‘‘గడచిన 25 రోజుల లో మీరు గడించిన అనుభవం మీ యొక్క క్రీడావృత్తి జీవనాని కి ఒక గొప్ప ఆస్తి గా ఉంటుంది’’
‘‘ఏ సమాజం అయినాఅభివృద్ధి చెందాలి అంటే ఆ సమాజం లో క్రీడల కు మరియు క్రీడాకారుల కు వర్ధిల్లేందుకుఅవకాశం లభించాలి’’
‘‘యావత్తు దేశం ఇవాళఆటగాళ్ళకు మల్లేనే దేశానికే ప్రథమ ప్రాధాన్యం అనే రీతి లో ఆలోచన చేస్తున్నది’’
‘‘ప్రస్తుత ప్రపంచంలో ప్రఖ్యాతి గాంచిన క్రీడల రంగ ప్రతిభావంతులు అనేకులు చిన్న చిన్న పట్టణాల నుండివచ్చిన వారే’’
‘‘సాంసద్ ఖేల్ప్రతియోగిత అనేది ప్రతిభావంతులైన వారిని పసిగట్టడానికి మరియు దేశం కోసం వారినైపుణ్యాల కు సానపట్టడానికి సంబంధించిన ఓ గొప్ప మాధ్యం గా ఉంది’’

అమేఠీ సాంసద్ ఖేల్ ప్రతియోగిత 2023 యొక్క ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో సందేశం మాధ్యం ద్వారా ప్రసంగించారు.

 

 

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ‘అమేఠీ సాంసద్ ఖేల్ ప్రతియోగిత 2023’ లో పాలుపంచుకొన్న వారితో జతపడడం అనేది ఒక ప్రత్యేకమైన అనుభూతి ని ఇస్తోందని పేర్కొన్నారు. భారతదేశాని కి చెందిన క్రీడాకారులు, క్రీడాకారిణులు ఏశియాన్ గేమ్స్ లో వంద పతకాల ను సాధించిన ఈ మాసం దేశం లో క్రీడల కు ఒక శుభప్రదమైన సందర్భం అని ప్రధాన మంత్రి చెప్తూ, అమేఠీ కి చెందిన ఎంతో మంది క్రీడాకారులు సైతం అమేఠీ సాంసద్ ఖేల్ ప్రతియోగిత లో పాలుపంచుకోవడం ద్వారా వారి లోని క్రీడా ప్రతిభ ను కళ్ళకు కట్టారన్నారు. ఈ పోటీ నుండి క్రీడాకారులు సంపాదించిన ఆత్మవిశ్వాసాన్ని మరియు నవీన శక్తి ని గమనించవచ్చును, ఈ ఉత్సాహాన్ని నిలబెట్టుకోవడం తో పాటు మరిన్ని అత్యుత్తమమైన ఫలితాలను సాధించడం కోసం తయారు కావలసిన తరుణం వచ్చేసింది అని అయన అన్నారు. ‘‘గత 25 రోజుల లో మీరు గడించినటువంటి అనుభవం మీ క్రీడా రంగ జీవనం లో ఒక గొప్ప ఆస్తి గా ఉంటుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ గొప్పదైన కార్యక్రమం లో పాఠశాల ప్రతినిధి గానో లేక కళాశాల ప్రతినిధి గానో లేక కోచ్ గానో, లేక గురువు గానో పాలుపంచుకోవడం ద్వారా యువ క్రీడాకారుల కు అండగా నిలబడి ప్రోత్సహించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కి పేరు పేరున అభినందనల ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ఒక లక్ష మంది కి పైగా క్రీడాకారులు ఇక్కడ గుమికూడడం అంటేనే అది పెద్ద విషయం అని ఆయన నొక్కి పలుకుతూ, ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఇంతగా విజయవంతం చేసిన అమేఠీ పార్లమెంట్ సభ్యురాలు స్మృతి ఇరానీ గారి కి అభినందనల ను తెలిపారు.

 

‘‘ఏ సమాజం అభివృద్ధి చెందాలన్నా కూడాను క్రీడల కు మరియు క్రీడాకారులకు వర్ధిల్లే అవకాశాలు దక్కడం అనేది చాలా ముఖ్యం’’ అని ప్రధాన మంత్రి అన్నారు. యువత లో వ్యక్తిత్వ వికాసం అనేది క్రీడల మాధ్యం ద్వారా సహజంగానే సంభవిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు. లక్ష్యాన్ని సాధించడం కోసం వారు ఎంతగానో శ్రమిస్తారు, ఓటమి ఎదురైన తరువాత కూడా ప్రయత్నాలు మానరు, జట్టు లో చేరి ముందంజ వేస్తూ ఉంటారని ఆయన అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం లో వందల కొద్దీ ఎంపీ లు వారి వారి నియోజక వర్గాల లో ఆటల పోటీల ను నిర్వహించడం ద్వారా సమాజాభివృద్ధి కి ఒక క్రొత్త బాట ను పరచారు, దీని తాలూకు ఫలితాలు రాబోయే సంవత్సరాల లో స్పష్టం గా కనిపిస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. అమేఠీ లోని యువ క్రీడాకారులు రాబోయే సంత్సరాల లో జాతీయ స్థాయి లో, ఇంకా అంతర్జాతీయ స్థాయి లో పతకాల ను తప్పక గెలుచుకొంటారు, మరి ఈ తరహా పోటీల తో వారికి లభించిన అనభవం వారికి ఎంతగానో ఉపయోగపడుతుందన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

 

 

 

