అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా చైతన్యపరిచేందుకు భారత్‌లో కొత్త సామాజిక ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి: ప్రధాని
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ భారత అమర సంస్కృతికి ఆధునిక వటవృక్షం లాంటిది. ఇది భారతీయ సంస్కృతిని, దేశ చైతన్యాన్ని నిరంతరం సజీవంగా ఉంచుతోంది: ప్రధాని
చేస్తున్న పనుల్లో దృష్టి నా అనే దాని మీద కాకుండా మన అన్న దానిపై ఉన్నప్పుడు, దేశ స్ఫూర్తి అత్యంత ప్రాధాన్యమిచ్చినప్పుడు.. విధానాలు, నిర్ణయాల్లో దేశ ప్రజల ప్రయోజనాలే అత్యంత ముఖ్యమైన అంశంగా ఉన్నప్పుడు మాత్రమే వాటి ప్రభావం ప్రతిచోటా కనిపిస్తుంది: ప్రధాని
ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి విపత్తు సంభవించినా మనస్ఫూర్తిగా సేవలందించేందుకు భారత్ నిలబడుతోంది: ప్రధాని
జాతి నిర్మాణ స్ఫూర్తితో నిండిన మన యువత 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యం దిశగా ముందుకెళ్తోంది: ప్రధాని
నవరాత్రి, ఇతర పండుగల సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

భారత్ మాతాకీ జై,

భారత్ మాతాకీ జై,

భారత్ మాతాకీ జై,

గుడి పడ్వా, నూతన సంవత్సరారంభం సందర్భంగా నేను మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.  అత్యంత గౌరవనీయ సర్‌ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ , స్వామి గోవింద్ గిరి జీ మహారాజ్, స్వామి అవధేశానంద్ గిరి జీ మహారాజ్, ప్రజాదరణ పొందిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ , నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ , డాక్టర్ అవినాష్ చంద్ర అగ్నిహోత్రి, ఇతర గౌరవ ప్రముఖులు, ఇంకా ఇక్కడ హాజరైన సీనియర్ సహచరులారా! ఈరోజు రాష్ట్ర యజ్ఞం అనే పవిత్ర కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఈరోజు చైత్ర శుక్ల ప్రతిపాద  ఎంతో ప్రత్యేకమైన రోజు. పవిత్ర నవరాత్రుల ఉత్సవాలు కూడా కూడా ఈరోజు ప్రారంభమవుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లో గుడి పడ్వా, ఉగాది, నవరే పండుగలను కూడా ఈ రోజు జరుపుకుంటున్నారు. అలాగే ఈరోజు ఝులేలాల్ జీ, గురు అంగద్ దేవ్ జీ జయంతి కూడా. ఇవే కాకుండా, ఈ రోజు మన స్ఫూర్తి ప్రదాత, అత్యంత గౌరవనీయ డాక్టర్ సాహెబ్ జయంతి సందర్భం కూడా. అలాగే, ఈ ఏడాది రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఘనమైన 100 ఏళ్ల ప్రయాణం కూడా పూర్తవుతోంది. ఈ సందర్భంలో, ఈ రోజు స్మృతి మందిరాన్ని సందర్శించి, గౌరవనీయ డాక్టర్ సాహెబ్,  గౌరవనీయ గురూజీకి నివాళులర్పించే అవకాశం నాకు లభించింది.

