ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కిసాన్ మాన్ ధన్ యోజన ను సెప్టెంబర్ 12వ తేదీ న ఝార్‌ఖండ్ లోని రాంచీ లో ప్రారంభిస్తారు.
ఈ పథకం 60 సంవత్సరాల వయస్సు కలిగిన చిన్న మరియు సన్నకారు రైతుల కు 5 కోట్ల మంది కి ప్రతి నెలా 3000 రూపాయల కనీస పింఛను ను అందించి, వారి కి జీవన భద్రత ను ప్రసాదించనుంది.
ఈ పథకం లో భాగం గా వచ్చే మూడు సంవత్సరాల కాలం లో 10,774 కోట్ల రూపాయలు వెచ్చించడం జరుగుతుంది.
ప్రస్తుతం 18 ఏళ్ళ నుండి 40 ఏళ్ళ లోపు వయస్సు కలిగిన చిన్న మరియు సన్నకారు రైతులు అందరూ ఈ పథకం లో చేరేందుకు దరఖాస్తు చేయవచ్చును.
రైతు తాలూకు నెలవారీ చందా ను సిఎస్‌సి ల ద్వారా పిఎం-కిసాన్ యొక్క వాయిదా ల నుండి ఇచ్చే వీలుంది.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆదివాసీ ప్రాబల్య ప్రాంతాల లో ఎస్‌టి విద్యార్థుల కు నాణ్యమైనటువంటి, ప్రాథమికోన్నత, సెకండరీ మరియు సీనియర్ సెకండరీ స్థాయి విద్య ను అందించేందుకు 400 వందల ఏకలవ్య ఆదర్శ ఆశ్రమ పాఠశాల లను కూడా ప్రారంభించనున్నారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నూతన ఝార్‌ఖండ్ విధాన సభ భవనాన్ని ప్రారంభించడం తో పాటు, ఒక కొత్త సచివాలయ భవనం నిర్మాణ పనుల కు రాంచీ లో పునాది రాయిని వేస్తారు.
ఆయన తన సందర్శన కాలం లో సాహిబ్‌గంజ్ లో మల్టీ మోడల్ టర్మినల్ ను కూడా ప్రారంభింస్తారు.


