QuoteFlags off Six Vande Bharat trains enhancing connectivity
QuoteDistributes sanction letters to 32,000 Pradhan Mantri Awas Yojana-Gramin (PMAY-G) beneficiaries and releases first installment of assistance of Rs 32 crore
QuoteParticipates in Griha Pravesh celebrations of 46,000 beneficiaries
Quote“Jharkhand has the potential to become the most prosperous state of India, Our government is committed to developed Jharkhand and developed India”
Quote“Mantra of 'Sabka Saath, Sabka Vikas' has changed the thinking and priorities of the country”
Quote“Expansion of rail connectivity in eastern India will boost the economy of the entire region”
Quote“PM Janman Yojana is being run for tribal brothers and sisters across the country”

జార్ఖండ్ గవర్నర్ శ్రీ సంతోష్ గంగ్వార్ జీ, 

నా మంత్రిమండ‌లి సహచరులు శివరాజ్ సింగ్ చౌహాన్ జీ, అన్నపూర్ణా దేవి జీ , సంజయ్ సేథ్ జీ.. 

ఎంపీ విద్యుత్ మహతో జీ, రాష్ట్ర ప్రభుత్వ మంత్రి ఇర్ఫాన్ అన్సారీ జీ, 

జార్ఖండ్ బీజేపీ అధ్యక్షుడు బాబులాల్ మరాండీ జీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడు సుదేశ్ మహతో జీ, 

ఎమ్మెల్యేలు, ఇతర విశిష్ట అతిథులు, సోద‌ర సోద‌రీమ‌ణులారా...

 

బాబా బైద్యనాథ్, బాబా బసుకినాథ్ పాదాల‌కు నా ప్ర‌ణామాలు అర్పిస్తున్నాను. గిరిజ‌న వీరుడు బిర్సా ముండాకు జ‌న్మ‌నిచ్చిన మాతృభూమికి నా వంద‌నాలు. ఈ రోజు చాలా శుభప్రదమైన రోజు.

జార్ఖండ్ రాష్ట్రం  ప్రస్తుతం ప్రకృతి ఆరాధనతో కూడిన కర్మ పండుగను జరుపుకుంటోంది. 

ఈ రోజు ఉదయం నేను రాంచీ విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు, కర్మ పండుగకు చిహ్నం అయిన జావాతో ఒక సోదరి నాకు స్వాగ‌తం ప‌లికారు. ఈ పండుగ సందర్భంగా సోదరీమణులు తమ సోదరుల క్షేమం కోసం ప్రార్థిస్తారు. కర్మ పండుగ సందర్భంగా జార్ఖండ్ ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పవిత్రమైన రోజున, జార్ఖండ్ రాష్ట్రానికి కొన్ని అభివృద్ధి పనులు అందివచ్చాయి. ఆరు కొత్త వందే భారత్ రైళ్లు, 650 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు, అనుసందధాన ప్రయాణ సౌకర్యాల విస్తరణ, వీటితో పాటు, జార్ఖండ్‌లోని వేలాది మంది ప్రజలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సొంత పక్కాఇళ్లను పొంద‌బోతున్నారు. ఈ అభివృద్ధి పనులన్నింటి సంద‌ర్భంగా జార్ఖండ్ ప్రజలకు నా అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నాను. ఈ వందే భారత్ రైళ్లతో అనుసంధానం కాబోతున్న రాష్ట్రాల‌న్నిటికి  కూడా నా అభినంద‌న‌లు. 