మిత్రులారా,

ఈ మధ్యనే మన రాజ్యాంగం 75 సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకున్నాం. వచ్చే నెల మన రాజ్యాంగ శిల్పి బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి.  ఈ రోజు, నేను దీక్షాభూమిలో బాబా సాహెబ్‌కు నమస్కరించి, ఆయన ఆశీస్సులు తీసుకున్నాను. ఈ మహనీయులకు నేను ప్రణమిల్లుతున్నాను. నవరాత్రి సహా అన్ని పండుగల సందర్భంగా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు నాగ్‌పూర్‌లో, ఈ పవిత్ర సంఘ సేవ యాత్రలో, మనం ఒక పవిత్ర సంకల్పం విస్తరణకు సాక్షులమవుతున్నాం. ఇప్పుడే మాధవ్ నేత్రాలయ కుల్‌గీతంలో విన్నాం, ఇది ఆధ్యాత్మికత, విజ్ఞానం, విశ్వాసం, మార్గదర్శకంతో కూడిన అద్భుతమైన పాఠశాల. మానవత్వానికి అంకితమైన ఈ సేవా మందిరం ప్రతి అణువులోనూ ఒక దేవాలయంలా నిలుస్తుంది. పూజ్య గురూజీ ఆదర్శాలపై అనేక దశాబ్దాలుగా లక్షలాది మందికి సేవలందిస్తున్న సంస్థ మాధవ్ నేత్రాలయం. ప్రజల జీవితాల్లో తిరిగి వెలుగు ప్రసాదించింది. ఈ రోజు మాధవ్ నేత్రాలయ కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన జరిగింది.. ఈ కొత్త క్యాంపస్‌తో, ఈ సేవా కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగనున్నాయి. ఇది వేలాదిమంది కొత్తవారి జీవితాల్లో వెలుగును ప్రసరింపజేస్తుంది, వారి జీవితాల్లోని చీకట్లు తొలగిపోతాయి. మాధవ్ నేత్రాలయతో అనుసంధానమైన ప్రతి ఒక్కరి సేవాభావానికి, వారు చేసిన పనులకు నా అభినందనలు తెలియజేస్తున్నాను. వారికి నా శుభాకాంక్షలు అందజేస్తున్నాను.

 

మిత్రులారా,

ఎర్రకోట నుంచి నేను అందరి ప్రయత్నాల గురించి మాట్లాడాను. ఈరోజు దేశం ఆరోగ్య రంగంలో చేస్తున్న విధంగా, మాధవ్ నేత్రాలయం ఆ ప్రయత్నాలను మరింత ముందుకు తీసుకెళుతోంది. దేశంలోని ప్రతి పౌరుడు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను పొందడం మా ప్రాధాన్యతగా ఉంది. దేశంలో నిరుపేదలకు కూడా ఉత్తమ వైద్యం అందాలి. దేశంలోని ప్రతి పౌరుడు గౌరవంతో జీవించాలి. దేశం కోసం తమ జీవితాలను అంకితం చేసిన వృద్ధులు చికిత్స గురించి ఆందోళనతో జీవించే పరిస్థితి ఉండకూడదు. ఇది ప్రభుత్వ విధానం.  అందుకే నేడు ఆయుష్మాన్ భారత్ ద్వారా కోట్లాది మందికి ఉచిత వైద్య సదుపాయాలు అందిస్తున్నాం. వేలాది జన ఔషధి కేంద్రాలు దేశంలోని పేద, మధ్యతరగతి కుటుంబాలకు తక్కువ ధరలకు మందులను అందిస్తున్నాయి. దేశంలో ఇప్పుడు సుమారు వెయ్యి డయాలిసిస్ కేంద్రాలు పనిచేస్తున్నాయి, ఇవి ఉచిత డయాలిసిస్ సేవలను ఒక యజ్ఞంగాకొనసాగిస్తున్నాయి. దీని ద్వారా దేశ ప్రజల వేల కోట్ల రూపాయలు ఆదా అవుతున్నాయి. వారికి ఆరోగ్య పరంగా ప్రయోజనాలు అందుతున్నాయి. గత 10 సంవత్సరాల్లో, గ్రామాల్లో లక్షలాది ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇక్కడ ప్రజలు దేశంలోని ప్రముఖ వైద్యుల నుంచి టెలిమెడిసిన్ ద్వారా సంప్రదింపులు పొందుతున్నారు, ప్రాథమిక చికిత్సను అందుకుంటున్నారు ఇంకా అవసరమైన తదుపరి సహాయాన్ని పొందుతున్నారు. వ్యాధి పరీక్షల కోసం వందలాది కిలోమీటర్లు ప్రయాణించాల్సిన అవసరం ఇప్పుడు వారికి లేదు. 

