పొయిలా బైశాఖ్ పర్వదినం ‘శుభో నబో బర్షో’ నేపథ్యంలో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“శుభో నబో బర్షో! (నూతన సంవత్సర శుభాకాంక్షలు) ఈ ఏడాదంతా మీ జీవితాల్లో సుఖసంతోషాలు నిండాలని, మీరంతా చక్కని ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Shubho Nabo Barsho! May the year ahead bring joy and exceptional health. pic.twitter.com/xc6dnjzYYU
— Narendra Modi (@narendramodi) April 15, 2023


