QuoteLays foundation stone and launches several sanitation and cleanliness projects worth about Rs 10,000 crore
Quote“As we mark Ten Years of Swachh Bharat, I salute the unwavering spirit of 140 crore Indians for making cleanliness a 'Jan Andolan'”
Quote“Clean India is the world's biggest and most successful mass movement in this century”
Quote“Impact that the Swachh Bharat Mission has had on the lives of common people of the country is priceless”
Quote“Number of infectious diseases among women has reduced significantly due to Swachh Bharat Mission”
Quote“Huge psychological change in the country due to the growing prestige of cleanliness”
Quote“Now cleanliness is becoming a new path to prosperity”
Quote“Swachh Bharat Mission has given new impetus to the circular economy”
Quote“Mission of cleanliness is not a one day ritual but a lifelong ritual”
Quote“Hatred towards filth can make us more forceful and stronger towards cleanliness”
Quote“Let us take an oath that wherever we live, be it our home, our neighbourhood or our workplace, we will maintain cleanliness”

నా కేంద్ర మంత్రివర్గ సహచరులు శ్రీ మనోహర్ లాల్ గారు, శ్రీ సి. ఆర్. పాటిల్ గారు, శ్రీ తోఖాన్ సాహు గారు, శ్రీ రాజ్ భూషణ్ గారు, ఇతర ప్రముఖులు, మహిళలు ఇంకా పెద్దలు !

నేడు పూజ్య బాపూజీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి. ఈ భరతమాత గొప్ప కుమారులకు వినమ్రంగా నమస్కరిస్తున్నాను. గాంధీజీ, ఇతర మహనీయులు భారతదేశం కోసం కన్న కలను సాకారం చేసేందుకు కలిసి పనిచేయడానికి ఈ రోజు మనందరికీ స్ఫూర్తినిస్తుంది.

 

స్నేహితులారా,

ఈ అక్టోబర్ 2న, నేను కర్తవ్య భావంతో నిండిపోయాను. తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యాను. స్వచ్ఛభారత్ మిషన్ కు నేటితో పదేళ్లు పూర్తయ్యాయి. స్వచ్ఛభారత్ మిషన్ ఈ పదేళ్ల ప్రయాణం కోట్లాది మంది భారతీయుల అచంచలమైన నిబద్ధతకు నిదర్శనం. గడచిన పదేళ్లలో లెక్కకు మించి భారతీయులు ఈ మిషన్ ను స్వీకరించి, తమదిగా చేసుకుని, తమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నారు. ప్రతి పౌరుడికి, మన పారిశుద్ధ్య కార్మికులకు, మన మత నాయకులకు, మన అథ్లెట్లకు, మన ప్రముఖులకు, స్వచ్ఛంద సంస్థలకు, మీడియా స్నేహితులకు నా హృదయపూర్వక ప్రశంసలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మీరంతా కలిసి స్వచ్ఛభారత్ మిషన్ ను ఇంత పెద్ద ప్రజా ఉద్యమంగా మార్చారు. పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొని దేశానికి ఎనలేని స్ఫూర్తినిస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతిలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అందించిన సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమాలు పెద్దఎత్తున జరుగుతున్నాయి. ప్రజలు తమ గ్రామాలు, నగరాలు, పరిసర ప్రాంతాలను అవి చావిళ్ళు, ఫ్లాట్లు, సొసైటీలు ఏదైనా సరే ఉత్సాహంగా శుభ్రపరుస్తున్నారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొని ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు. కేవలం గత పక్షం రోజుల్లోనే దేశవ్యాప్తంగా కోట్లాది మంది పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 15 రోజుల పాటు జరిగిన సేవా పక్షోత్సవాల్లో దేశవ్యాప్తంగా 27 లక్షలకు పైగా కార్యక్రమాలు జరిగాయి. వీటిలో 28 కోట్ల మంది పాల్గొన్నారని నాకు సమాచారం అందింది. నిరంతర కృషితోనే భారత్ ను పరిశుభ్రంగా ఉంచగలం. ప్రతి భారతీయుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

 

స్నేహితులారా,

నేడు ఈ ముఖ్యమైన సందర్భాన్ని పురస్కరించుకుని పరిశుభ్రతకు సంబంధించి దాదాపు రూ.10,000 కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. అమృత్ మిషన్ లో భాగంగా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నీరు, మురికి నీటి శుద్ధి (వాటర్, సీవరేజ్ ట్రీట్ మెంట్) ప్లాంట్లను నిర్మించనున్నాం. "నమామి గంగే" అయినా లేదా "గోబర్ధన్" ప్లాంట్ల ద్వారా వ్యర్థాల నుండి బయోగ్యాస్ ఉత్పత్తికి సంబంధించిన పనులు అయినా కావచ్చు, ఈ కార్యక్రమాలు స్వచ్ఛ భారత్ మిషన్ ను కొత్త శిఖరాలకు తీసుకువెళతాయి. స్వచ్ఛభారత్ మిషన్ ఎంత విజయవంతమైతే మన దేశం అంత వెలుగుతో మెరిసిపోతుంది.