మిత్రులారా,

మేం కేవలం మెడికల్ కాలేజీల సంఖ్యను రెండింతలు చేయడమే కాకుండా, దేశంలో పని చేస్తున్న ఎయిమ్స్ ల సంఖ్యను మూడింతలు చేశాం. దేశంలో మెడికల్ సీట్లు కూడా రెండింతలు అయ్యాయి. రాబోయే కాలంలో ప్రజలకు మరింత మంది మంచి డాక్టర్లు అందుబాటులో ఉండేలా చేయడం మా లక్ష్యం. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి, మేము చాలా సాహసోపేత నిర్ణయం తీసుకున్నాం. దేశంలోని పేద పిల్లలు కూడా వైద్యులుగా మారి తమ కలలను సాకారం చేసుకోవాలనే ఉద్దేశంతో, విద్యార్థులకు వారి మాతృభాషలో వైద్య విద్య అభ్యసించే అవకాశాన్ని అందించాం. ఆధునిక వైద్య శాస్త్రానికి సంబంధించిన ఈ ప్రయత్నాలతో పాటు, దేశం తన సాంప్రదాయ పరి జ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేస్తోంది. మన యోగా, ఆయుర్వేదం కూడా నేడు మొత్తం ప్రపంచంలో ఒక కొత్త గుర్తింపును పొందాయి.  భారతదేశం గౌరవం పెరుగుతోంది.

మిత్రులారా,

ఏ దేశ మనుగడయినా దాని సంస్కృతి, చైతన్యం విస్తరణ తరతరాలుగా కొనసాగడంపై ఆధారపడి ఉంటుంది. మన దేశ చరిత్రను చూస్తే, వందల ఏళ్ల కొద్దీ బానిసత్వం, అనేక దండయాత్రలు, భారతదేశ సామాజిక వ్యవస్థను చిన్నభిన్నం చేయడానికి జరిగిన ఎన్నో దుర్మార్గ ప్రయత్నాలు కనిపిస్తాయి. కానీ భారతదేశ చైతన్యం ఎప్పటికీ అంతం కాలేదు. ఆ జ్యోతి వెలుగుతూనే ఉంది. ఇది ఎలా సాధ్యమైంది? ఎందుకంటే అత్యంత క్లిష్ట సమయాల్లో కూడా ఈ చైతన్యాన్ని సజీవంగా ఉంచడానికి దేశంలో కొత్త సామాజిక ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. భక్తి ఉద్యమం ఇందుకు ఒక ఉదాహరణ. ఇది మన అందరికీ బాగా తెలిసిన విషయమే. మధ్యయుగంలో ఉన్న ఆ క్లిష్ట కాలంలో, మన సాధువులు భక్తి భావనల ద్వారా జాతీయ చైతన్యానికి కొత్త శక్తిని అందించారు. గురు నానక్ దేవ్ , కబీర్దాస్, తులసీదాస్, సూరదాస్, ఇక్కడ మన మహారాష్ట్రలో సంత్ తుకారాం, సంత్ ఏకనాథ్, సంత్ నామదేవ్, సంత్ జ్ఞానేశ్వర్ వంటి అనేక సాధువులు తమ మౌలిక ఆలోచనలతో మన జాతి చైతన్యానికి ప్రాణం పోశారు. ఈ ఉద్యమాలు వివక్షకు అడ్డుకట్ట వేసి, సమాజాన్ని ఐక్యత అనే దారంతో అనుసంధానించాయి.

 

అలాగే, స్వామి వివేకానంద వంటి మహానుభావులు ఉన్నారు. ఆయన నిరాశలో మునిగిపోయిన సమాజాన్ని కదిలించారు, దాని అసలు స్వరూపాన్ని గుర్తు చేశారు, ఆత్మవిశ్వాసాన్ని కలిగించారు.  మన జాతీయ చైతన్యాన్ని నిర్జీవం కాకుండా కాపాడారు. బానిసత్వం చివరి దశల్లో, డాక్టర్ సాహెబ్, గురూజీ వంటి గొప్ప వ్యక్తులు మన జాతీయ చైతన్యానికి కొత్త శక్తిని అందించేందుకు కృషి చేశారు. ఈరోజు మనం చూస్తున్నది, జాతీయ చైతన్యాన్ని సంరక్షించేందుకు,  ప్రోత్సహించేందుకు 100 ఏళ్ల క్రితం నాటిన ఆలోచనా బీజం నేడు మహా వటవృక్షంగా ప్రపంచం ముందు ఉండడాన్ని మనం చూస్తున్నాం. సూత్రాలు, ఆదర్శాలు ఈ వటవృక్షాన్ని మరింత ఎత్తుకు పెంచాయి. లక్షలాదిమంది స్వయంసేవకులు దాని శాఖలుగా నిలుస్తున్నారు. ఇది సాధారణ వటవృక్షం కాదు. భారతదేశ అమర సంస్కృతికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఒక ఆధునిక అక్షయ వృక్షంగా నిలిచి భారతీయ సంస్కృతిని, మన జాతి చైతన్యాన్ని నిరంతరం ఉత్తేజపరుస్తోంది.

