ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జర్మనీ ప్రధానమంత్రి ఫెడరల్ ఛాన్సలర్ డాక్టర్ ఏంజెలా మెర్కెల్ తో ఫోన్ లో మాట్లాడారు.
కోవిడ్ -19 టీకాలు వేయడంలో సహకారం; వాతావరణం మరియు శక్తిపై దృష్టి సారించి అభివృద్ధి సహకారం; వాణిజ్యం మరియు ఆర్థిక సంబంధాలను పెంపొందించడం తో సహా, ద్వైపాక్షిక ఎజెండా లోని అంశాలపై కూడా ఇద్దరు నాయకులు చర్చించారు. రాబోయే సి.ఓ.పి.-26 సమావేశం వంటి బహుపాక్షిక ఆసక్తి అంశాలతో పాటు, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సముద్ర భద్రతపై సంభాషణను ప్రోత్సహించడానికి భారత చొరవ వంటి అంశాలపై కూడా వారు తమ అభిప్రాయాలను ఒకరికొకరు తెలియజేసుకున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సమ్మిళిత సహకారాన్ని ప్రోత్సహించడం పై ఇరుపక్షాల మధ్య దృక్పథాల సాధారణత ను వారు నొక్కి చెప్పారు.