 

|

స్నేహితులారా,

వెయ్యేళ్ల తర్వాత కూడా 21వ శతాబ్దపు భారత్ ను అధ్యయనం చేస్తే స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిస్సందేహంగా గుర్తుండిపోతుంది. స్వచ్ఛభారత్ అనేది ప్రపంచంలోనే ఈ శతాబ్దపు అతిపెద్ద , అత్యంత విజయవంతమైన ప్రజల నేతృత్వంలోని, ప్రజల ఆధారిత ప్రజా ఉద్యమం. నేను దైవంగా భావించే ప్రజల శక్తిని ఈ మిషన్ నాకు చూపించింది. నాకు పరిశుభ్రత అనేది ప్రజల శక్తికి సంబరంగా మారింది. నాకు చాలా గుర్తుకొస్తాయి... ఈ ప్రచారం ప్రారంభమైనప్పుడు, లక్షలాది మంది ప్రజలు ఏకకాలంలో శుభ్రత కార్యక్రమాలు ప్రారంభించారు. పెళ్లిళ్ల నుంచి బహిరంగ కార్యక్రమాల వరకు ప్రతిచోటా పరిశుభ్రత సందేశం ఉండేది. ఓ వృద్ధ తల్లి మరుగుదొడ్ల నిర్మాణానికి సహకరించేందుకు తన మేకలను విక్రయించగా, కొందరు మంగళసూత్రాలను సైతం విక్రయించారు. వమరికొందరు మరుగుదొడ్ల నిర్మాణానికి భూమిని విరాళంగా ఇచ్చారు. కొందరు రిటైర్డ్ ఉపాధ్యాయులు తమ పింఛన్లను విరాళంగా ఇవ్వగా, సైనికులు తమ రిటైర్మెంట్ నిధులను పరిశుభ్రతకు విరాళంగా ఇచ్చారు. ఈ విరాళాలను దేవాలయాలకు లేదా మరేదైనా కార్యక్రమానికి ఇచ్చి ఉంటే అవి పత్రికల్లో పతాక శీర్షికలకు ఎక్కి వారం రోజుల పాటు చర్చకు వచ్చేవి. కానీ ఎప్పుడూ టీవీల్లో కనిపించని ముఖాలు, ఎప్పుడూ పతాక శీర్షికల్లో లేనివారు, సమయం అయినా, సంపద అయినా విరాళాలు ఇచ్చి, ఈ ఉద్యమానికి కొత్త బలాన్ని, శక్తిని ఇచ్చారని దేశం తెలుసుకోవాలి. ఇది మన దేశ స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది.

 

ఒకటే సారి వాడే (సింగిల్ యూజ్) ప్లాస్టిక్ ను వదులుకోవడం గురించి నేను మాట్లాడినప్పుడు, కోట్లాది మంది షాపింగ్ కోసం జనపనార, క్లాత్ బ్యాగులను ఉపయోగించడం ప్రారంభించారు. వారికి రుణపడి ఉంటాను. అలా గాకుండా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధించడం గురించి నేను మాట్లాడి ఉంటే, ప్లాస్టిక్ పరిశ్రమకు చెందిన వారు నిరసన తెలిపేవారు, నిరాహార దీక్షలు చేసేవారు... కానీ వారు అలా చేయలేదు. ఆర్థికంగా నష్టపోయినా సహకరించారు. అలాగే, నేను రాజకీయ పార్టీలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే వారు మోదీ ఒకటే సారి వాడే ప్లాస్టిక్‌పై నిషేధం విధించడంతో నిరుద్యోగం పెరిగిందంటూ ఆందోళనకు దిగవచ్చని అనిపించినా వారు అలా చేయనందుకు, వారి దృష్టి అక్కడికి వెళ్లకపోవడం పట్ల నేను కృతజ్ఞతతో ఉన్నాను,

 

