అరుణాచల్ ప్రదేశ్ లోని అపారమైన జలవిద్యుత్తు సామర్థ్యాన్ని వినియోగించుకునేలా ఇటానగర్ లో రూ. 3,700 కోట్ల పైగా విలువైన రెండు భారీ జల విద్యుత్తు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి
జీవన ప్రమాణాలను మెరుగుపరిచే అనుసంధానం, ఆరోగ్యం, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం
త్రిపురలో మాతా త్రిపుర సుందరి ఆలయ సముదాయాన్ని సందర్శించి, అభివృద్ధి పనులను ప్రారంభించనున్న ప్రధానమంత్రి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబర్ 22వ తేదీన అరుణాచల్ ప్రదేశ్ , త్రిపుర రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అరుణాచల్ ప్రదేశ్ లోని ఇటానగర్ లో 5,100 కోట్ల రూపాయల పైగా విలువైన అనేక అభివృద్ధి పథకాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు.  బహిరంగసభలో ప్రసంగిస్తారు.

ఆ తరువాత, ఆయన త్రిపురలో మాతా త్రిపుర సుందరి ఆలయాన్ని దర్శించి పూజకార్యక్రమాలలో పాల్గొంటారు. మాతా త్రిపుర సుందరి ఆలయ సముదాయం' అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు.

అరుణాచల్ ప్రదేశ్ లో ప్రధానమంత్రి కార్యక్రమాలు 

అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో విస్తారమైన జలవిద్యుత్ సామర్థ్యాన్ని వినియోగించుకుంటూ సుస్థిరమైన ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం ఇటానగర్‌లో రూ. 3,700 కోట్లకు పైగా విలువైన రెండు భారీ జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని సియోం ఉప పరివాహక ప్రాంతంలో  హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (240 మెగావాట్లు),  టాటో-I హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (186 మెగావాట్లు) లను అభివృద్ధి చేస్తారు. 

తావాంగ్‌లో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్‌కు  ప్రధాని శంకుస్థాపన చేస్తారు. సముద్ర మట్టానికి 9,820 అడుగుల ఎత్తులో ఉన్న సరిహద్దు జిల్లా తావాంగ్‌లో నిర్మించే ఈ కన్వెన్షన్ సెంటర్‌ జాతీయ, అంతర్జాతీయ సమావేశాలు, సాంస్కృతిక ఉత్సవాలు, ప్రదర్శనలను నిర్వహించడానికి ఒక ఒక ప్రతిష్ఠాత్మక వేదికగా నిలుస్తుంది. 1,500 మందికి పైగా ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యంతో ఈ కేంద్రం అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాంత పర్యాటక,   సాంస్కృతిక సామర్థ్యాలను మరింత అభివృద్ధి చేయడానికి తోడ్పడుతుంది.

రూ.1,290 కోట్లకు పైగా విలువైన పలు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. వీటిలో రవాణా అనుసంధానం, ఆరోగ్యం, అగ్ని మాపక భద్రత, ఉద్యోగినుల వసతి గృహాలు మొదలైనవి ఉన్నాయి. ఇవి ఈ ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేసి, జీవన ప్రమాణాలను మెరుగుపరచి, అనుసంధానాన్ని మరింత బలోపేతం చేస్తాయని భావిస్తున్నారు.

వ్యాపార సౌలభ్యం కల్పించి, ప్రోత్సాహకరమైన పారిశ్రామిక వాతావరణాన్ని అభివృద్ధి చేయాలన్న తమ ఉద్దేశానికి అనుగుణంగా, ప్రధానమంత్రి స్థానిక పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు, పరిశ్రమ ప్రతినిధులతో సమావేశమై, ఇటీవలి జీఎస్టీ రేట్ల సవరణ ప్రభావంపై కూడా చర్చించనున్నారు.

త్రిపురలో ప్రధానమంత్రి కార్యక్రమాలు

దేశంలో  ఆధ్యాత్మిక,  సాంస్కృతిక వారసత్వాన్ని అభివృద్ధి చేసి, సంరక్షించాలన్న నిబద్ధతకు  అనుగుణంగా, పునరుజ్జీవనం,  ఆధ్యాత్మిక వారసత్వ అభివృద్ధి (ప్రసాద్) పథకం కింద మాతబరిలోని మాత త్రిపురసుందరి దేవాలయ సముదాయం అభివృద్ధి పనులను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పురాతన 51 శక్తి పీఠాలలో ఒకటైన . ఈ ఆలయం త్రిపుర రాష్ట్రంలోని గోమతి జిల్లా ఉదయపూర్ పట్టణంలో ఉంది.

