పురస్కార గ్రహీత– నేను మూడు పుస్తకాలు రాశాను. నాకు చదవడమంటే ఇష్టం.. అందుకే నేను పుస్తకాలు రాయడం మొదలుపెట్టాను. నాకో అరుదైన వ్యాధి ఉంది.. నేనింకో రెండేళ్లే జీవిస్తానని చెప్పారు. కానీ మా అమ్మ, మా అక్క, మా బడి... నేను పుస్తకాలు ప్రచురించే సంస్థల సహకారంతోనే నేనిప్పుడిలా ఉన్నాను.

ప్రధానమంత్రి – నీలో స్ఫూర్తి నింపిందెవరు?

పురస్కార గ్రహీత – మా ఇంగ్లిష్ టీచరే అనుకుంటున్నా.

ప్రధానమంత్రి – ఇప్పుడు నువ్వు ఇతరులకూ స్ఫూర్తినిస్తున్నావు. నీ పుస్తకం చదివి స్పందిస్తూ నీకెవరైనా ఉత్తరాలు రాశారా?

పురస్కార గ్రహీత – రాశారు.

ప్రధానమంత్రి – మీకు ఏ రకమైన సందేశాలు అందాయి?

పురస్కార గ్రహీత – వారు సొంతంగా పుస్తకాలు రాయడం మొదలుపెట్టామని చెప్పడం నాకు వచ్చిన సందేశాల్లో అతిపెద్దది.

ప్రధానమంత్రి – నువ్వెక్కడ శిక్షణ తీసుకున్నావు? అదెలా జరిగింది?

పురస్కార గ్రహీత – నేనెక్కడా శిక్షణ తీసుకోలేదు.

ప్రధానమంత్రి – శిక్షణ తీసుకోలేదా? నువ్విది చేయాలనుకున్నావ్.. అంతే!

పురస్కార గ్రహీత – అవును సర్.

ప్రధానమంత్రి – నువ్వింకా ఏ పోటీల్లో పాల్గొంటావు?

పురస్కార గ్రహీత – ఇంగ్లిష్, ఉర్దూ, కశ్మీరీ పోటీల్లో పాల్గొంటాను.

ప్రధానమంత్రి – నీకు యూట్యూబ్ చానలుందా, లేదా ఇంకెక్కడైనా ప్రదర్శనలిస్తావా?

 

పురస్కార గ్రహీత – అవును సర్. నేను యూట్యూబ్ లో ఉన్నాను. ప్రదర్శనలు కూడా ఇస్తాను.

ప్రధానమంత్రి – మీ కుటుంబంలో ఇంకెవరైనా గాయకులున్నారా?

పురస్కార గ్రహీత – లేదు సర్.. ఎవరూ లేరు.

ప్రధానమంత్రి – నువ్వే మొదలుపెట్టావా?

పురస్కార గ్రహీత – అవును సర్.

ప్రధానమంత్రి – నువ్వేం చేశావు? నువ్వు చదరంగం ఆడతావా?

పురస్కార గ్రహీత – అవును.

ప్రధానమంత్రి – నీకు చదరంగం ఎవరు నేర్పారు?

పురస్కార గ్రహీత – మా నాన్న, యూట్యూబ్.

ప్రధానమంత్రి – అవునా..

పురస్కార గ్రహీత – మా టీచర్ కూడా.

ప్రధానమంత్రి – ఢిల్లీలో చాలా చలిగా ఉంది.. చాలా చల్లగా ఉంది.

పురస్కార గ్రహీత – ఈ ఏడాది కార్గిల్ విజయ్ దివస్ రజతోత్సవాన్ని పురస్కరించుకుని కార్గిల్ యుద్ధ స్మారకం నుంచి జాతీయ యుద్ధ స్మారకం వరకు 1,251 కిలోమీటర్లు సైకిల్ తొక్కాను. రెండేళ్ల క్రితం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతులను పురస్కరించుకుని మొయిరాంగ్ లోని ఐఎన్ఏ స్మారకం నుంచి ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వరకు సైకిల్ పై ప్రయాణించాను.

 

ప్రధానమంత్రి – ఒక్కో ప్రయాణానికీ నీకెన్ని రోజులు పడుతుంది?

పురస్కార గ్రహీత – మొదటి ప్రయాణంలో 32 రోజులు సైకిల్ తొక్కి 2,612 కిలోమీటర్లు ప్రయాణించాను. ఇప్పటి ప్రయాణానికి 13 రోజులు పట్టింది.

ప్రధానమంత్రి – ఒక రోజులో ఎంత దూరం ప్రయాణం చేస్తావు?

పురస్కార గ్రహీత – రెండు ట్రిప్పుల్లో, నేను ఒక రోజులో గరిష్టంగా 129.5 కిలోమీటర్లు సైకిల్ తొక్కాను.

పురస్కార గ్రహీత – నమస్తే సర్.

