దేశంలోని అత్యంత పరాక్రమవంతురాలైన యోధుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన రాణి వేలు నాచియార్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ఆమెకు నివాళులు అర్పించారు. ధైర్యసాహసాలు, వ్యూహాత్మక నైపుణ్యాలు మూర్తీభవించిన గొప్ప పోరాట యోధురాలిగా ఆమె చిరస్మరణీయులు అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
రాణి వేలు నాచియార్ వలసవాద అణచివేతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, తమను తాము పరిపాలించుకునే భారతీయుల హక్కును గురించి ప్రజలను జాగృతం చేశారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. సుపరిపాలన, సాంస్కృతిక గర్వం పట్ల ఆమె అచంచలమైన నిబద్ధత దేశానికి స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు.
ఆమె త్యాగం, దార్శనిక నాయకత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందనీ... భారత ప్రగతి ప్రయాణంలో ధైర్యం, దేశభక్తికి దీపస్తంభంగా పనిచేస్తుందని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"రాణి వేలు నాచియార్ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులు. ధైర్యం, వ్యూహాత్మక నైపుణ్యాలు మూర్తీభవించిన అత్యంత పరాక్రమవంతులైన భారత యోధుల్లో ఒకరిగా ఆమె చిసర్మరణీయులు. వలసవాద అణచివేతకు వ్యతిరేకంగా ఆమె తిరుగుబాటు చేసి... తమను తాము పరిపాలించుకునే భారతీయుల హక్కును గురించి ప్రజలను జాగృతం చేశారు. సుపరిపాలన, సాంస్కృతిక గర్వం పట్ల ఆమె నిబద్ధత ప్రశంసనీయం. ఆమె త్యాగం, దార్శనిక నాయకత్వం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి."
Tributes to Rani Velu Nachiyar on her birth anniversary. She is remembered as one of India’s most valiant warriors who embodied courage and tactical mastery. She rose against colonial oppression and asserted the right of Indians govern themselves. Her commitment to good…
— Narendra Modi (@narendramodi) January 3, 2026
“ராணி வேலு நாச்சியாரின் பிறந்தநாளில் அவருக்கு மரியாதை செலுத்துகிறேன். துணிச்சலையும், வியூகத் திறமையையும் கொண்டிருந்த அவர், இந்தியாவின் துணிச்சல் மிக்க வீராங்கனைகளில் ஒருவராக நினைவுகூரப்படுகிறார். காலனித்துவ ஒடுக்குமுறைக்கு எதிராகக் கிளர்ந்தெழுந்த அவர், இந்தியாவை ஆள இந்தியர்களுக்கே உரிமை உண்டு என்பதை வலியுறுத்தினார். நல்லாட்சி மற்றும் கலாச்சார பெருமைக்கான அவரது உறுதிப்பாடும் போற்றத்தக்கது. அவரது தியாகமும் தொலைநோக்குத் தலைமையும் பல தலைமுறைகளை ஊக்கப்படுத்தும்.”
ராணி வேலு நாச்சியாரின் பிறந்தநாளில் அவருக்கு மரியாதை செலுத்துகிறேன். துணிச்சலையும், வியூகத் திறமையையும் கொண்டிருந்த அவர், இந்தியாவின் துணிச்சல் மிக்க வீராங்கனைகளில் ஒருவராக நினைவுகூரப்படுகிறார். காலனித்துவ ஒடுக்குமுறைக்கு எதிராகக் கிளர்ந்தெழுந்த அவர், இந்தியாவை ஆள…
— Narendra Modi (@narendramodi) January 3, 2026


