com/Xy3vL6JeyF
— Narendra Modi (@narendramodi) February 20, 2023