పూర్వ ప్రధానమంత్రి, భారత్ రత్న చౌధరీ చరణ్ సింగ్ గారి జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. ‘‘సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాల సంక్షేమం, వ్యవసాయ రంగ పురోగతి, రైతులకు సౌభాగ్యం .. ఈ ఆశయాల సాధనకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. దేశ నిర్మాణానికి ఆయన అందించిన సేవలను, కృతజ్ఞులైన దేశ ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశంలో -
‘‘పూర్వ ప్రధానమంత్రి, భారత్ రత్న చౌధరీ చరణ్ సింగ్ గారికి ఆయన జయంతి సందర్బంగా గౌరవపూర్వక శ్రద్దాంజలి. సమాజంలో వంచనకు గురైన వర్గాల వారి సంక్షేమం, వ్యవసాయ రంగ పురోగతి, రైతుల సమృద్ధి కోసం ఆయన తన జీవనాన్ని అంకితం చేశారు. దేశ నిర్మాణానికి ఆయన అందించిన సేవలను, కృతజ్ఞులైన దేశప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు’’ అని పేర్కొన్నారు.
पूर्व प्रधानमंत्री भारत रत्न चौधरी चरण सिंह जी को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। उन्होंने समाज के वंचित वर्गों के कल्याण के साथ-साथ कृषि की प्रगति और किसानों की समृद्धि के लिए अपना जीवन समर्पित कर दिया। राष्ट्र निर्माण में उनके योगदान को कृतज्ञ राष्ट्र कभी भुला नहीं सकता। pic.twitter.com/naGrTf5mVM
— Narendra Modi (@narendramodi) December 23, 2025


