రూ.11,200 కోట్ల వ్యయంతో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయంలో అభివృద్ధి చేసిన ఫేజ్-Iను ప్రారంభించనున్న పీఎం
రోడ్డు, రైలు, మెట్రో, ప్రాంతీయ రవాణా వ్యవస్థలను ఒక చోట అనుసంధానిస్తూ సమగ్ర రవాణా కేంద్రంగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం
ఈ విమానాశ్రయంలో ఏటా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల సరకును రవాణా సామర్థ్యంతో రూపొందించిన
సమగ్ర సరకు రవాణా కేంద్రం.. భవిష్యత్తులో సుమారు 18 లక్షల మెట్రిక్ టన్నులకు విస్తరణ

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి 28, 2026న ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం 11:30కి గౌతమబుద్ధ నగర్‌లోని జేవార్ వద్దనున్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, టెర్మినల్ భవనాన్ని పరిశీలిస్తారు. 12 గంటలకు నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయ ఫేజ్-Iను ప్రారంభిస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం.. ప్రపంచ విమానయాన కేంద్రంగా భారత్ ఎదిగే క్రమంలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది. జాతీయ రాజధాని ప్రాంతానికి (ఎన్‌సీఆర్) ప్రధాన అంతర్జాతీయ ద్వారంగా ఏర్పాటైన ఈ విమానాశ్రయం.. ఎయిర్‌పోర్టు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయటంలో ప్రాంతీయ, అంతర్జాతీయ అనుసంధానతను మెరుగుపరచటంలో కీలక ముందడుగు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి అనుబంధంగా, ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతానికి రెండో అంతర్జాతీయ విమానాశ్రయంగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేశారు. ఈ రెండు విమానాశ్రయాలు సమగ్ర విమానయాన వ్యవస్థగా పనిచేయటం ద్వారా రద్దీ తగ్గటమే కాక, ప్రయాణికుల సామర్థ్యం పెరగటంతో ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతం ప్రపంచంలోని ప్రధాన విమానయాన కేంద్రాల సరసన నిలుస్తుంది.

భారతదేశంలోని అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ ప్రాజెక్టుల్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం ఒకటి. ఈ విమానాశ్రయ మొదటి దశ అభివృద్ధి పనులు రూ.11,200 కోట్ల వ్యయంతో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో జరిగాయి. ప్రారంభంలో ఏడాదికి 12 మిలియన్ల ప్రయాణికుల సామర్థ్యంతో విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయగా.. భవిష్యత్తులో 70 మిలియన్లకు పెంచుకునే అవకాశం ఉంది. ఇక్కడున్న 3,900 మీటర్ల పొడవైన రన్ వే.. భారీ విమానాల రాకపోకలకు అనుకూలంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితులతో సంబంధం లేకుండా 24 గంటల పాటు కార్యకలాపాలు సాఫీగా సాగేలా ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండిగ్ సిస్టమ్ (ఐఎల్ఎస్), అధునాతన ఎయిర్ ఫీల్డ్ లైటింగ్ వంటి అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు.

సమగ్ర సరకు రవాణా కేంద్రం, సమగ్ర సరకు టెర్మినల్, లాజిస్టిక్స్ జోన్లతో పటిష్ఠమైన సరకు రవాణా వ్యవస్థలు ఈ విమానాశ్రయంలో ఉన్నాయి. ఏటా 2.5 లక్షల మెట్రిక్ టన్నుల రవాణా సామర్థ్యంతో రూపొందించిన సరకు రవాణా కేంద్రం.. భవిష్యత్తులో సుమారు 18 లక్షల మెట్రిక్ టన్నులకు విస్తరించుకునే వెసులుబాటు ఉంది. విమానాల నిర్వహణ, మరమ్మతులు, ఓవర్ హాలింగ్ (ఎంఆర్ఓ) కోసం ప్రత్యేకంగా 40 ఎకరాల విస్తీర్ణంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.

సుస్థిర, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రూపొందించారు. ఇంధన సామర్థ్య వ్యవస్థలు, పర్యావరణహిత పద్దతులను అనుసరిస్తూ కర్బన ఉద్గార రహితంగా ఉండాలని ఈ విమానాశ్రయం లక్ష్యంగా పెట్టుకుంది. భారత వారసత్వ స్ఫూర్తితో సంప్రదాయ ఘాట్లు, హవేలీలను ప్రతిబింబించేలా దీని నిర్మాణ శైలి ఉంది. సాంస్కృతిక కళను ఆధునిక మౌలిక సదుపాయాలతో మిళితం చేస్తూ అద్భుతంగా ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంది.

యమునా ఎక్స్‌ప్రెస్‌వేకు సమీపంగా వ్యూహాత్మక ప్రదేశంలో ఉన్న నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం.. ప్రయాణికులు, సరకురవాణాకు సౌకర్యంగా ఉంటుంది. రోడ్డు, రైలు, మెట్రో, ప్రాంతీయ రవాణా వ్యవస్థల అనుసంధానంతో సమగ్ర రవాణా కేంద్రంగా రూపొందించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PMAY-U Nears 1.25 Crore Homes: Top 10 States With The Highest PMAY-U Completion Rates

Media Coverage

PMAY-U Nears 1.25 Crore Homes: Top 10 States With The Highest PMAY-U Completion Rates
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 24 జూన్ 2026
June 24, 2026

Appreciation for PM Modi’s Vision for Holistic Growth, Furthering Technology as well as Traditions