ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీ న జల్‌పాయీగుడీ ని సందర్శించనున్నారు. అక్కడ ఆయన ఎన్‌హెచ్-31 డి లో భాగమైన ఫలకాతా-సాల్‌సాలాబాడీ సెక్షను ను నాలుగు దోవ లు కలిగింది గా అభివృద్ధి పరచే పని కి శంకుస్థాపన చేస్తారు. జాతీయ రహదారుల లో ఒక భాగం అయిన ఈ 41.7 కిలోమీటర్ల పొడవైన సెక్షన్ పశ్చిమ బెంగాల్ లోని జల్‌పాయీగుడీ జిల్లా లో ఉంది. దీని ని సుమారు 1,938 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించనున్నారు.
ఈ పథకం సాల్‌సాలాబాడీ మరియు అలీపుర్ దువార్ నుండి సిలీగుడీ కి మధ్య దూరాన్ని సుమారు 50 కి.మీ. మేర తగ్గించనుంది. సిలీగుడీ కి ఉత్తమమైన మార్గం అందుబాటు లోకి రావడం అంటే రైల్వే లకు, ఇంకా గగనతల మార్గాల కు మెరుగైన లభ్యత అందుబాటు లోకి వచ్చినట్లే. తేయాకు, ఇంకా ఇతర వ్యవసాయ ఉత్పత్తులు ఆ ప్రాంతం లోని విపణుల కు మరింత ఉత్తమమైన రీతి లో చేరుకొనేందుకు జాతీయ రహదారి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా, ఆ ప్రాంతం లో పర్యటన రంగాని కి ప్రోత్సాహకరం గా కూడా ఉంటుంది. ఈ పరిణామాలన్నీ కలసి రాష్ట్రం లో సామాజిక, ఆర్థిక కార్యకలాపాల కు ఒక పెద్ద అండ ను సమకూర్చడం తో పాటు స్థానికుల కు ఉపాధి కల్పన అవకాశాల ను సైతం అందిస్తాయి.
రహదారి వినియోగదారుల కు ఉపశమనం కలిగే రీతి లో అవసరమైనటువంటి అన్ని భద్రత సంబంధ అంశాల ను జాతీయ రహదారి తన లో ఇముడ్చుకోనుంది. 3 రైల్వే ఓవర్ బ్రిడ్జి లు, 2 ఫ్లయ్ ఓవర్ లు, 3 వెహిక్యులర్ అండర్ పాస్ లు, 8 పెద్ద వంతెనలు మరియు 17 చిన్న వంతెన లు ఈ సెక్షన్ లో భాగం గా ఉంటాయి.
జల్‌పాయీగుడీ లో నూతన హైకోర్టు సర్క్యూట్ బెంచ్ ను కూడా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. జల్‌పాయీగుడీ లోని కల కత్తా ఉన్నత న్యాయస్థానం యొక్క సర్క్యూట్ బెంచ్ వల్ల ఉత్తర బెంగాల్ లోని దార్జి లింగ్, కలింపోంగ్, జల్‌పాయీగుడీ మరియు కూచ్ బిహార్ ప్రజల కు సత్వర న్యాయాన్ని అందించగలుగుతుంది. ఈ నాలుగు జిల్లాల నివాసులు ఇక 600 కిలో మీటర్ల అవతల ఉన్న కల కత్తా ఉన్నత న్యాయస్థానాని కి వెళ్ళి వచ్చే కన్నా 100 కి.మీ. లోపు దూరం లో ఉన్న బెంచ్ ను ఆశ్రయిస్తే సరిపోతుంది.


