మ‌య‌న్మార్ లోని బాగాన్ లో ఆనందా దేవాల‌యాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంద‌ర్శించారు.

ఇది 12వ శ‌తాబ్దం ఆరంభ కాలంలో నిర్మాణ‌మైన ఒక బౌద్ధ దేవాల‌యం. బాగాన్ ప్రాంతంలోకెల్లా రెండ‌వ అతి పెద్ద దేవాల‌యం ఇది. ఈ దేవాల‌యానికి సంబంధించిన నిర్మాణ ప‌రిర‌క్ష‌ణతో పాటు ర‌సాయ‌నాల సాయంతో కాపాడే ప‌నుల‌ను భార‌త‌దేశ పురావ‌స్తు స‌ర్వేక్ష‌ణ సంస్థ (ఎఎస్ఐ) నిర్వ‌హించింది.

 

 కింద‌టి ఏడాది భూకంపం స‌మ‌యంలో ఈ దేవాలయం ధ్వంసం అయినే నేపథ్యంలో ప్రస్తుతం పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను కొన‌సాగిస్తున్నారు. దేవాల‌యంలో జరుగుతున్న పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను తెలియ‌జేసే ఒక ఛాయా చిత్ర ప్ర‌ద‌ర్శ‌న‌ను ప్ర‌ధాన మంత్రి చూశారు. ఆయ‌న దేవాల‌యాన్ని చుట్టి వ‌చ్చారు; ప్రార్థ‌న‌ల‌లో పాలుపంచుకొన్నారు. ఈ సంద‌ర్భంగా ఎఎస్ఐ ప్ర‌తినిధులు దేవాల‌య పున‌రుద్ధ‌ర‌ణ ప్ర‌క్రియ‌ను గురించి ప్ర‌ధాన మంత్రికి వివ‌రించారు.

 

దేవాల‌యం సంద‌ర్శ‌కుల పుస్త‌కంలో ప్ర‌ధాన‌ మంత్రి సంత‌కం చేశారు. ఆనందా దేవాల‌యం పున‌రుద్ధ‌ర‌ణ‌లో భార‌త‌దేశం అందిస్తున్న తోడ్పాటు యొక్క విశిష్ట‌త‌ను సూచించే ఒక ఫ‌ల‌కాన్ని కూడా ఆవిష్క‌రించారు.

 

 

 

 

ఆసియా అంత‌టా వేరు వేరు దేశాల‌లో అనేక ప్ర‌ధాన సంర‌క్ష‌ణ ప‌నుల‌ను ఎఎస్ఐ అమ‌లుప‌రచింది. వీటిలో ఆనందా దేవాల‌యంతో పాటు అఫ్గ‌ానిస్తాన్ లోని బ‌మియాన్ బుద్ధులు, కంబోడియా లో అంకోర్‌ వ‌ట్‌, తా ప్రోమ్ దేవాల‌యం, లావోస్ లో వట్ ఫూ దేవాల‌యం, వియ‌త్ నామ్ లోని మై స‌న్ టెంపుల్ లు కూడా ఉన్నాయి. 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
“Makes every Indian proud”: PM Modi hails India’s 7.7 per cent GDP growth in FY 2025-26

Media Coverage

“Makes every Indian proud”: PM Modi hails India’s 7.7 per cent GDP growth in FY 2025-26
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister congratulates Indian Women’s Football Team on winning the SAFF Women’s Championship 2026
June 07, 2026

Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Women’s Football Team on winning the SAFF Women’s Championship 2026. The Prime Minister noted that they have played excellently through the tournament.

Shri Modi observed that this will encourage more youngsters to play football in the coming times. The Prime Minister extended his best wishes to the team for their future endeavours.

The Prime Minister posted on X:

"Congratulations to the Indian Women’s Football Team on winning the SAFF Women’s Championship 2026. They have played excellently through the tournament. This will encourage more youngsters to play football in the coming times. Best wishes to the team for their future endeavours."