 

|

స్నేహితులారా, 

ఒక‌ప్పుడు ఆధునిక సౌకర్యాలు, అభివృద్ధి దేశంలోని కొన్ని నగరాలకే పరిమితం. జార్ఖండ్ వంటి రాష్ట్రాలు ఆధునిక మౌలిక సదుపాయాలు,  అభివృద్ధికి నోచుకునేవి కావు. అయితే, 'సబ్కా సాథ్, సబ్కా వికాస్' మంత్రం దేశ ప్ర‌జ‌ల‌ ఆలోచనా విధానాన్నీ, దేశ ప్రాధాన్యతలనీ మార్చింది. ఇప్పుడు దేశానికి ప్రాధాన్యం పేదలు. ఇప్పుడు దేశానికి ప్రాధాన్యం ఆదివాసీలు, దళితులు, అణగారిన వ‌ర్గాలు. సమాజంలోని వెనుకబ‌డిన‌ వర్గాలే. ఇప్పుడు, కేంద్ర‌ ప్ర‌భుత్వ  ప్రాధాన్యత మహిళలు, యువత, రైతులు. అందుకే, జార్ఖండ్, ఇతర రాష్ట్రాల మాదిరిగానే వందే భారత్ వంటి హైటెక్ రైళ్లను ఆధునిక మౌలిక సదుపాయాలను పొందుతోంది.

స్నేహితులారా 

నేడు, ప్రతి రాష్ట్రం, నగరం వేగవంతమైన అభివృద్ధిని ఆశిస్తూ  వందే భారత్ వంటి అత్య‌ధిక వేగంతో ప్రయాణించే రైళ్లు త‌మ‌కు కూడా కావాలని కోరుకుంటున్నాయి. కొద్ది రోజుల కిందట ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల్లో 3 కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించాను.

నేడు, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సేవలు టాటానగర్ నుండి పాట్నాకు, టాటానగర్ నుండి ఒడిశాలోని బ్రహ్మపూర్ కు, రూర్కెలా నుండి టాటానగర్ మీదుగా హౌరాకు ప్రారంభ‌మ‌య్యాయి. అంతే కాదు భాగల్పూర్ నుండి దుమ్కా ద్వారా  హౌరాకు, దేవ్ ఘడ్ నుండి గయా ద్వారా వారణాసికి, గయా నుండి కోడెర్మా-పరస్నాథ్- ధన్‌బాద్ ద్వారా హౌరా వరకు రైలు సేవలు ప్రారంభమయ్యాయి. 

ఈ వేదికపై గృహాల పంపిణీ కార్యక్రమం జరుగుతుండగానే, నేను ఈ వందే భారత్ రైళ్లకు ప‌చ్చ జెండా ఊపాను. అవి వాటి గమ్యస్థానాలకు బయలుదేరాయి. తూర్పు భారతదేశంలో రైల్వేల విస్తరణ ఈ మొత్తం ప్రాంత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఈ రైళ్ల వల్ల వ్యాపారులకు, విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇది ఇక్కడ ఆర్థిక, సాంస్కృతిక కార్యకలాపాలను కూడా వేగవంతం చేస్తుంది. మీ అంద‌రికీ తెలిసిందే, దేశ‌వ్యాప్తంగానే కాకుండా, ప్రపంచం నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు కాశీకి వస్తుంటారు. వందే భారత్ రైళ్లు కాశీ నుండి దేవ్ ఘడ్ వరకు ప్రయాణాన్ని సులభతరం చేయడంతో, భ‌క్తుల్లో  చాలా మంది బాబా బైద్యనాథ్‌ను కూడా దర్శించుకుంటారు. అంతే కాదు ఇదిక్కడ పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తుంది. టాటానగర్ దేశంలోనే ఒక ప్రధాన పారిశ్రామిక కేంద్రం. మంచి రవాణా సౌకర్యాలవ‌ల్ల దాని పారిశ్రామిక అభివృద్ధి మరింత వేగవంత‌మ‌వుతుంది. పర్యాటక, పరిశ్రమల రంగాల‌కు ల‌భించే ప్రోత్సాహం కార‌ణంగా జార్ఖండ్ యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