స్నేహితులారా,

ఈ మహోద్యమంలో మన సినీ పరిశ్రమ కూడా ఏ మాత్రం వెనుకబడలేదు. వాణిజ్య ప్రయోజనాలపై దృష్టి పెట్టకుండా పరిశుభ్రత సందేశాన్ని వ్యాప్తి చేసే సినిమాలను పరిశ్రమ అందించింది. ఈ 10 సంవత్సరాలలో, ఇది ఒక్కసారితో ముగిసే ప్రక్రియ కాదని, ఇది ప్రతి క్షణం , ప్రతిరోజూ చేయవలసిన నిరంతర పని అని నేను భావించాను. నేను ఒకటి ప్రత్యేకంగాభావించినప్పుడు , నేను దానికి నమ్మకంగా కట్టుబడి ఉంటాను. 'మన్ కీ బాత్'లో పరిశుభ్రత గురించి నేను దాదాపు 800 సార్లు ప్రస్తావించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. పరిశుభ్రత పట్ల తమ కృషిని, అంకితభావాన్ని తెలియజేస్తూ ప్రజలు లక్షలాది లేఖలు పంపుతున్నారు.

 

స్నేహితులారా,

ఈ రోజు, నేను దేశం విజయాలను, దేశ ప్రజల విజయాలను చూస్తున్నప్పుడు, ఒక ప్రశ్న తలెత్తుతుంది: ఇది ఇంతకు ముందు ఎందుకు జరగలేదు? స్వాతంత్య్రోద్యమ సమయంలో మహాత్మాగాంధీ పరిశుభ్రతకు మార్గం చూపారు. ఆయన మనకు చూపించడమే కాకుండా నేర్పించారు. మరి స్వాతంత్య్రానంతరం పరిశుభ్రతపై ఎందుకు దృష్టి పెట్టలేదు? గాంధీ పేరు మీద అధికారం ఆశించి, ఆయన పేరు మీద ఓట్లు సంపాదించిన వారు ఆయన ఇష్టపడే అంశమైన పరిశుభ్రతను ఎందుకు విస్మరించారు? మరుగుదొడ్లు లేకపోవడాన్ని వారు దేశానికి ఒక సమస్యగా చూడలేదు, ఆశుద్దాన్ని జీవనం లో భాగం అనుకున్నారు. ఫలితంగా ప్రజలు మురికి కూపాల్లో బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. మురికి నిత్యజీవితంలో భాగమైపోయింది. పరిశుభ్రతపై చర్చించడం మానేశారు. కాబట్టి, నేను ఎర్రకోట నుండి ఈ సమస్యను లేవనెత్తినప్పుడు, అది తుఫానుకు కారణమైంది. మరుగుదొడ్లు, పరిశుభ్రత గురించి మాట్లాడటం భారత ప్రధాని పని కాదని కొందరు నన్ను ఎగతాళి చేశారు. ఇంకా ఎగతాళి చేస్తూనే ఉన్నారు.

 

|

కానీ ,స్నేహితులారా,

ఈ దేశంలోని సామాన్య ప్రజల జీవనాన్ని సులభతరం చేయడమే భారత ప్రధాని మొదటి పని. నా బాధ్యతను అర్థం చేసుకుని మరుగుదొడ్ల గురించి, శానిటరీ ప్యాడ్స్ గురించి మాట్లాడాను. ఈ రోజు, మనం ఫలితాలను చూస్తున్నాము.

 

స్నేహితులారా,

పదేళ్ల క్రితం వరకు భారత జనాభాలో 60 శాతం మంది బహిరంగ మలవిసర్జన చేయాల్సి వచ్చేది. ఇది మనిషి గౌరవానికి భంగం కలిగించే పద్ధతి. అంతే కాదు, ఇది దేశంలోని పేదలకు, దళితులకు, గిరిజనులకు, వెనుకబడిన వర్గాలకు జరిగిన అవమానం- తరతరాలుగా కొనసాగుతున్న అవమానం. ఇళ్లలో మరుగుదొడ్లు లేకపోవడంతో అక్కాచెల్లెళ్లు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వారికి బాధను , అసౌకర్యాన్ని భరించడం తప్ప వేరే మార్గం లేకపోయింది. తమను తాము ఉపశమనం చేసుకోవడానికి చీకటి పడే వరకు వేచి ఉండాల్సి వచ్చేది. ఆ చీకటి వారి భద్రతకు హానికరంగా కూడా మారింది. చలి ఉన్నా, వర్షం పడ్డా సూర్యోదయానికి ముందే వారు ఆరు బయలుకు వెళ్లాల్సి వచ్చేది. నా దేశంలో కోట్లాది మంది తల్లులు ప్రతిరోజూ ఈ పరీక్షను ఎదుర్కొన్నారు. బహిరంగ మలవిసర్జన వల్ల కలిగే ఏర్పడే మురికి మన పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టింది. శిశు మరణాలకు ఇది ప్రధాన కారణం. అపరిశుభ్ర పరిస్థితుల కారణంగా గ్రామాలు, మురికివాడల్లో వ్యాధులు ప్రబలడం సర్వసాధారణం.

