ఎటా (ఉత్తరప్రదేశ్)లోని పట్నా పక్షుల అభయారణ్యాన్ని, కచ్ (గుజరాత్)లోని ఛారీ-ధండ్‌ను రాంసర్ ప్రాంతాలుగా గుర్తించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. స్థానికులకు, చిత్తడి నేలల సంరక్షణపై ఆసక్తి ఉన్నవారికి శ్రీ మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. జీవవైవిధ్యాన్ని కాపాడటంలో, కీలకమైన పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడంలో తమ చిత్తశుద్ధిని ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తోందని పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ పోస్టుకు ప్రధానమంత్రి స్పందిస్తూ:
‘‘ఎటా (ఉత్తరప్రదేశ్)లోని పట్నా పక్షుల అభయారణ్యాన్ని, కచ్ (గుజరాత్)లోని ఛారీ-ధండ్‌ను రాంసర్ ప్రాంతాలుగా గుర్తించడం ఆనందదాయకం. అక్కడి స్థానికులకు, చిత్తడి నేలల పరిరక్షణపై ఆసక్తి ఉన్నవారికి శుభాకాంక్షలు. జీవవైవిధ్యాన్ని కాపాడటంలో, కీలకమైన పర్యావరణ వ్యవస్థలను పరిరక్షించడంలో మా చిత్తశుద్ధిని ఈ గుర్తింపు పునరుద్ఘాటిస్తోంది. ఈ చిత్తడి నేలలు అనేక వలస, స్థానిక జీవ జాతులకు సురక్షితమైన ఆవాసాలుగా కొనసాగుతాయని ఆకాంక్షిస్తున్నాను.’’
Delighted that the Patna Bird Sanctuary in Etah (Uttar Pradesh) and Chhari-Dhand in Kutch (Gujarat) are Ramsar sites. Congratulations to the local population there as well as all those passionate about wetland conservation. These recognitions reaffirm our commitment to preserving… https://t.co/0O3R5TBqbJ
— Narendra Modi (@narendramodi) January 31, 2026


