ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) యొక్క డైరక్టర్ జనరల్ డాక్టర్ శ్రీ టెడ్రోస్ అధానోమ్ ఘెబ్రెయెసస్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భారతదేశాని కి ఆహ్వానించారు. డాక్టర్ శ్రీ టెడ్రోస్ ఇదివరకు భారతదేశాన్ని సందర్శించిన సందర్భం లో శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు ‘తులసి భాయి’ అనే పేరు ను పెట్టారు.
గుజరాత్ లోని గాంధీనగర్ లో 2023 ఆగస్టు 17 వ మరియు 18వ తేదీల లో జరుగనున్న డబ్ల్యుహెచ్ఒ గ్లోబల్ సమిట్ ఆన్ ట్రడిశనల్ మెడిసిన్ లో డాక్టర్ శ్రీ టెడ్రోస్ పాలుపంచుకోనున్నారు.
ఆయుష్ మంత్రిత్వ శాఖ ట్వీట్ లకు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ -
‘‘నా మంచి మిత్రుడు తులసి భాయి గారు నవరాత్రి కోసమని చాలా చక్కగా సన్నద్ధుడు అవుతున్నారు. శ్రీ @DrTedros, భారతదేశానికి మీకు ఇదే స్వాగతం.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
My good friend Tulsi Bhai is clearly well prepared for Navratri! Welcome to India, @DrTedros! https://t.co/NSOSe32ElW
— Narendra Modi (@narendramodi) August 16, 2023