తమిళనాడులో నాలుగు లేన్ల మరక్కణం - పుదుచ్చేరి (46 కి.మీ.) రహదారిని నిర్మించేందుకు ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును రూ.2,157 కోట్ల మూలధన వ్యయంతో హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతి (హెచ్ఏఎం)లో అభివృద్ధి చేస్తారు.

ప్రస్తుతం చెన్నై, పుదుచ్చేరి, విలుప్పురం, నాగపట్టణం మధ్య రవాణా అనుసంధానం ఇప్పటికే రెండు లేన్ల జాతీయ రహదారి 332ఎ (ఎన్‌హెచ్ - 332ఏ), అనుబంధ రాష్ట్ర రహదారులపై ఆధారపడి ఉంది. ఈ రహదారుల్లో రద్దీ కారణంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా కారిడార్‌ను ఆనుకొని జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, ప్రధాన నగరాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంది. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఎన్‌హెచ్-332ఏ జాతీయ రహదారిని మరక్కణం నుంచి పుదుచ్చేరి వరకు 46 కి.మీ. మేర నాలుగు లేన్లుగా విస్తరించనున్నారు. తద్వారా రద్దీ తగ్గి భద్రత పెరుగుతుంది. అలాగే వేగంగా విస్తరిస్తున్న చెన్నై, పుదుచ్చేరి, విలుప్పురం, నాగపట్టణం లాంటి నగరాల రవాణా అవసరాలు కూడా తీరతాయి.

రెండు ప్రధాన జాతీయ రహదారులు (ఎన్‌హెచ్-32, ఎన్‌హెచ్-332), రెండు రాష్ట్ర రహదారులు (ఎస్‌హెచ్ - 136, ఎస్‌హెచ్- 203)ను ఈ ప్రాజెక్టు కలుపుతుంది. తద్వారా తమిళనాడులోని ప్రధాన ఆర్థిక, సామాజిక, లాజిస్టిక్ కేంద్రాలకు ఎలాంటి అవరోధాలు లేని రవాణా సదుపాయాన్ని అందిస్తుంది. ఈ కారిడార్ రెండు రైల్వే స్టేషన్లు (పుదుచ్చేరి, చిన్నబాబుసముద్రం), ఒక మైనర్ నౌకాశ్రయం (కడలూర్)ను అనుసంధానించి బహుళ విధ రవాణా వ్యవస్థను ఏకీకృతం చేస్తుంది. తద్వారా ఈ ప్రాంతంలో సరకు, ప్రయాణికుల రవాణా సులభతరమవుతుంది.

మరక్కణం-పుదుచ్చేరి విభాగం పూర్తయిన తర్వాత ప్రాంతీయ ఆర్థికాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తుంది. ప్రధాన ఆధ్యాత్మిక, ఆర్థిక కేంద్రాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తుంది. పుదుచ్చేరిలో పర్యాటకాన్ని పెంపొందిస్తుంది. అలాగే వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధిలో కొత్త అవకాశాలను అందిస్తుంది. అలాగే ఈ ప్రాజెక్టు దాదాపుగా 8 లక్షల ప్రత్యక్ష పని దినాలు, 10 లక్షల పరోక్ష పని దినాల ఉపాధిని సృష్టిస్తుంది. అలాగే పరిసర ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమానికి కొత్త మార్గాలను తెరుస్తుంది.

కారిడార్ మ్యాపు

 

Appendix - I: Project Details

Feature

Details

Project Name

4-Lane Marakkanam – Puducherry Section (NH 332A)

Corridor

Chennai–Puducherry–Nagapattinam-Tuticorin-Kanyakumari Economic Corridor (East Coast Road - ECR)

Length (km)

46.047

Total Civil Cost (Rs Cr.)

1,118

Land Acquisition Cost (Rs Cr.)

442

Total Capital Cost (Rs Cr.)

2,157

Mode

Hybrid Annuity Mode (HAM)

Bypasses

Puducherry Bypass (Greenfield Access Controlled) – 34.7 km

Major Roads Connected

National Highways – NH-32, NH-332

State Highways – SH-136, SH-203

Economic / Social / Transport Nodes Connected

Airports: Chennai, Puducherry

Railway Stations: Puducherry, Chinnababusamudram

Minor Port: Cuddalore

Economic Nodes: Mega Food Park, Pharma Cluster, Fishing Cluster

Social Nodes: Arulmigu Manakula Temple, Paradise Beach

Major Cities / Towns Connected

Chennai, Marakkanam, Puducherry

Employment Generation Potential

8 lakh Man-Days (direct) & 10 lakh Man-Days (indirect)

Annual Average Daily Traffic (AADT) in FY-25

Estimated at 17,800 Passenger Car Units (PCU)

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Housing ministry raises EWS housing target under PMAY 2.0 by 350%

Media Coverage

Housing ministry raises EWS housing target under PMAY 2.0 by 350%
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the loss of lives in a mishap in East Jaintia Hills, Meghalaya
February 05, 2026
PM announces ex-gratia from PMNRF

Prime Minister Shri Narendra Modi today condoled the loss of lives the mishap in East Jaintia Hills, Meghalaya. He announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased and Rs. 50,000 to the injured.

The PMO India handle in post on X said:

“Pained by the mishap in East Jaintia Hills, Meghalaya. Condolences to those who lost their loved ones. May the injured recover at the earliest.

An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi”