షేర్ చేయండి
 
Comments
దెహ్ రాదూన్ విద్యార్థి చిరంజీవి అనురాగ్ రమోలా కు చిన్న వయస్సు లోనే జాతీయహితం ముడిపడ్డ అంశాల పై ఉన్న అవగాహన ను మెచ్చుకొంటూ అతడి కి ఉత్తరం రాసిన ప్రధానమంత్రి
‘‘రాబోయే సంవత్సరాల లో ఒక బలమైన మరియు సమృద్ధమైన భారతదేశాన్ని నిర్మించడం లో మీ యువతరం యొక్క తోడ్పాటు కీలకం కానుంది’’

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ యువతరం యొక్క, ప్రత్యేకించి విద్యార్థుల యొక్క ఉత్సాహాన్ని పెంపొందింపచేస్తూ ఉంటారు. ఇందుకోసం వారితో ఆయన తరచు గా మాట్లాడుతూ ఉంటారు. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కావచ్చు, లేదా ‘పరీక్షా పే చర్చా’ కార్యక్రమం కావచ్చు, లేదా వ్యక్తిగత సంభాషణ లు కావచ్చు.. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఎల్లవేళలా వివిధ మాధ్యమాల ద్వారా యువత యొక్క మనోభావాల ను మరియు యువత యొక్క కుతూహలాన్ని గురించి అర్థం చేసుకోవడం ద్వారా వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమం లో భాగం గా, దెహ్ రాదూన్ లో 11వ తరగతి విద్యార్థి చిరంజీవి అనురాగ్ రమోలా లోని కళాప్రతిభ ను, ఆలోచనల ను ప్రధాన మంత్రి మరొక్క మారు ప్రశంసిస్తూ, అతడి ఉత్తరాని కి సమాధానాన్ని రాశారు.

అనురాగ్ ఆలోచన లు నచ్చి ప్రధాన మంత్రి తన లేఖ లో, ‘‘నీ సిద్ధాంత పరమైన పరిణతి నీ లేఖ లో నువ్వు రాసిన మాటల లోను, చిత్రలేఖనాని కై ఎంచుకొన్న ‘భారతదేశ స్వాతంత్య్రాని కి అమృత మహోత్సవం’ అనే ఇతివృత్తం లోను ప్రతిబింబించింది. యౌవనదశ నుంచే దేశ హితాని కి సంబంధించిన అంశాల పట్ల నీవు అవగాహన ను ఏర్పరచుకొన్నందుకు నేను సంతోషిస్తున్నాను. అంతేకాదు నీకు ఒక బాధ్యత కలిగిన పౌరుని గా దేశం అభివృద్ధి లో నీ పాత్ర ఏమిటి అనేది ఎరుకే’’ అని పేర్కొన్నారు.

ఒక స్వయంసమృద్ధి యుక్తం అయినటువంటి భారతదేశాన్ని రూపొందించడం లో దేశ ప్రజలు అందరి తోడ్పాటు ను మెచ్చుకొంటూ ప్రధాన మంత్రి తన లేఖ లో ఇంకా ఇలా రాశారు: ‘‘స్వాతంత్య్రం తాలూకు ఈ అమృత కాలం లో దేశం సామూహిక శక్తి తో, ‘సబ్ కా ప్రయాస్’ మంత్రం తో ముందంజ వేస్తున్నది. రాబోయే సంవత్సరాల లో ఒక బలమైనటువంటి మరియు సమృద్ధం అయినటువంటి భారతదేశాన్ని నిర్మించడం లో మన యువతరం యొక్క తోడ్పాటు కీలకం కానున్నది.’’

చిరంజీవి అనురాగ్ రమోలా భవిష్యత్తు సఫలం కావాలి అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తూ, ఆ బాలుడు తన జీవనం లో రచనాత్మకత అండ తో సముచితమైన సఫలత ను అందుకొంటూ మునుముందుకు సాగిపోతూనే ఉంటాడన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

అనురాగ్ గీసిన ఈ కింది చిత్రలేఖనాన్ని Narendra Modi App లో మరియు narendramodi.in వెబ్ సైట్ లో పొందుపరచడం జరిగింది; అనురాగ్ కు ప్రేరణ ను ఇచ్చేందుకు గాను ఈ పని ని చేయడమైంది.

దేశ హితాని కి సంబంధించిన అంశాల పై చిరంజీవి అనురాగ్ రమోలా తన అభిప్రాయాల ను వివరిస్తూ ప్రధాన మంత్రి కి ఇంతకు ముందు ఒక ఉత్తరాన్ని రాసిన సంగతి ఇక్కడ గుర్తు చేసుకోదగ్గది. ప్రతికూలత లు ఎదురయినప్పటి కి కూడాను సహనాన్ని కోల్పోకూడదని, కఠోర శ్రమ తోను నిజాయతీ తోను లక్ష్యం వైపునకు సాగిపోవాలని, తనతో ప్రతి ఒక్కరి ని కలుపుకొని వెళ్లాలని ప్రధాన మంత్రి నుంచే తాను ప్రేరణ ను పొందినట్లు చిరంజీవి అనురాగ్ రమోలా తన లేఖ లో పేర్కొన్నాడు.

గమనిక: కళలు మరియు సంస్కృతి అంశాల లో ప్రధాన మంత్రి తరఫు న ‘జాతీయ బాలల పురస్కారం 2021’ని అనురాగ్ రమోలా కు ప్రదాన చేయడం జరిగింది.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
How MISHTI plans to conserve mangroves

Media Coverage

How MISHTI plans to conserve mangroves
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 మార్చి 2023
March 21, 2023
షేర్ చేయండి
 
Comments

PM Modi's Dynamic Foreign Policy – A New Chapter in India-Japan Friendship

New India Acknowledges the Nation’s Rise with PM Modi's Visionary Leadership