 

స్నేహితులారా,

ఇలాంటి పరిస్థితుల్లో ఏ దేశమైనా ఎలా పురోగతి సాధిస్తుంది? అందుకే పరిస్థితులు యథాతథంగా కొనసాగకూడదని నిర్ణయించుకున్నాం. మేము దీనిని జాతీయ , మానవతా సవాలుగా తీసుకున్నాం. దీనిని పరిష్కరించడానికి ఒక ప్రచారాన్ని ప్రారంభించాము. ఇక్కడే 'స్వచ్ఛ భారత్ మిషన్' (క్లీన్ ఇండియా మిషన్) కు బీజం పడింది. ఈ కార్యక్రమం, ఈ మిషన్, ఈ ఉద్యమం, ఈ ప్రచారం ప్రజా చైతన్యం కోసం ఈ ప్రయత్నం బాధ నుంచి పుట్టింది. బాధల నుంచి పుట్టిన ఉద్యమాలు ఎప్పటికీ అంతరించి పోవు. అనతికాలంలోనే కోట్లాది మంది భారతీయులు గొప్ప విజయాలు సాధించారు. దేశంలో 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మించారు. 40 శాతం కంటే తక్కువ ఉన్న టాయిలెట్ కవరేజీ ఇప్పుడు 100 శాతానికి చేరుకుంది.

 

 

స్నేహితులారా,

దేశంలోని సాధారణ పౌరుల జీవితాలపై స్వచ్ఛ భారత్ మిషన్ ప్రభావం వెలకట్టలేనిది. తాజాగా ఓ ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లో ఓ అధ్యయనం ప్రచురితమైంది. అమెరికాలోని వాషింగ్టన్ లోని ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, ఒహియో స్టేట్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా ఏటా 60 వేల నుంచి 70 వేల మంది చిన్నారుల ప్రాణాలను కాపాడినట్లు ఈ అధ్యయనం తెలిపింది. ఎవరైనా రక్తదానం చేసి ఒక్క ప్రాణాన్ని కాపాడినా అదొక మహత్తర ఘట్టం. కానీ, పరిశుభ్రత, చెత్తాచెదారం తొలగించడం, మురికిని తొలగించడం ద్వారా 60,000-70,000 మంది పిల్లల ప్రాణాలను కాపాడగలిగాం – దేవుడి నుంచి ఇంతకంటే ఆశీర్వాదం ఏముంటుంది? ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ ప్రకారం, 2014 - 2019 మధ్య 300,000 మంది ప్రాణాలను కాపాడారు, లేకపోతే డయేరియాతో వారిని కోల్పోవాల్సి వచ్చేది. ఇది మానవ సేవ కర్తవ్యంగా మారింది మిత్రులారా.

 

|

ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణం కారణంగా 90 శాతానికి పైగా మహిళలు సురక్షితంగా ఉన్నారని యునిసెఫ్ నివేదిక పేర్కొంది. స్వచ్ఛభారత్ మిషన్ వల్ల మహిళల్లో అంటువ్యాధుల వల్ల వచ్చే అనారోగ్యాలు కూడా గణనీయంగా తగ్గాయి. ఇది అంతటితో ఆగిపోలేదు. వేలాది పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించడం వల్ల మధ్యలో బడి మానేసే (డ్రాపవుట్) బాలికల శాతం బాగా తగ్గింది. పరిశుభ్రత కారణంగా గ్రామీణ కుటుంబాలు ఏటా సగటున రూ.50,000 ఆదా చేస్తున్నాయని యునిసెఫ్ మరో అధ్యయనంలో వెల్లడైంది. ఇంతకుముందు ఈ నిధులను తరచూ అనారోగ్యాల చికిత్సల కోసం లేదా అనారోగ్యం కారణంగా పనిచేయలేకపోవడం వల్ల కోల్పోయే ఆదాయం బదులు ఖర్చు చేసేవారు.

 

స్నేహితులారా,

పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వడం పిల్లల ప్రాణాలను కాపాడగలం. నేను మీకు మరొక ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. కొన్నేళ్ల క్రితం గోరఖ్ పూర్, పరిసర ప్రాంతాల్లో మెదడువాపు వ్యాధితో వందలాది మంది చిన్నారులు చనిపోతున్నారని బ్రేకింగ్ న్యూస్ లు వచ్చాయి. కానీ ఇప్పుడు మురికి తొలగిపోయి పరిశుభ్రత రావడంతో ఆ వార్తలు కూడా లేవు. మురికితో పాటు ఏం పోతుందో చూడండి! దీనికి ప్రధాన కారణం స్వచ్ఛభారత్ మిషన్ ప్రజల్లో తెచ్చిన చైతన్యం, ఆ తర్వాత వచ్చిన పరిశుభ్రత.