ఈ ప్రాజెక్టు పైనుంచి చూడగానే తాబేలు ఆకారంలో కనిపించేలా రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఆలయ ప్రాంగణంలో మార్పులుచేస్తారు. కొత్త దారులు నిర్మిస్తారు.  ప్రవేశ ద్వారాలను పునరుద్ధరిస్తారు. ప్రహరీ, డ్రైనేజ్ వ్యవస్థ,  స్టాళ్లు, ధ్యాన మందిరం, అతిథుల వసతి గృహాలు, కార్యాలయ గదులు మొదలైన వాటితో కూడిన కొత్త మూడు అంతస్తుల సముదాయాన్ని నిర్మిస్తారు. ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, ఉద్యోగాలను, వ్యాపార అవకాశాలను సృష్టించడానికి,  సమగ్ర సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ కీలక పాత్ర పోషిస్తుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India to add 100 merchant ships to its fleet in 5 years: Sarbananda Sonowal

Media Coverage

India to add 100 merchant ships to its fleet in 5 years: Sarbananda Sonowal
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి 27న ప్రధానమంత్రి ప్రసంగం
August 26, 2026
దేశంలో క్రీడలు.. యువ నాయకత్వం.. పౌర బాధ్యత.. స్వచ్ఛంద సేవ.. దారుఢ్యం.. దేశ ప్రగతి వంటి అంశాలను ఈ చర్చలు ఒకే వేదికపైకి తెస్తాయి
ఈ చర్చలు ప్రధానంగా క్రీడలు.. ఒలింపిక్స్‌ ఆకాంక్షలు.. యువ నేతృత్వం.. వికిసిత భారత్.. మాదకద్రవ్య రహిత యువతరంపై దృష్టి సారిస్తాయి

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 27న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా ‘ఖేలో ఇండియా’ చర్చల్లో భాగంగా యువతనుద్దేశించి ప్రసంగిస్తారు. దేశ క్రీడారంగ పురోగమనంలో యువత భాగస్వామ్యం సహా వారి ఆకాంక్షల వెల్లడి, యువతరం నాయకత్వాన బలమైన వికసిత భారత్ కోసం మేధా మధనం లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

జాతీయ క్రీడా దినోత్సవం-2026లో భాగంగా ‘మేరా యువ భారత్’ ఆధ్వర్యాన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రతి జిల్లాలోగల రెండు కళాశాలల్లో యువతరం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. జాతీయ ప్రగతి కార్యకలాపాల్లో యువత ఆకాంక్షలకు కీలక స్థానమిస్తూ ఆరోగ్యకర, క్రమశిక్షణాయుత. క్రీడాస్ఫూర్తి గల దేశానికి రూపుదిద్దాలన్న ప్రధానమంత్రి దృక్కోణానికి అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టారు.

దేశంలో క్రీడలు, యువ నాయకత్వం, పౌర కర్తవ్యం, స్వచ్ఛంద సేవ, దారుఢ్యం, దేశ పురోగమనం తదితర అంశాలన్నిటిపైనా చర్చను ఈ కార్యక్రమం ఒకే వేదికపైకి తెస్తుంది. దేశ క్రీడారంగ పురోగమన ఆకాంక్షలతో యువత మమేకమయ్యే ప్రత్యక్ష మార్గాన్ని నిర్దేశిస్తుంది. దేశ యువతరం, క్రీడా వ్యవస్థపై చర్చల సందర్భంగా వారి ఆలోచనలు, దృక్కోణాలను పంచుకునే వేదికగా ఇది ఉపయోగపడుతుంది.

ఈ జాతీయ స్థాయి కార్యక్రమం అనంతరం యువ భాగస్వాములు, మై భారత్ వలంటీర్లు, స్థానిక క్రీడాకారులు, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో స్థానిక స్థాయిలో చర్చలు సాగుతాయి. క్రీడాసక్తి గల యువత, ప్రముఖ క్రీడాకారులు, పతక విజేతల మధ్య ప్రత్యక్ష ఇష్టాగోష్ఠి ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. ఇందులో ‘యువతరం చర్చలు’ ప్రధానాంశంగా ఉంటాయి. యువ భాగస్వాములు తమ ఆలోచనలు, దృక్కోణాలు, ఆకాంక్షలను ఈ వేదిక ద్వారా పంచుకుంటారు. ఈ చర్చలు ప్రధానంగా దిగువ పేర్కొన్న 5 అంశాలపై కేంద్రీకృతమవుతాయి:

· మెరుగైన సౌకర్యాలు, శిక్షణ, క్రీడా విజ్ఞానం, సార్వజనీన భాగస్వామ్యంతో జాతీయ క్రీడా వ్యవస్థ మెరుగుదల.

· శాస్త్రీయ ప్రతిభకు గుర్తింపు, పారదర్శక ఎంపిక, దీర్ఘకాలిక క్రీడా వికాసం ద్వారా 2036లో ఒలింపిక్స్ దిశగా ప్రతిభకు పదును పెట్టడం.

· పరిపాలన వేదికలు, మై భారత్ నేతృత్వంలోని స్వచ్ఛంద సేవ ద్వారా యువ నాయకత్వాన్ని తీర్చిదిద్దడం.

· పౌర చైతన్యం, భవిష్యత్‌ సంసిద్ధ నైపుణ్యం, వ్యవస్థీకృత స్వచ్ఛంద సేవకు ప్రోత్సాహం, ద్వారా వికసిత భారత్ ప్రస్థానం వైపు యువతరానికి సాధికారత కల్పన.

· ఈ నెల 2న ప్రారంభమైన ‘ప్రధానమంత్రి 100 వారాల ప్రచారం’లో భాగంగా వారానికోసారి జన భాగస్వామ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మాదకద్రవ్య వినియోగంపై పోరులో క్రీడలు సహా, సహ రంగాల్లోని వివిధ బృందాల సేవల ద్వారా ‘మాదకద్రవ్య రహిత యువత’ ఉద్యమాన్ని ప్రోత్సహించడం దీని ప్రధాన ధ్యేయం.