మిత్రులారా,

ఈరోజు, మేము మాధవ్ నేత్రాలయ కొత్త ప్రాంగణ నిర్మాణాన్ని ప్రారంభిస్తున్న సందర్భంలో, దృష్టి గురించి మాట్లాడటం సహజం. దృష్టి మన జీవితాల్లో దిశను నిర్దేశిస్తుంది. అందుకే వేదాలు కూడా - పశ్యేమ శరదః శతమ్! అంటే శత వసంతాలను చూసే భాగ్యం కలగాలని- కోరతాయి. అంటే, మనం శత వసంతాలు చూడాలని ఆకాంక్షించాలి. ఈ దృష్టి కేవలం కళ్లతో చూడడం మాత్రమే కాదు. బాహ్య దృష్టితో పాటు అంతర్గత దృష్టి కూడా ఉండాలి. అంతర్గత దృష్టి గురించి మాట్లాడినప్పుడు, విదర్భ ప్రాంత మహానీయుడు శ్రీ గులాబ్రావు మహారాజ్ సహజంగానే మనకు గుర్తుకు వస్తారు. అందరూ ఆయన్ని  ప్రజ్ఞాచక్షు అని పిలిచేవారు. చిన్న వయసులోనే ఆయన తన దృష్టిని కోల్పోయారు. కానీ లోపం ఆయన రచనా సామర్థ్యాన్ని తగ్గించలేదు. ఆయన అనేక గ్రంథాలు రచించారు. ఇప్పుడు ఎవరికైనా ఈ ప్రశ్న రావచ్చు — కళ్లతో చూడలేని ఒక వ్యక్తి ఎలా ఇన్ని గ్రంథాలు ఎలా రాయగలిగారు? దానికి సమాధానం ఏమిటంటే — కళ్లు లేకపోవచ్చు. కానీ ఆయన వద్ద దృష్టి ఉంది. ఆ దృష్టి ఆత్మసాక్షాత్కారానికి సంబంధించినది. జ్ఞానానికి సంబంధించినది. దృష్టి అనేది కేవలం బయటి ప్రపంచాన్ని చూడటానికి మాత్రమే కాదు, అంతర్గతంగా లోకాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం కూడా. ఈ దృష్టి వ్యక్తికీ,  సమాజానికీ కూడా అపారమైన శక్తిని అందిస్తుంది. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ కూడా అటువంటి ఒక సంస్కార యజ్ఞం. ఇది అంతర్గత దృష్టి, బాహ్య దృష్టి రెండింటితో పనిచేస్తోంది. బాహ్యదృష్టిగా మనం మాధవ్ నేత్రాలయాన్ని చూస్తాం. అంతర్గత దృష్టితో సేవకు పర్యాయంగా సంఘ్ ను చూస్తాం. 

మిత్రులారా,

ఇక్కడ ఒక గొప్ప మాట ఉంది —

“పరోపకారాయ ఫలంతి వృక్షాః, పరోపకారాయ వహంతి నద్యః।

పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం।।”