 

స్నేహితులారా,

 

శుభ్రత పట్ల పెరిగిన గౌరవం దేశ ప్రజలలో ఒక ప్రధానమైన మానసిక మార్పును తీసుకువచ్చింది. ఈ రోజు ఈ విషయాన్ని ప్రస్తావించడం ముఖ్యమని నేను భావిస్తున్నాను. ఇంతకు ముందు, పారిశుధ్య పనులతో సంబంధం ఉన్న వ్యక్తులను ఒక నిర్దిష్ట కోణం లో చూసేవారు. వారిని ఎలా హీనంగా చూసేవారో మనందరికీ తెలుసు. సమాజంలోని సంపన్న వర్గాలు చెత్తను పేర్చడం తమ హక్కు గానూ, దానిని శుభ్రపరచడం మరొకరి బాధ్యత గానూ ప్రచారం చేసేవారు. పైగా శుభ్రపరిచిన వారిని కించపరుస్తూ అహంకారంతో జీవించే వారు. కానీ మనమంతా పరిశుభ్రత ప్రయత్నాలలో పాల్గొనడం ప్రారంభించినప్పుడు, శుభ్ర పరిచే పనిలో ఉన్నవారికి కూడా తాము చేస్తున్న పని ఎంత ముఖ్యమో, తమ ప్రాధాన్యత ఏమిటో గుర్తించారు. ఇతరులు కూడా తమ ప్రయత్నాలలో భాగం అవుతున్నందుకు గర్విస్తున్నారు. ఇది పెద్ద మానసిక మార్పుకు దారితీసింది. స్వచ్ఛభారత్ మిషన్ కుటుంబాలకు, పారిశుద్ధ్య కార్మికులకు ఎనలేని గౌరవాన్ని, హుందా తనాన్ని తెచ్చిపెట్టింది. ఈ రోజు వారు తాము అందించే సేవకు గర్వపడుతున్నారు. తమ కడుపు నింపుకోవడానికి మాత్రమే కాకుండా, దేశం ప్రకాశవంతంగా మారడానికి కూడా కృషి చేస్తున్నారని వారు ఇప్పుడు గర్వపడుతున్నారు. స్వచ్ఛభారత్ మిషన్ లక్షలాది మంది పారిశుద్ధ్య కార్మికులకు గర్వకారణంగా నిలిచింది. పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు, వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. సెప్టిక్ ట్యాంకుల్లోకి మాన్యువల్ గా ప్రవేశించడం వల్ల కలిగే ప్రమాదాలను తొలగించేందుకు కృషి చేస్తున్నాం. ప్రభుత్వం, ప్రయివేటు రంగం, ప్రజలు కలిసి పనిచేస్తుండటంతో కొత్త సాంకేతికలతో అనేక కొత్త స్టార్టప్ లు పుట్టుకొస్తున్నాయి.

 

స్నేహితులారా,

స్వచ్ఛభారత్ మిషన్ కేవలం పరిశుభ్రత కార్యక్రమం మాత్రమే కాదు. దాని పరిధి విస్తృతంగా విస్తరిస్తోంది. ఇది ఇప్పుడు పరిశుభ్రత ఆధారిత అభ్యున్నతికి మార్గాన్ని సుగమం చేస్తోంది. స్వచ్ఛ భారత్ మిషన్ పెద్ద ఎత్తున ఉపాధి కూడా కల్పించింది. గత కొన్నేళ్లుగా కోట్లాది మరుగుదొడ్ల నిర్మాణంతో అనేక రంగాలకు లబ్ధి చేకూరింది. ప్రజలకు ఉపాధి లభిస్తోంది. గ్రామాల్లో తాపీ మేస్త్రీలు, ప్లంబర్లు, కూలీలు ఇలా ఎంతోమందికి కొత్త అవకాశాలు దొరికాయి. ఈ మిషన్ వల్ల సుమారు 1.25 కోట్ల మంది ఆర్థిక ప్రయోజనం లేదా ఉపాధి పొందారని యునిసెఫ్ అంచనా వేసింది. కొత్త తరం మహిళా తాపీ మేస్త్రీలు కూడా ఈ ప్రచారం ఫలితమే. ఇంతకు ముందు, మనం మహిళా మేస్త్రీల గురించి ఎప్పుడూ వినలేదు, కానీ ఇప్పుడు మీరు మహిళలు తాపీ మేస్త్రీలుగా పనిచేయడం చూడవచ్చు.