 

|

స్నేహితులారా, 

అభివృద్ధి వేగవంతంకావాలంటే ఆధునిక రైల్వే మౌలిక సదుపాయాలనేవి కీలకం. అందుకే ఈ రోజు ఇక్కడ అనేక కొత్త ప్రాజెక్టులను  ప్రారంభించాం. మధుపూర్ బైపాస్ లైన్‌కు శంకుస్థాపన చేశాం. ఇది  పూర్తయిన తర్వాత, హౌరా-ఢిల్లీ ప్రధాన మార్గంలో రైళ్లను ఆపాల్సిన అవసరం ఉండదు. బైపాస్ లైన్ అనేది గిరిడిహ్,  జసిదిహ్ మధ్య ప్రయాణ సమయాన్ని కూడా తగ్గిస్తుంది. ఈ రోజు హజారీబాగ్ టౌన్ కోచింగ్ డిపోకు శంకుస్థాపన చేశాం. ఇది కొత్త‌గా ప‌లు రైలు సేవలకు దోహ‌దం చేస్తుంది. కుర్కురియా నుండి కనారోన్ వరకు రైలు మార్గాన్ని డ‌బ్లింగ్‌ చేయడంవల్ల  జార్ఖండ్‌లో రైలు అనుసంధానం బలోపేతమ‌వుతుంది. ఈ  డ‌బ్లింగ్ ప‌ని పూర్తయితే ఉక్కు పరిశ్రమకు చెందిన వస్తువుల రవాణా సులువుగా సాగుతుంది. 

 

స్నేహితులారా, 

 

జార్ఖండ్ అభివృద్ధి కోసం కేంద్ర‌ప్ర‌భుత్వం త‌న‌పెట్టుబడులను పెంచింది.  పనులను వేగవంతం చేసింది. ఈ ఏడాది జార్ఖండ్‌లో రైలు మౌలిక సదుపాయాల అభివృద్ధికి బడ్జెట్టులో రూ.7,000 కోట్లకు పైగా నిధులను కేటాయించారు. 10 ఏళ్ల కిందట కేటాయించిన బడ్జెట్‌తో పోలిస్తే ఇది 16 రెట్లు ఎక్కువ. పెరిగిన రైలు బడ్జెట్ ప్రభావాన్ని గ‌మ‌నించ‌వ‌చ్చు. నేడు, కొత్త రైలు మార్గాలను వేయడం, ఇప్పటికే ఉన్న మార్గాలను రెట్టింపు (డ‌బ్లింగ్) చేయడం, జార్ఖండ్ రాష్ట్ర స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలను మెరుగుపరచడం వంటి పనులు వేగంగా జరుగుతున్నాయి.  రైల్వే మార్గాలు వంద‌ శాతం విద్యుదీకర‌ణ అయిన‌ రాష్ట్రాల్లో జార్ఖండ్ కూడా ఉంది. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద, జార్ఖండ్‌లోని 50కి పైగా రైల్వే స్టేషన్ల‌ను పున‌రుద్ద‌రిస్తున్నాం. 

 

స్నేహితులారా,

ప‌క్కా గృహాల నిర్మాణం కోసం జార్ఖండ్‌లోని వేలాది మంది లబ్ధిదారులకు మొదటి విడత నిధులు విడుదల చేశాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వేలాది మందికి పక్కా గృహాలు కూడా అందించాం.. ఇళ్లతో పాటు మరుగుదొడ్లు, నీరు, విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు వంటి సౌకర్యాలు కల్పించాం. ఒక కుటుంబానికి సొంత ఇల్లు ల‌భిస్తే, అది వారి ఆత్మగౌరవాన్ని పెంచుతుంద‌నే విష‌యాన్ని మ‌నం గుర్తు పెట్టుకోవాలి. త‌ద్వారా వారు తమ ప్ర‌స్తుత స్థితిగ‌తుల‌ను మెరుగుపరచుకోవడమే కాకుండా మంచి భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తారు. ఎలాంటి సంక్షోభం వచ్చినా స‌రే  తమకంటూ సొంత ఇల్లు ఉందని వారు భావిస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజనతో, జార్ఖండ్ ప్రజలు శాశ్వత గృహాలను పొందుతున్నారు. అంతే కాకుండా ఈ ప‌థ‌కంద్వారా  గ్రామాలు,  నగరాల్లో అనేక ఉపాధి అవకాశాల క‌ల్ప‌న జ‌రుగుతోంది. 