అంటే, వృక్షాలు పరోపకారం కోసం ఫలిస్తాయి. నదులు పరోపకారం కోసం ప్రవహిస్తాయి. గోవులు పరోపకారం కోసం పాలిస్తాయి. మన శరీరం కూడా పరోపకారం కోసమే ఉంది. మన శరీరానికి అసలు అర్థం పరోపకారం చేయడం. ఇప్పుడు, ఈ సేవా భావన మన సంస్కారాల్లో భాగం అయిపోయినప్పుడు, సేవే సాధనగా మారుతుంది. అది కేవలం ఒక కార్యం కాకుండా, ఆత్మసాక్షాత్కారం సాధించేందుకు మార్గంగా మారుతుంది. ఈ సాధన ప్రతి స్వయంసేవకుడి జీవితానికి ప్రాణవాయువులాంటిది. ఈ సేవా సంస్కారం, ఈ సాధన, ఈ ప్రాణవాయువు తరతరాలుగా ప్రతి స్వయంసేవకుడిని తపస్సు కోసం ప్రేరేపిస్తోంది.ఈ సేవా భావం ప్రతి స్వయంసేవకుడిని నిరంతరం ముందుకు సాగేలా చేస్తుంది, అతనిని ఎన్నటికీ అలసిపోనివ్వదు, ఆగిపోనివ్వదు. పూజ్య గురూజీ తరచుగా ఇలా చెప్పేవారు —“జీవితం ఎంతకాలం సాగిందో కాదు, అది ఎంత ఉపయోగకరంగా ఉన్నదో అటువంటి జీవితం అసలైన జీవితం.” మన జీవితం ప్రాముఖ్యత దాని కాలంతో కాదు- అది ఇతరులకు ఎంత ఉపయోగకరంగా మారిందో - అనే దానిలో ఉంది. మేం దేశం కోసం దేవుని నుండి ప్రేరణ తీసుకున్నాం. రాముడి నుండి దేశ భక్తి నేర్చుకున్నాం. మా కర్తవ్యాన్ని నిరంతరం నిర్వర్తిస్తూ ఉంటాం. అందుకే మనం చూస్తున్నాం —పని ఎంత పెద్దదైనా, చిన్నదైనా, ఏ రంగంలోనైనా, సరిహద్దు గ్రామాలు, కొండ ప్రాంతాలు, అరణ్య ప్రాంతాలు అయినా, సంఘ స్వయంసేవకులు నిస్వార్థంగా సేవచేస్తూనే ఉంటారు. ఎక్కడో ఎవరో వనవాసి కల్యాణ ఆశ్రమం పనిని తమ లక్ష్యంగా చేసుకుని అందులో నిమగ్నమయ్యారు. ఇంకో చోట ఎక్కడో ఎవరో ఏకలవ్య విద్యాలయ ద్వారా ఆదివాసీ పిల్లలకు బోధిస్తూ ఉన్నారు. మరో చోట ఎవరో సాంస్కృతిక చైతన్యం కోసం పని చేస్తున్నారు. అలాగే, ఎవరో సేవా భారతిలో చేరి పేదలు, వెనుకబడిన వారికి సేవలందిస్తున్నారు. 

 

ఇటీవలి కాలంలో ప్రయాగ్‌లో జరిగిన కుంభమేళాలో స్వయంసేవకులు లక్షల మందికి ఎలా సహాయం చేశారో చూశాం. అంటే, ఎక్కడ సేవ ఉందో అక్కడ స్వయంసేవకులు ఉన్నారు. ఎప్పుడైనా ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు, అది వరదల విధ్వంసం అయినా, లేదా భూకంపం అయినా స్వయంసేవకులు క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా అక్కడకు చేరుకుంటారు. వారు తమ సమస్యలు పట్టించుకోరు. తమ బాధల గురించి ఆలోచించరు. కేవలం సేవా భావంతో పనిలో నిమగ్నమైపోతారు. సేవ మా హృదయాలలో ఉంది. అది యజ్ఞకుండం. అందులో మేము సమిధలవుతాం. నదిగా సముద్రంలో కలసిపోతాం. 