 

|

క్లీన్ టెక్నాలజీ తో యువతకు మెరుగైన ఉద్యోగాలు, అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం క్లీన్ టెక్ రంగంలో 5 వేల స్టార్టప్ లు రిజిస్టర్ అయ్యాయి. వ్యర్థాల నుంచి సంపద, వ్యర్థాల సేకరణ, రవాణా, నీటి పునర్వినియోగం, రీసైక్లింగ్ వంటి రంగాల్లో అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి ఈ రంగంలో 65 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని అంచనా. స్వచ్ఛ భారత్ మిషన్ ఇందులో నిస్సందేహంగా ప్రధాన పాత్ర పోషిస్తుంది.

 

స్నేహితులారా,

స్వచ్ఛ భారత్ మిషన్ సంపూర్ణ ఆర్థిక వ్యవస్థకి కూడా కొత్త ఊపునిచ్చింది. ఇంట్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాల నుంచి కంపోస్టు, బయోగ్యాస్, విద్యుత్, రోడ్డు నిర్మాణానికి అవసరమైన బొగ్గు వంటి పదార్థాలను ఉత్పత్తి చేస్తున్నాం. నేడు పశుపోషణలో నిమగ్నమైన రైతులకు, వృద్ధ పశువులను నిర్వహించడం ఆర్థిక భారంగా మారవచ్చు. కానీ, ఇప్పుడు, గోబర్ ధన్ యోజనకు ధన్యవాదాలు, ఇకపై పాలను ఉత్పత్తి చేయని లేదా పొలాల్లో పని చేయని పశువులు కూడా ఆదాయ వనరుగా మారవచ్చు. వీటితో పాటు ఇప్పటికే దేశవ్యాప్తంగా వందలాది సీబీజీ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఈ రోజు, అనేక కొత్త ప్లాంట్లకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు జరిగాయి.

 

స్నేహితులారా,

శరవేగంగా మారుతున్న ఈ కాలంలో పరిశుభ్రతకు సంబంధించిన సవాళ్లను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న కొద్దీ, పట్టణీకరణ పెరిగే కొద్దీ వ్యర్థాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది, ఇది మరింత చెత్తకు దారితీస్తుంది. ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం వాడి పారవేసే ("యూజ్ అండ్ త్రో" ) నమూనా కూడా ఈ సమస్యకు దోహదం చేస్తుంది. ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో సహా కొత్త రకాల వ్యర్థాలను ఎదుర్కొంటాం. కాబట్టి, మన భవిష్యత్తు వ్యూహాలను మెరుగుపరుచుకోవాలి. రీసైకిల్ చేయదగిన పదార్థాలను ఎక్కువగా ఉపయోగించే సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్మాణ రంగం లో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మన కాలనీలు, గృహ సముదాయాలు, భవనాలను సాధ్యమైనంత వరకు వ్యర్థ రహితానికి (జీరో వేస్ట్) కు దగ్గరగా తెచ్చే విధంగా డిజైన్ చేయాలి. మనం దానిని జీరో వేస్ట్ లోకి తీసుకురాగలిగితే, అది నిజంగా చాలా బాగుంటుంది.

 

నీరు వృథా కాకుండా, శుద్ధి చేసిన మురుగునీటిని సమర్థవంతంగా వినియోగించేలా చూడాలి. నమామి గంగే ప్రాజెక్టు మనకు ఆదర్శం. ఈ చొరవ ఫలితంగా గంగానది ఇప్పుడు మరింత పరిశుభ్రంగా మారింది. అమృత్ మిషన్, అమృత్ సరోవర్ ప్రచారం కూడా గణనీయమైన మార్పులు తెస్తున్నాయి. ఇవి ప్రభుత్వం, ప్రజల భాగస్వామ్యం ద్వారా తీసుకువచ్చిన మార్పు కు శక్తిమంతమైన నమూనాలు. అయితే, ఇది సరిపోదని నేను నమ్ముతున్నాను. నీటి సంరక్షణ, నీటి శుద్ధి, నదుల ప్రక్షాళన కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై పెట్టుబడులు పెట్టడం కొనసాగించాలి. పరిశుభ్రతకు, పర్యాటకానికి ఎంత దగ్గరి సంబంధం ఉందో మనందరికీ తెలుసు. అందువల్ల మన పర్యాటక ప్రదేశాలు, పవిత్ర స్థలాలు, వారసత్వ ప్రదేశాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