 

స్నేహితులారా, 

2014 నుండి, దేశంలోని పేదలు, దళితులు, నిరుపేదలు,  గిరిజన కుటుంబాల సాధికారత కోసం అనేక కీల‌క‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకున్నాం. జార్ఖండ్‌తో సహా దేశవ్యాప్తంగా ఉన్న గిరిజన సోద‌ర సోదరీమణుల కోసం పీఎం జ‌న్ మ‌న్ ( PM JANMAN ) పథకం అమలు చేస్తున్నాం. అత్యంత వెనుకబడిన గిరిజనుల సంక్షేమ‌మే ఈ పథకం లక్ష్యం. ఈ కుటుంబాలకు ఇళ్లు, రోడ్లు, కరెంటు, మంచినీరు, విద్య అందించడానికి అధికారులు స్వయంగా అక్కడికి చేరుకుంటున్నారు. ఈ ప్రయత్నాలు ‘విక‌సిత్ జార్ఖండ్' సాధ‌న‌ కోసం మేం క‌న‌బ‌రుస్తున్న‌ నిబద్ధతలో భాగం. అందరి దీవెనలతో ఖచ్చితంగా ల‌క్ష్యాన్ని చేరుకుంటామ‌ని, జార్ఖండ్ కలలను సాకారం చేయగలమని నేను విశ్వసిస్తున్నాను. ఈ కార్యక్రమం తరువాత, నేను మరొక భారీ బహిరంగ సభకు వెళ్తున్నాను. నేను 5-10 నిమిషాలలో అక్కడికి చేరుకుంటాను. అక్కడ నా కోసం పెద్ద సంఖ్యలో ప్రజలు వేచి ఉన్నారు. జార్ఖండ్‌కు సంబంధించిన ఇతర అంశాలను అక్కడ వివరంగా చర్చిస్తాను. కానీ. జార్ఖండ్ ప్రజల నుండి క్షమాపణలు కోరుతున్నాను. ఎందుకంటే నేను రాంచీకి చేరుకున్నప్పటికీ ప్రకృతి సహకరించలేదు. అందువల్ల నేను ఇక్కడి నుండి హెలికాప్టర్‌లో బయలుదేరలేక పోతున్నాను. దాంతో నేను అక్కడికి చేరుకోలేకపోతున్నాను. అందుకే ఈ కార్యక్రమాలన్నింటిని ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించి ప్రజలకు అంకితం చేస్తున్నాను. నేను కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బహిరంగ సభలో ప్రసంగిస్తాను. మరోసారి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నమస్కారం.

 

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Making India the Manufacturing Skills Capital of the World

Media Coverage

Making India the Manufacturing Skills Capital of the World
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
List of Outcomes: State Visit of Prime Minister to Ghana
July 03, 2025

I. Announcement

  • · Elevation of bilateral ties to a Comprehensive Partnership

II. List of MoUs

  • MoU on Cultural Exchange Programme (CEP): To promote greater cultural understanding and exchanges in art, music, dance, literature, and heritage.
  • MoU between Bureau of Indian Standards (BIS) & Ghana Standards Authority (GSA): Aimed at enhancing cooperation in standardization, certification, and conformity assessment.
  • MoU between Institute of Traditional & Alternative Medicine (ITAM), Ghana and Institute of Teaching & Research in Ayurveda (ITRA), India: To collaborate in traditional medicine education, training, and research.

· MoU on Joint Commission Meeting: To institutionalize high-level dialogue and review bilateral cooperation mechanisms on a regular basis.