అపారమైన జ్ఞానం, పరిమిత సమయం మధ్య సారాంశాన్ని గ్రహించడంపై దృష్టిని కేంద్రీకరించడమే శాశ్వత వివేకమని సూచిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలతో ఈ రోజు పంచుకున్నారు.
‘అనంతశాస్త్రం బహులాశ్చ విద్యా: అల్పశ్చ కాలో బహువిఘ్నతా చ
యత్సారభూతం తదుపాసనీయం హంసో యథా క్షీరమివాంబుమధ్యాత్’ అనే సంస్కృత శ్లోకాన్ని ఆయన ఉదహరించారు. వివేకాన్ని సంపాదించుకోవడానికి జ్ఞాన బోధ చేసే ధర్మగ్రంథాలు, విద్యలు అనేకంగా ఉండగా, మానవ జీవిత కాలం పరిమితంగానే ఉంది.. పైగా అనేక విఘ్నాలు ఎదురవుతుంటాయి; కాబట్టి ఎవరైనా... నీటిని వేరు చేసి కేవలం పాలను స్వీకరించే హంస వలె నడుచుకోవాలి.. ఈ శాస్త్రాల్లో ఉన్న తత్త్వాల సారాన్ని అంటే.. పరమ సత్యాన్ని.. మాత్రమే సూక్ష్మ పరిశీలనతో గ్రహించాలి అనే సందేశాన్ని ఈ శ్లోకం మనకు అందిస్తోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘అనంతశాస్త్రం బహులాశ్చ విద్యా: అల్పశ్చ కాలో బహువిఘ్నతా చ
యత్సారభూతం తదుపాసనీయం హంసో యథా క్షీరమివాంబుమధ్యాత్’ అని పేర్కొన్నారు.
अनन्तशास्त्रं बहुलाश्च विद्याः अल्पश्च कालो बहुविघ्नता च।
— Narendra Modi (@narendramodi) January 20, 2026
यत्सारभूतं तदुपासनीयं हंसो यथा क्षीरमिवाम्बुमध्यात्॥ pic.twitter.com/exuoawjflX