 

|

స్నేహితులారా,

గత పదేళ్లలో పరిశుభ్రత విషయంలో ఎంతో సాధించాం. అయితే వ్యర్థాలను సృష్టించడం రోజువారీ దినచర్యగా ఉన్నట్లే, పరిశుభ్రత పాటించడం కూడా రోజువారీ అలవాటుగా ఉండాలి. వ్యర్థాలను సృష్టించబోమని ఏ వ్యక్తి లేదా జీవి చెప్పలేరు. వ్యర్థాలు అనివార్యమైతే పరిశుభ్రత కూడా అనివార్యమే. ఈ పనిని మనం ఒక రోజుకో, ఒక తరానికో కాదు, రాబోయే తరాలకూ కొనసాగించాలి. పరిశుభ్రతను ప్రతి పౌరుడు తమ బాధ్యతగా, కర్తవ్యంగా అర్థం చేసుకున్నప్పుడు, మార్పు తథ్యం. ఈ దేశ ప్రజలపై నాకు నమ్మకం ఉంది. ఇదే దేశం ప్రకాశించగలదని చెప్పడానికి భరోసా.

|

పరిశుభ్రత అనేది ఒక రోజు పని కాదు, జీవితకాల అభ్యాసం. దాన్ని తరతరాలకు మనం అందించాలి. పరిశుభ్రత అనేది ప్రతి పౌరుడి సహజ ప్రవృత్తిగా ఉండాలి. ఇది మన దైనందిన జీవితంలో భాగం కావాలి, మనం మురికి పట్ల అసహనాన్ని పెంపొందించుకోవాలి. మనచుట్టూ మురికిని చూడకూడదు. చూసి సహించకూడదు, మురికిపట్ల ద్వేషమే పరిశుభ్రత సాధనలో మనల్ని నిర్బంధం, బలోపేతం చేస్తుంది,

 

ఇళ్లలో చిన్న పిల్లలు వస్తువులను పరిశుభ్రంగా ఉంచుకోవడానికి వారి పెద్దలను ఎలా ప్రేరేపిస్తారో మనం చూశాము. చాలా మంది తమ మనవలు లేదా పిల్లలు 'మోదీగారు ఏం చెప్పారో చూడండి. ఎందుకు చెత్త వేస్తున్నారు?" అని తరచూ గుర్తు చేస్తుంటారని నాకు చెప్పారు. కారు కిటికీలోంచి బాటిల్ విసిరేయకుండా కూడా వారు అడ్డుకుంటున్నారు. ఈ ఉద్యమం వారిలో కూడా ఒక బీజం వేసింది.

 

అందువల్ల, ఈ రోజు నేను యువతకు , తరువాతి తరం పిల్లలకు చెప్పాలనుకుంటున్నాను: నిబద్ధతతో ఉందాం, పరిశుభ్రత అవసరాన్ని ఇతరులకు వివరించడం , ప్రోత్సహించడం కొనసాగిద్దాం. ఐక్యంగా ఉందాం. దేశం పరిశుభ్రంగా ఉండే వరకు మనం ఆగకూడదు. అది సాధ్యమేనని, మనం సాధించగలమని, భారతమాతను మురికి నుంచి కాపాడుకోవచ్చని గత పదేళ్ల విజయాలు మనకు చూపిస్తున్నాయి.

 

 
|

 

|

స్నేహితులారా,

 

ఈ రోజు, ఈ ప్రచారాన్ని జిల్లా, బ్లాక్, గ్రామం, పరిసరాలు వీధి స్థాయిలకు తీసుకెళ్లాలని నేను రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నాను. పరిశుభ్రమైన పాఠశాలలు, పరిశుభ్రమైన ఆసుపత్రులు, పరిశుభ్రమైన కార్యాలయాలు, పరిశుభ్రమైన పరిసరాలు, పరిశుభ్రమైన చెరువులు, పరిశుభ్రమైన బావుల కోసం వివిధ జిల్లాలు, బ్లాకుల్లో పోటీలు నిర్వహించాలి. ఇది పోటీ వాతావరణాన్ని సృష్టిస్తుంది నెలవారీ లేదా త్రైమాసిక ప్రాతిపదికన రివార్డులు, సర్టిఫికెట్లు ఇవ్వాలి. భారత ప్రభుత్వం కేవలం 2-4 నగరాలను పరిశుభ్రంగా లేదా 2-4 జిల్లాలను పరిశుభ్రంగా ప్రకటిస్తే సరిపోదు. దీన్ని ప్రతి ప్రాంతానికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. మన మున్సిపాలిటీలు నిరంతరం పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలి. అందుకోసం వాటికి తగిన ప్రతిఫలం ఇవ్వాలి. వ్యవస్థలు తిరిగి పాత పద్దతులకు వెళ్లడం కంటే దారుణం మరొకటి ఉండదు. అన్ని స్థానిక సంస్థలు పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని, దీనికే తొలి ప్రాధాన్యమివ్వాలని కోరుతున్నాను.