‘‘క్రీడాకారులు మైదానం లోకి అడుగు పెట్టినప్పుడు వారికి ఒకే ఒక లక్ష్యం ఉంటుంది, అది ఏమిటి అంటే వారు స్వయం గాను మరియు జట్టు గాను విజేత గా నిలవాలి అనేదే’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం క్రీడాకారుల మాదిరి గానే దేశాన్ని అగ్రస్థానం లో నిలపాలి అనే ఆలోచన ను యావత్తు దేశం చేస్తోంది అని ఆయన అన్నారు. శ్రీ నరేంద్ర మోదీ క్రీడాకారుల ను గురించి ప్రస్తావిస్తూ, వారు దేశం కోసం ప్రతిదీ పణం గా పెట్టి ఆడుతారు అని, మరి ఈ కాలం లో దేశం కూడా ఒక పెద్దదైన లక్ష్యాన్ని అనుసరిస్తోంది అని ఆయన అన్నారు. భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశం గా మలచడం లో దేశం లోని ప్రతి జిల్లా లో ప్రతి ఒక్క పౌరుని కి/ ప్రతి ఒక్క పౌరురాలి కి పాత్ర ఉందని ఆయన స్పష్టం చేశారు. దీని కోసం ప్రతి రంగం ‘ఒకే భావన, ఒకే లక్ష్యం మరి ఒకే సంకల్పం’ తో ముందుకు సాగిపోవలసి ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. టిఒపిఎస్, ఇంకా ఖేలో ఇండియా గేమ్స్ వంటి పథకాల ను యువత కోసం ప్రవేశపెట్టడమైంది అని ఆయన ప్రస్తావించారు. టిఒపిఎస్ పథకం లో బాగం గా దేశం లో, విదేశాల లో వందల కొద్దీ క్రీడాకారుల కు శిక్షణ ను ఇవ్వడం జరుగుతోంది అని ఆయన తెలిపారు. దీనితో పాటు గా క్రీడాకారుల కు కోట్ల కొద్దీ రూపాయల విలువైన సహాయాన్ని ఇవ్వడం జరుగుతోంది అని ఆయన వివరించారు. ఖేలో ఇండియా గేమ్స్ లో భాగం గా మూడు వేల మంది కి పైగా క్రీడాకారుల కు ఒక్కో నెల 50,000 రూపాయల వంతు న సహాయాన్ని అందజేయడం జరుగుతోంది అని ఆయన వెల్లడించారు. దీని ద్వారా క్రీడాకారుల కు శిక్షణ, ఆహారం, కోచింగ్, ఆవశ్యక క్రీడా సామగ్రి, అవసరమైన ఉపకరణాలు వంటి తదితర అవసరాల ను నెరవేర్చుకోవచ్చును అని ఆయన అన్నారు.

 

మార్పునకు లోనవుతున్న ప్రస్తుత భారతదేశం లో చిన్న పట్టణాల కు చెందిన ప్రతిభావంతులు ముందుకు వచ్చేందుకు అవకాశాన్ని అందుకొంటున్నారు అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. భారతదేశాన్ని ఒక స్టార్ట్-అప్ హబ్ గా తీర్చిదిద్దడం లో చిన్న పట్టణాల పాత్ర ఎంతో ఉంది అని ఆయన ప్రముఖం గా ప్రకటించారు. ప్రస్తుత ప్రపంచం లో ప్రఖ్యాతి ని పొందిన ఎంతో మంది క్రీడాకారులు చిన్న పట్టణాల నుండి ఎదిగిన వారే అని ప్రధాన మంత్రి అన్నారు. యువజనులు ముందడుగు వేసేందుకు, వారి నైపుణ్యాన్ని చాటేందుకు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి పారదర్శకమైన వైఖరి తాలూకు ఖ్యాతి ఇది అని ఆయన అన్నారు. ఏశియాన్ గేమ్స్ లో పతకాల ను గెలిచిన చాలా మంది క్రీడాకారులు చిన్న నగరాల కు చెందిన వారే అని ఆయన ఉదాహరించారు. వారి లోని ప్రతిభ ను ప్రభుత్వం గౌరవించి, వారి కి సమకూర్చిన అన్ని విధాలైన సదుపాయాల ను తాలూకు ఫలితమే ఇది అని ఆయన అన్నారు. ‘‘ఈ క్రీడాకారులు ఫలితాల ను అందించారు’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన అన్ను రాణి, పారుల్ చౌధరి, సుధా సింహ్ ల ఆటతీరు ను ఆయన ప్రత్యేకం గా ప్రస్తావించారు. సాంసద్ ఖేల్ ప్రతియోగిత అనేది ఆ కోవ కు చెందిన ప్రతిభావంతులైన వ్యక్తుల ను వెలికితీసి వారి లోని నైపుణ్యాల ను దేశాని కి ఉపయోగపడేటట్లుగా సానబెట్టడం కోసం ఉద్దేశించిన ఒక గొప్ప మాధ్యం గా ఉంది అని ప్రధాన మంత్రి నొక్కి పలికారు.

 

 

 

క్రీడాకారుల అందరి కఠోర శ్రమ రాబోయే కాలాల్లో ఫలితాల ను ఇవ్వడం మొదలు పెడుతుంది, ఎందరో క్రీడాకారులు దేశం యొక్క మరియు ని మువ్వన్నెల జెండా యొక్క ఖ్యాతి ని ఇనుమడింపచేస్తారన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Apple exports record $2 billion worth of iPhones from India in November

Media Coverage

Apple exports record $2 billion worth of iPhones from India in November
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 17 డిసెంబర్ 2025
December 17, 2025

From Rural Livelihoods to International Laurels: India's Rise Under PM Modi