ప్రధానమంత్రి – నమస్తే.

పురస్కార గ్రహీత – నేను రెండు ఇంటర్నేషనల్ బుక్ రికార్డులు సాధించాను. మొదటిది ఒక నిమిషంలో 31 అర్ధ శాస్త్రీయ శ్లోకాల పఠనానికిగానూ, రెండోది ఒక నిమిషంలో 13 సంస్కృత శ్లోకాలను పఠించినందుకు.

ప్రధానమంత్రి – ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు?

పురస్కార గ్రహీత – సర్, నేను యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నాను.

ప్రధానమంత్రి – అవునా.. ఒక్క నిమిషం నువ్వేం చేశావో నాకు చూపించు.

పురస్కార గ్రహీత – ఓం భూర్భువ స్వః, తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహీ ధియో యో నః ప్రచోదయాత్. (సంస్కృతంలో)

పురస్కార గ్రహీత – నమస్తే సర్.

ప్రధానమంత్రి – నమస్తే.

 

పురస్కార గ్రహీత – నేను జాతీయ స్థాయిలో జూడోలో బంగారు పతకం సాధించాను.

ప్రధానమంత్రి – నిన్ను చూసి అందరూ భయపడాలే! నువ్వు దీన్నెక్కడ నేర్చుకున్నావు — బడిలోనా?

పురస్కార గ్రహీత – లేదు సర్. ఓ యాక్టివిటీ కోచ్ దగ్గర నేర్చుకున్నాను.

ప్రధానమంత్రి – అది గొప్ప విషయం. నీ తర్వాతి లక్ష్యం ఏమిటి?

పురస్కార గ్రహీత – ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించి దేశానికి పేరు తేవాలనుకుంటున్నాను.

ప్రధానమంత్రి – వావ్, అంటే నువ్వు చాలా కష్టపడుతున్నావన్నమాట.

పురస్కార గ్రహీత – అవును సర్.

ప్రధానమంత్రి – నీకు చాలా హాకర్ క్లబ్బులున్నాయి.

పురస్కార గ్రహీత – అవును. ప్రస్తుతం జమ్ముకశ్మీర్ లో చట్టాల అమలును పటిష్ఠం చేసేందుకు శిక్షణ ఇస్తున్నాం. 5 వేల మంది పిల్లలకు ఉచితంగా పాఠాలు చెప్పాం. మన ప్రయోజనాలను కొనసాగిస్తూనే సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలను నిర్వహించడం మా లక్ష్యం.

ప్రధానమంత్రి – మీ ప్రార్ధన ప్రాజెక్టు ఎలా ముందుకు సాగుతోంది?

పురస్కార గ్రహీత – ‘ప్రార్ధన’ ప్రాజెక్టు ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. డచ్, మరికొన్ని సంక్లిష్ట భాషల్లోకి వేదాలను అనువదించే దిశగా మేం పరిశోధన చేస్తున్నాం.

పురస్కార గ్రహీత – అంతేకాదు.. పార్కిన్సన్స్ వ్యాధిగ్రస్తుల కోసం స్వీయ నియంత్రిత చెంచాను నేను రూపొందించాను. మెదడు వయస్సును అంచనా వేసే నమూనానూ మేం రూపొందించాం.

ప్రధానమంత్రి – దీని కోసం మీరెన్ని సంవత్సరాలు పనిచేశారు?

పురస్కార గ్రహీత – సర్, నేను రెండు సంవత్సరాలు దీని కోసం పనిచేశాను.

 

ప్రధానమంత్రి – తర్వాత ఏం చేస్తారు?

పురస్కార గ్రహీత – సర్, నేను నా పరిశోధనను కొనసాగించాలనుకుంటున్నాను.

ప్రధానమంత్రి – మీరు ఎక్కడ నుండి వచ్చారు?

పురస్కార గ్రహీత – సర్, నేను బెంగళూరు నుంచి వచ్చాను. నాకు హిందీ పెద్దగా రాదు.

ప్రధానమంత్రి – చాలా బాగా మాట్లాడుతున్నావు. నా కన్నా కూడా బాగా మాట్లాడుతున్నావు.

పురస్కార గ్రహీత – ధన్యవాదాలు సర్.

పురస్కార గ్రహీత – నేను కర్ణాటక సంగీతం, సంస్కృత శ్లోకాల మేళవింపుతో హరికథా ప్రదర్శనలిస్తాను.

ప్రధానమంత్రి – మీరు ఎన్ని హరికథా ప్రదర్శనలిచ్చారు?

పురస్కార గ్రహీత – దాదాపు వంద ప్రదర్శనలు ఇచ్చాను.

ప్రధానమంత్రి – శభాష్.