మిత్రులారా,

ఒకసారి ఇంటర్వ్యూలో గౌరవ గురూజీని ఒక ప్రశ్న అడిగారు — సంఘాన్ని ఎందుకు సర్వవ్యాప్తమని పిలుస్తారు? గురూజీ ఇచ్చిన సమాధానం ఎంతో ప్రేరణదాయకం. ఆయన సంఘాన్ని వెలుగుతో పోల్చారు. గురూజీ అన్నారు — వెలుగు సర్వవ్యాప్తమవుతుందికానీ, అది అన్ని పనులను ఒక్కటే చేయదు. అయితే, అది చీకటిని తొలగించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇతరులు పని చేసేందుకు మార్గాన్ని చూపుతుంది. గురూజీ ఇచ్చిన ఈ బోధన మనకు ఒక జీవన మంత్రం. మనం వెలుగుగా మారి చీకటిని తొలగించాలి. అడ్డంకులను దూరం చేయాలి, మార్గాన్ని సృష్టించాలి.ఈ భావన మన జీవితాంతం మన మనసులోంచి వినిపిస్తూ ఉండాలి. ప్రతిఒక్కరూ ఈ ఆలోచనను కొంతమేర అయినా అనుసరించేందుకు ప్రయత్నించాలి. నేను-నువ్వు కాదు, నేను - మేము కాదు, “ఇదం రాష్ట్రాయ ఇదం న మమ” (ఇది దేశానిదే- నాది కాదు).

 

మిత్రులారా,

ప్రయత్నాల సమయంలో “నేను” కంటే “మేము” అనే భావనపై దృష్టి పెట్టినప్పుడు, దేశం తొలి ప్రాధాన్యం అనే భావనతో ఉన్నప్పుడు, విధానాలు , నిర్ణయాలలో దేశ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని పరిగణించినప్పుడు - అప్పుడు ప్రతి చోటా ఆ ప్రభావం, ఆ వెలుగు స్పష్టంగా కనిపిస్తుంది.అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మన దేశాన్ని కట్టిపడేసిన సంకెళ్లను తెంచడం అత్యంత ముఖ్యం. ఈ రోజు మనం చూస్తున్నాం — భారతదేశం బానిసత్వ మనస్తత్వం నుంచి ముందుకు సాగుతోంది. 70 ఏళ్ల పాటు దేశంపై మిగిలిపోయిన బానిసత్వపు మచ్చలు ఇప్పుడు జాతీయ గర్వానికి సంబంధించిన కొత్త అధ్యాయాలతో మాసిపోతున్నాయి. భారత ప్రజలను తక్కువగా చూడడానికి రూపొందించిన ఆంగ్లేయ చట్టాలను ఇప్పుడు దేశం మార్చుకుంది. బానిసత్వపు ఆలోచనతో రూపొందించిన శిక్షాస్మృతి స్థానంలో ఇప్పుడు భారతీయ న్యాయ సంహిత వచ్చింది. మన ప్రజాస్వామ్య ప్రాంగణంలో ఇక రాజ్ పథ్ లేదు. ఇక అది కర్తవ్య పథమే. బానిసత్వానికి సంకేతం మన నావికాదళం జెండా మీద కూడా ముద్రితమైంది. ఇప్పుడు శివాజీ మహారాజ్ చిహ్నం నావికాదళం జెండా మీద కొలువు తీరింది. దేశం కోసం వీర సావర్కర్ చిత్రహింసలకు గురైన, నేతాజీ సుభాష్ బాబు స్వాతంత్ర్య యుద్ధ గర్జన చేసిన ఆండమాన్ దీవులు కూడా ఇప్పుడు స్వాతంత్ర్య సమరయోధుల పేర్లను సంతరించుకున్నాయి. 

మిత్రులారా,

మన వసుధైక కుటుంబం మంత్రం ఈరోజు ప్రపంచం నలుమూలలకూ చేరుతోంది. మన కార్యకలాపాల్లో కూడా ఈ భావనను ప్రపంచం చూస్తోంది,  అనుభవిస్తోంది. కొవిడ్ మహమ్మారి వచ్చినప్పుడు, భారతదేశం ప్రపంచాన్ని కుటుంబంగా భావించి టీకాలు అందించింది. ప్రపంచంలో ఎక్కడ ప్రకృతి విపత్తులు జరిగినా, భారతదేశం పూర్తి అంకితభావంతో సేవ చేయడానికి సంసిద్ధంగా ఉంటుంది. నిన్ననే మీరు చూశారు —మయన్మార్‌లో భారీ భూకంపం సంభవించినప్పుడు, భారతదేశం అక్కడి ప్రజలకు సహాయం అందించడానికి ఆపరేషన్ బ్రహ్మ ద్వారా మొదటగా చేరుకుంది. తుర్కియేలో భూకంపం వచ్చినప్పుడు,నేపాల్‌లో భూకంపం సంభవించినప్పుడు, మాల్దీవుల్లో నీటి సంక్షోభం ఏర్పడినప్పుడు కూడా భారతదేశం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఆపన్న హస్తం అందించింది. యుద్ధం వంటి సమయాల్లో కూడా భారతదేశం ఇతర దేశాల పౌరులను సురక్షితంగా తరలించడం కోసం సహాయంగా నిలుస్తోంది. ఈరోజు భారతదేశం అభివృద్ధి చెందడాన్ని ప్రపంచం చూస్తోంది. మొత్తం గ్లోబల్ సౌత్ గళంగా కూడా భారత్ ఈ విశ్వ సోదరభావ స్స్పూర్తి మన సంస్కృతీ విలువల విస్తరణను చాటుతోంది. 

