భారతదేశం లో మొట్ట మొదటిది అయినటువంటి మరియు పూర్తి గా దేశీయం గా నిర్మాణం జరిగినటువంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ యొక్క ‘‘కోర్ లోడింగ్’’ ప్రక్రియ కల్‌పక్కమ్ లో ఆరంభం అయిన ఘట్టాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న పరిశీలించారు.

ఈ బ్రీడర్ రియాక్టర్ వినియోగించుకొనే ఇంధనం కంటే అధికంగా ఉత్పాదన ను అందిస్తుంది అని, భారతదేశం లో అపారం గా ఉన్న థోరియమ్ నిక్షేపాలు పూర్తి గా సద్వినియోగం అయ్యేందుకు మార్గాన్ని ఇది సుగమం చేస్తుంది అని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ, ఆ సందేశం లో -

‘‘ఈ రోజు న, భారతదేశం యొక్క మొట్ట మొదటిది మరియు పూర్తి గా దేశీయం గా రూపొందినదీ అయినటువంటి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ తాలూకు ‘కోర్ లోడింగ్’ ప్రక్రియ కల్‌పక్కమ్ లోమొదలవడాన్ని నేను గమనించాను. ఈ బ్రీడర్ రియాక్టర్ వినియోగించుకొనే ఇంధనం కంటే ఎక్కువ ఇంధనాన్నే ఉత్పత్తి చేస్తుంది.

ఈ బ్రీడర్ రియాక్టర్ ద్వారా భారతదేశం లోని అపారమైన థోరియమ్ నిక్షేపాల ను పూర్తి స్థాయి లో వినియోగించుకొనేందుకు మార్గం సుగమం కాగలదు; మరి ఈ విధం గా పరమాణు ఇంధనాన్ని దిగుమతి చేసుకొనే అగత్యం సమాప్తం అవుతుంది.

దీనితో భారతదేశానికి శక్తి రంగం లో స్వయం సమృద్ధి ని సాధించడం తో పాటు నెట్ జీరో లక్ష్యాన్ని సాధించే దిశ లో ముందడుగు వేయడం లో సాయం అందుతుంది.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India clears a major nuclear milestone as Kalpakkam fast breeder reactor turns 'critical'

Media Coverage

India clears a major nuclear milestone as Kalpakkam fast breeder reactor turns 'critical'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chief Minister of Chhattisgarh meets Prime Minister
April 07, 2026