రష్యా భాషలోని భగవద్గీత ప్రతిని అధ్యక్షుడు శ్రీ పుతిన్‌కు బహూకరించిన ప్రధానమంత్రి

రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్‌కు భారత్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతం పలికారు.
‘‘ఈ రోజు సాయంత్రం, రేపూ మన మధ్య జరుగనున్న చర్చల కోసం నేను ఎదురుచూస్తున్నాను. భారత్, రష్యా మైత్రి కాల ప్రభావానికి తట్టుకొని నిలిచింది. ఈ మైత్రితో మన ప్రజలకు ఎంతో మేలు కలిగింది’’ అని శ్రీ మోదీ అన్నారు.
రష్యన్ భాషలోకి అనువాదమైన భగవద్గీత పుస్తకాన్ని రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ బహూకరించారు. గీత బోధనలు ప్రపంచం అంతటా లక్షల మందికి స్ఫూర్తిని అందిస్తున్నాయని శ్రీ మోదీ అన్నారు.
‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశంలో ఇలా పేర్కొన్నారు:
‘‘నా స్నేహితుడు, అధ్యక్షుడు శ్రీ పుతిన్‌కు భారత్‌కు ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ రోజు సాయంత్రమూ, రేపూ మన మధ్య జరుగనున్న చర్చల కోసం నేను ఎదురు చూస్తున్నాను. భారత్, రష్యా మైత్రి కాల ప్రభావానికి తట్టుకొని నిలిచింది. ఈ మైత్రితో మన ప్రజలకు ఎంతో మేలు కలిగింది’’.
‘‘నా నేస్తం, అధ్యక్షుడు శ్రీ పుతిన్‌ను 7, లోక్ కల్యాణ్ మార్గ్‌కు ఆహ్వానించాను’’.
‘‘రష్యన్ భాషలోకి అనువాదమైన గీత పుస్తకాన్ని అధ్యక్షుడు శ్రీ పుతిన్‌కు అందజేశాను. గీత బోధనలు ప్రపంచవ్యాప్తంగా లక్షల మందికి స్ఫూర్తిని అందిస్తున్నాయి’’.

 

"Я рад приветствовать в Дели своего друга - Президента Путина. С нетерпением жду наших встреч сегодня вечером и завтра. Дружба между Индией и Россией проверена временем; она принесла огромную пользу нашим народам."

"Welcomed my friend, President Putin to 7, Lok Kalyan Marg."

"Поприветствовал моего друга, Президента Путина, на Лок Калян Марг, 7."

"Presented a copy of the Gita in Russian to President Putin. The teachings of the Gita give inspiration to millions across the world."

@KremlinRussia_E

"Подарил Президенту Путину экземпляр Бхагавад-гиты на русском языке. Учения Гиты вдохновляют миллионы людей по всему миру."

@KremlinRussia_E

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'

Media Coverage

'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 సెప్టెంబర్ 2026
September 15, 2026

A Mandate of Performance: Civic Wins, IPO Surge and Neighbourly Power Reflect Faith in PM Modi’s Leadership