 

మిత్రులారా,

ఈరోజు భారతదేశానికి ఉన్న అతి పెద్ద ఆస్తి మన యువత. ఇప్పటి భారత యువత ఎంత ఆత్మవిశ్వాసంతో ఉన్నదో మనం స్పష్టంగా చూస్తున్నాం. వారిలో సవాళ్ళను ప్రమాదాలను స్వీకరించే సామర్థ్యం గతంతో పోలిస్తే చాలా రెట్లు పెరిగింది.వారు కొత్త ఆవిష్కరణలు చేస్తూ, స్టార్ట్-అప్ ప్రపంచంలో తమ జెండా ఎగరవేస్తున్నారు. ముఖ్యంగా — ఈరోజు భారత యువత తమ వారసత్వంపై గర్వపడుతున్నారు, తమ సంస్కృతిని చూసి గర్విస్తున్నారు. ఇటీవల ప్రయాగరాజ్ మహా కుంభమేళ లో మనం చూశాం. నేటి యువత లక్షల సంఖ్యలో పాల్గొని ఈ సనాతన సంప్రదాయంతో అనుసంధానమై గర్వభావంతో నిండిపోయారు. ఈ రోజు భారత యువత దేశానికి  ఏది అవసరమో గుర్తించి ఆ దిశగా శ్రమిస్తున్నారు. భారత యువత “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమాన్ని విజయవంతం చేసింది. అలాగే, వారు “వోకల్ ఫర్ లోకల్” భావనకు పూర్తి మద్దతు అందిస్తున్నారు.ఈ రోజు యువతలో ఒక ఉత్సాహం ఏర్పడింది. వారిలో దేశం కోసం బ్రతకాలి, దేశం కోసం ఏదో చేయాలి అనే భావన. ఆటస్థలాల నుంచి అంతరిక్ష శిఖరాల వరకు- మన యువత దేశ నిర్మాణ స్పూర్తితో నిరంతరం ముందుకు, ముందుకు సాగుతోంది. ఇదే యువత 2047 నాటికి వికసిత భారత్ లక్ష్య పతాకాన్ని పట్టుకొని గర్వంగా ముందుకు సాగుతోంది. అప్పటికి మన స్వాతంత్ర్యానికి 100 సంవత్సరాలు పూర్తవుతాయి. నాకు పూర్తి విశ్వాసం ఉంది. సంఘటితం,, అంకితభావం, సేవ అనే ఈ త్రివేణి వికసిత భారత ప్రయాణానికి ఇంకా ఎక్కువ శక్తిని,  దిశను అందిస్తూనే ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా సంఘ్ చేసిన కష్టం ఇప్పుడు ఫలితాలు ఇస్తోంది. ఎన్నో సంవత్సరాల తపస్సు ఇప్పుడు వికసిత భారత కొత్త అధ్యాయాన్ని రాస్తోంది.