పురస్కార గ్రహీత – గత రెండేళ్లలో ఐదు వేర్వేరు దేశాల్లోని ఐదు ఎత్తైన శిఖరాలను అధిరోహించి, ప్రతిదానిపై భారత జాతీయ పతాకాన్ని ఎగురవేశాను. వేరే దేశానికి వెళ్లినప్పుడు.. నేను భారత్ నుంచి వచ్చానని చెప్తే ప్రజలు నన్నెంతో ప్రేమగా, గౌరవంగా చూసుకునేవారు.

ప్రధానమంత్రి – నిన్ను కలిసి, నువ్వు భారత్ నుంచి వచ్చావని తెలిసినప్పుడు ప్రజలు ఏమనేవారు?

పురస్కార గ్రహీత – వాళ్లు నాపై చాలా ప్రేమ, గౌరవాలను చూపేవారు. నా ప్రతీ పర్వతారోహణ వెనుకా ఉన్న ఉద్దేశం బాలికా సాధికారతను, శారీరక దారుఢ్య ప్రాధాన్యాన్ని చాటడం.

పురస్కార గ్రహీత – నేను ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ చేస్తాను. ఈ ఏడాది న్యూజిలాండ్ లో జరిగిన రోలర్ స్కేటింగ్ లో ఒక అంతర్జాతీయ బంగారు పతకాన్నీ, 6 జాతీయ పతకాలనూ సాధించాను.

పురస్కార గ్రహీత – సర్, నేను కూడా పారా అథ్లెట్ నే. ఈ నెల 1 నుంచి 7 వరకు థాయ్ లాండ్ లో జరిగిన పారా స్పోర్ట్ యూత్ కాంపిటీషన్ లో పాల్గొని.. బంగారు పతకం గెలవడం ద్వారా మన దేశానికి మంచి పేరు తెచ్చాను.

ప్రధానమంత్రి – వావ్.

పురస్కార గ్రహీత – ఈ ఏడాది యూత్ చాంపియన్ షిప్ లో కూడా బంగారు పతకం సాధించాను. 57 కేజీల కేటగిరీలో బంగారు పతకం గెలుచుకోవడంతోపాటు 76 కేజీల విభాగంలో ప్రపంచ రికార్డు నెలకొల్పాను. అందులోనూ బంగారు పతకం గెలిచాను. మొత్తం పోటీలోనూ బంగారు పతకాన్ని గెలిచాను.

 

 

ప్రధానమంత్రి – నువ్వు అన్ని పతకాలూ సొంతం చేసేసుకుంటున్నావ్!

పురస్కార గ్రహీత – లేదు సర్.

పురస్కార గ్రహీత – ఓసారి ఓ ఫ్లాట్ కు నిప్పంటుకుంది. మొదట్లో ఎవరూ చూడలేదు. ఇంటి నుంచి పొగలు రావడాన్ని నేను గమనించాను. కానీ ఎవ్వరూ లోపలికి ప్రవేశించే ధైర్యం చేయలేకపోయారు. తమాషాలు చేయొద్దనీ, లోపలికి పోతే ప్రమాదంలో ఇరుక్కుంటాననీ అంటూ వారంతా నన్ను ఆపాలని చూశారు. కానీ నేను ధైర్యం చేసి లోపలికి వెళ్లి మంటలను ఆర్పేశాను.

ప్రధానమంత్రి – ఎన్ని ప్రాణాలు కాపాడావు?

పురస్కార గ్రహీత – భవనంలో 70 ఇళ్లు, 200 కుటుంబాలు ఉన్నాయి.

ప్రధానమంత్రి – నీకు ఈత వచ్చా?

పురస్కార గ్రహీత – అవును.

ప్రధానమంత్రి – అందరినీ కాపాడారా?

పురస్కార గ్రహీత – అవును.

ప్రధానమంత్రి – నీకు భయం వేయలేదా?

పురస్కార గ్రహీత – లేదు.

ప్రధానమంత్రి – అంతా అయిపోయిన తర్వాత, మీరో గొప్ప పనిచేశారని తెలిసి మీకు మంచి అనుభూతి కలిగిందా?

పురస్కార గ్రహీత – అవును.

ప్రధానమంత్రి – శభాష్! 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From welfare to opportunity: How DPI 2.0 and AI will unlock India’s productivity

Media Coverage

From welfare to opportunity: How DPI 2.0 and AI will unlock India’s productivity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays homage to former PM Shri PV Narasimha Rao Ji on his birth anniversary
June 28, 2026

The Prime Minister, Shri Narendra Modi, today, paid tributes to former Prime Minister Shri PV Narasimha Rao Ji on his birth anniversary. Shri Modi remarked that Shri PV Narasimha Rao Ji made enduring contributions to India’s progress during a critical phase of our nation’s history.

The Prime Minister posted on X:

Tributes to former Prime Minister Shri PV Narasimha Rao Ji on his birth anniversary. He made enduring contributions to India’s progress during a critical phase of our nation’s history. He made a mark as an able administrator. He was also a distinguished scholar, blessed with immense knowledge and understanding of India’s diverse culture.