సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రాజకీయ నేత శ్రీ ములాయం సింగ్ యాదవ్ కన్నుమూత పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శ్రీ యాదవ్ అమిత శ్రద్ధ తో ప్రజల కు సేవ చేశారని, అంతేకాకుండా లోక్ నాయక్ జేపీ గారు మరియు డాక్టర్ లోహియా ల ఆదర్శాల కు లోకప్రియత్వాన్ని సంపాదించిపెట్టడం కోసం తన జీవితాన్ని సమర్పణం చేసివేశారని ప్రధాన మంత్రి అన్నారు. శ్రీ యాదవ్ రక్షణ మంత్రి గా ఉన్న కాలం లో భారతదేశాన్ని మరింత బలమైందిగా తీర్చిదిద్దే దిశ లో కార్యాల ను చేశారని శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు. శ్రీ యాదవ్ తో ప్రధాన మంత్రి తనకు ఉండినటువంటి సన్నిహిత సంబంధాలను గురించి జ్ఞ‌ప్తి కి తెచ్చుకొంటూ తాను ఆయన యొక్క అభిప్రాయాల ను వినడం కోసం ఎల్లవేళ ల ఉత్సుకత తో ఉండేవాడి ని అని పేర్కొన్నారు. తమ ఉభయుల భేటీల ను గురించిన కొన్ని ఛాయాచిత్రాల ను కూడా ప్రధాన మంత్రి శేర్ చేశారు. శ్రీ యాదవ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి తీవ్ర దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ లలో..

‘‘శ్రీ ములాయం సింహ్ యాదవ్ గారు ఒక అసాధారణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి వారు. ఆయన ను నమ్రత మరియు క్షేత్రం తో పాశం కలిగిన నేత గా సర్వత్ర ప్రశంసించడం జరిగింది. ప్రజల సమస్యల పట్ల ఆయన సూక్ష్మగ్రాహ్యత తో ఉండే వారు. ప్రజల కు అమిత శ్రద్ధ తో సేవల ను అందించడంతో పాటు గా లోక్ నాయక్ జేపీ గారు మరియు డాక్టర్ లోహియా ల యొక్క ఆదర్శాల కు లోక ప్రియత్వం లభించే దిశ లో తన జీవితాన్ని అంకితం చేశారు.

ములాయం సింహ్ యాదవ్ గారు ఉత్తర్ ప్రదేశ్ లో మరియు జాతీయ రాజకీయాల లో తనదైన ముద్ర ను వేశారు. అత్యవసర స్థితి అమలైన కాలం లో ప్రజాస్వామ్యం పక్షాన ఒక కీలకమైన జవాన్ గా ఆయన నిలచారు. రక్షణ శాఖ మంత్రి గా ఆయన ఒక బలమైన భారతదేశం కోసం పాటుపడ్డారు. పార్లమెంటు కు సంబంధించి ఆయన కార్యప్రణాళిక వ్యావహారికం గా ఉండింది. మరి దేశ ప్రజల హితాన్ని పెంపొందింపచేయడానికి కూడాను ఆయన ప్రాధాన్యాన్ని ఇచ్చే వారు.

మేము మా మా రాష్ట్రాల కు ముఖ్యమంత్రులు గా సేవల ను అందించిన కాలాల్లో ములాయం సింహ్ యాదవ్ గారి తో అనేక సార్లు నేను భేటీ అయ్యి మాట్లాడాను. మా మధ్య సన్నిహిత సంబంధం ఉంటూ వచ్చింది. మరి నేను ఎల్లప్పుడూ ఆయన అభిప్రాయాల ను వినడం కోసం ఉత్సుకత తో ఉండే వాడి ని. ఆయన మరణం నన్ను బాధపెడుతున్నది. ఆయన కుటుంబాని కి మరియు లక్షల సంఖ్య లో ఉన్న ఆయన యొక్క మద్ధతుదారుల కు నేను నా సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓం శాంతి.’’ అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity

Media Coverage

PM Modi’s FTA push: Why India’s MSMEs now have a bigger export opportunity
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 ఆగష్టు 2026
August 17, 2026

India Ascendant: Citizens Hail PM Modi's Vision and India’s Multi-Sectoral Growth