 

అందరం కలిసి ప్రతిజ్ఞ చేద్దాం. నేను నా తోటి పౌరులకు ‘ఇంట్లో, పొరుగున లేదా పనిప్రాంతంలో- ఎక్కడ ఉన్నా-మేం మురికిని సృష్టించం, దానిని సహించం’ అని ప్రతిజ్ఞ చేయాలని అభ్యర్థిస్తున్నాను. పరిశుభ్రత మన సహజ అలవాటుగా మారాలి. మన ప్రార్థనా స్థలాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లే, మన పరిసరాల పట్ల కూడా అదే భావాన్ని పెంపొందించుకోవాలి. 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) ప్రయాణంలో మనం చేసే ప్రతి ప్రయత్నం "పరిశుభ్రత శ్రేయస్సుకు దారితీస్తుంది" అనే మంత్రాన్ని బలపరుస్తుంది. మరోసారి మీ అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కొత్త ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగుతూ,వ్యర్థాలను , సృష్టించబోమని, పరిశుభ్రత కోసం మన వంతు కృషి చేస్తామని, మన బాధ్యతల నుంచి ఎప్పుడూ వెనకడుగు వేయబోమని ప్రతిజ్ఞ చేసి పూజ్య బాపుజీకి నిజమైన నివాళి అర్పిద్దాం. మీ అందరికీ శుభాభినందనలు.

 

చాలా ధన్యవాదాలు.

 

  • Ruman gulam sabir gmail com 5 Ruman gulam sabir gmail Ruman gulam sabir gmail @com .5 August 15, 2025

    काम सा पीएस मगा है नही मी ला है
  • Ruman gulam sabir gmail com 5 Ruman gulam sabir gmail Ruman gulam sabir gmail @com .5 August 15, 2025

    9335344248
  • Ruman gulam sabir gmail com 5 Ruman gulam sabir gmail Ruman gulam sabir gmail @com .5 August 15, 2025

    ₹2000 पीएस दावा कार ना है बहन कार ना है काम पर सा पैस माग है नही माला है इश लिया आप सा बोल रई है
  • Jitendra Kumar April 16, 2025

    🙏🇮🇳❤️
  • HANUMAN RAM November 29, 2024

    ghar ghar Modi
  • Parmod Kumar November 28, 2024

    jai shree ram
  • Asish Dash November 26, 2024

    Jay Modi ji
  • Dr. Siddhartha Pati November 23, 2024

    https://timesofindia.indiatimes.com/city/bhubaneswar/odisha-startup-innovates-with-bioplastics-from-seafood-waste/articleshow/115389780.cms
  • कृष्ण सिंह राजपुरोहित भाजपा विधान सभा गुड़ामा लानी November 21, 2024

    जय श्री राम 🚩 वन्दे मातरम् जय भाजपा विजय भाजपा
  • ram Sagar pandey November 07, 2024

    🌹🙏🏻🌹जय श्रीराम🙏💐🌹जय माता दी 🚩🙏🙏🌹🌹🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹🌹🌹🙏🙏🌹🌹
Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Over 100 border villages of Punjab to be developed under central scheme

Media Coverage

Over 100 border villages of Punjab to be developed under central scheme
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Narendra Modi receives a telephone call from President Macron
August 21, 2025
QuoteLeaders exchange views on efforts for peaceful resolution of the conflicts in Ukraine and the West Asia Region
QuotePrime Minister Modi reiterates India’s consistent support for early restoration of peace and stability
QuoteThe leaders discuss ways to further strengthen India-France strategic partnership

Today, Prime Minister Shri Narendra Modi received a phone call from the President of the French Republic H.E. Emmanuel Macron.

The leaders exchanged views on the ongoing efforts for peaceful resolution of conflicts in Ukraine and the West Asia region.

President Macron shared assessment on the recent meetings held between the leaders of the Europe, US and Ukraine in Washington. He also shared his perspectives on the situation in Gaza.

Prime Minister Modi reiterated India’s consistent support for peaceful resolution of the conflicts and early restoration of peace and stability.

The leaders also reviewed progress in the bilateral cooperation agenda, including in the areas of trade, defence, civil nuclear cooperation, technology and energy. They reaffirmed joint commitment to strengthen India-France Strategic Partnership and mark 2026 as ‘Year of Innovation’ in a befitting manner.

President Macron also conveyed support for early conclusion of Free Trade Agreement between India and the EU.

The leaders agreed to remain in touch on all issues.