 

మిత్రులారా,

సంఘ్ ఏర్పడినప్పుడు భారతదేశ పరిస్థితులు భిన్నంగా ఉండేవి, సందర్భాలు కూడా పూర్తిగా వేరు.1925 నుంచి  1947 వరకు అది ఒక పోరాట కాలం. దేశానికి స్వాతంత్ర్యం అనే మహత్తర లక్ష్యం ముందుండేది. ఈ రోజు, సంఘ్ 100 ఏళ్ల ప్రయాణం అనంతరం, దేశం మరో కీలక దశ వద్ద నిలిచింది. 2025 నుంచి 2047 వరకు —ఈ ముఖ్యమైన కాలంలో మళ్లీ మన ముందు మహత్తర లక్ష్యాలు ఉన్నాయి. ఒకప్పుడు గౌరవ గురూజీ ఒక పత్రంలో రాశారు —మన మహత్తర దేశానికి నేను ఒక చిన్న రాయి అయినా సరే పునాదిగా ఉండాలనుకుంటున్నాను. అయోధ్యలో రామ మందిర నిర్మాణం సందర్భంగా నేను చెప్పినట్టుగా —సేవా సంకల్పాన్ని మనం ఎప్పటికీ సజీవంగా ఉంచుకోవాలి. మన శ్రమను ఎప్పటికీ కొనసాగించాలి. వికసిత భారత్ స్వప్నాన్ని సాకారం చేసుకోవాలి. మరొక వెయ్యి సంవత్సరాల పాటు బలమైన భారతదేశానికి పునాదులు వేయాల్సిన బాధ్యత మనపై ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది —గౌరవ డాక్టర్ సాహెబ్,  గురూజీ వంటి మహానుభావుల మార్గదర్శనం మనకు ఎల్లప్పుడూ శక్తిని అందిస్తూనే ఉంటుంది. మనం అభివృద్ధి చెందిన భారత్ ను సాధిస్తాం. మన గత తరాల బలిదానాలను అర్ధవంతంగా చేస్తాం. ఈ సంకల్పంతో, ఈ శుభ నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ మరో సారి శుభాకాంక్షలు. మీకు చాలా చాలా ధన్యవాదాలు!

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India remains among best-performing major economies: S&P Global

Media Coverage

India remains among best-performing major economies: S&P Global
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles the passing of prolific writer, thinker and public intellectual, Shri Balbir Punj
April 19, 2026

The Prime Minister, Shri Narendra Modi has expressed grief over the demise of prolific writer, thinker and public intellectual Shri Balbir Punj.

Shri Modi said that Shri Balbir Punj Ji was a prolific writer, thinker and public intellectual who made a rich contribution to the world of media. His writings were widely read and reflected his strong passion towards national regeneration. He noted that Shri Punj’s Parliamentary interventions were rich in facts and theory.

The Prime Minister wrote on X;

“Shri Balbir Punj Ji was a prolific writer, thinker and public intellectual. He made a rich contribution to the world of media. His writings were widely read, reflecting his strong passion towards national regeneration. His Parliamentary interventions were rich in facts and theory.

Shri Balbir Punj Ji worked tirelessly to strengthen the BJP, especially among students, professionals, scholars and intellectuals. He was in-charge of various states, including Gujarat. Fondly remember our interactions from those times. Pained by his passing. Condolences to his family and friends. Om Shanti.”

“बलबीर पुंज जी एक प्रसिद्ध लेखक होने के साथ-साथ प्रखर विचारक और सम्मानित बुद्धिजीवी थे। मीडिया के क्षेत्र में उनका योगदान बहुत सराहनीय रहा है। लोग उनकी लेखनी के कायल थे, जिससे राष्ट्र निर्माण के प्रति उनकी गहरी प्रतिबद्धता परिलक्षित होती थी । उनके संसदीय भाषणों में तथ्यों और मानवीय मूल्यों का भरपूर समावेश रहता था।

बलबीर पुंज जी ने भाजपा को सशक्त बनाने के लिए अथक प्रयास किए। विद्यार्थियों, पेशेवरों, विद्वतजनों और बुद्धिजीवियों को उन्होंने पार्टी से जोड़ने में उल्लेखनीय भूमिका निभाई। वे गुजरात सहित कई राज्यों के प्रभारी रहे। उस दौर में उनसे हुए संवाद मेरे लिए अविस्मरणीय रहेंगे। उनके निधन से अत्यंत दुख हुआ है। शोक की इस घड़ी में उनके परिजनों और मित्रों के प्रति मेरी हार्दिक संवेदनाएं। ओम शांति!”