పార్లమెంటుసెంట్రల్ హాలు లో జరిగే రాజ్యాంగ దినం కార్యక్రమాన్నిఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తారు
విజ్ఞాన్భవన్ లో సర్వోన్నత న్యాయస్థానం నిర్వహించే రాజ్యాంగ దినం ఉత్సవాల ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారు

రాజ్యాంగ పరిషత్తు 1949వ సంవత్సరం లో భారతదేశ రాజ్యాంగాని కి అంగీకారం తెలిపిన సంఘటన ను స్మరించుకోవడం కోసం నవంబరు 26 న దేశ ప్రజలు రాజ్యాంగ దినాన్ని వేడుక గా జరుపుకోనున్నారు. రాజ్యాంగ దినాన్ని పాటించడం అనేది 2015వ సంవత్సరం లో మొదలైంది. ఈ చరిత్రాత్మకమైన రోజు కు గల ప్రాముఖ్యాన్ని తగిన రీతి న గుర్తించడం కోసం ప్రధాన మంత్రి కనబరచిన దృష్టి కోణం ఆధారం గా ఈ దినాన్ని ఆచరించడం జరుగుతోంది. శ్రీ నరేంద్ర మోదీ తాను గుజరాత్ ముఖ్యమంత్రి గా ఉన్న కాలం లో 2010వ సంవత్సరం లో నిర్వహించినటువంటి ‘‘సంవిధాన్ గౌరవ్ యాత్ర’’ నాడే ఈ దృష్టి కోణం తాలూకు బీజం అంకురించింది అని కూడా చెప్పవచ్చును.

ఈ సంవత్సరం రాజ్యాంగ దినోత్సవాల లో భాగం గా 2021 నవంబరు 26 వ తేదీన పార్లమెంటు లోను, విజ్ఞాన్ భవన్ లోను ఏర్పాటయ్యే కార్యక్రమాల లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాలుపంచుకోనున్నారు.

పార్లమెంటు లో నిర్వహించే కార్యక్రమం ఉదయం 11 గంటల కు ఆరంభం అవుతుంది. ఈ కార్యక్రమాన్ని పార్లమెంటు యొక్క సెంట్రల్ హాల్ లో జరుపనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాన్య రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ఇంకా లోక్ సభ స్పీకర్ లు ప్రసంగిస్తారు. మాన్య రాష్ట్రపతి ప్రసంగించిన అనంతరం రాజ్యాంగ పీఠిక ను చదివే క్రమం లో ఆయన తో పాటు దేశ ప్రజలు ప్రత్యక్షం గా పాలుపంచుకోనున్నారు. రాజ్యాంగ పరిషత్తు చర్చల తాలూకు డిజిటల్ వర్శను ను, భారతదేశ రాజ్యాంగం యొక్క దస్తూరి ప్రతి తాలూకు డిజిటల్ వర్శను ను, అలాగే ఇప్పటివరకు భారతదేశ రాజ్యాంగం లో చోటు చేసుకొన్న అన్ని సవరణల ను చేర్చినటువంటి రాజ్యాంగం యొక్క వర్తమాన వర్శను ను కూడా మాన్య రాష్ట్రపతి ఆవిష్కరించనున్నారు. ‘కాన్‌ స్టిట్యూశనల్ డెమోక్రసీ పై ఆన్‌లైన్ క్విజ్’ ను కూడా ఆయన ప్రారంభిస్తారు.

సుప్రీం కోర్టు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో గల ప్లీనరీ హాలు లో సాయంత్రం 5:30 గంటల కు నిర్వహించే రెండు రోజుల రాజ్యాంగ దినోత్సవాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో సర్వోన్నత న్యాయస్థానాని కి చెందిన అందరు న్యాయమూర్తులు, అన్ని ఉన్నత న్యాయస్థానాల కు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, అత్యంత అనుభవజ్ఞులైనటువంటి న్యాయమూర్తుల తో పాటు జూనియర్ న్యాయమూర్తులు, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, ఇంకా న్యాయ సమాజం లోని ఇతర సభ్యులు కూడా పాల్గొంటారు. ప్రముఖుల సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ఇచ్చే ప్రసంగం ఈ కార్యక్రమం లో ఒక భాగం గా ఉంటుంది.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Project Cheetah: How A Species Declared Extinct During Nehru Era Returned To India Under Modi Govt

Media Coverage

Project Cheetah: How A Species Declared Extinct During Nehru Era Returned To India Under Modi Govt
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister highlights remarkable momentum in India's digital infrastructure journey
June 05, 2026
PM Lauds AirTrunk’s proposed investment of around Rs. 3 lakh crore to develop 5 GW data centre capacity

Prime Minister Shri Narendra Modi today highlighted that India’s digital infrastructure journey is gathering remarkable momentum. The Prime Minister noted that AirTrunk has announced plans to invest around Rs. 3 lakh crore ($30 billion) in India and develop 5 GW of data centre capacity, observing that this is among the largest proposed investments in the country’s digital infrastructure ecosystem.

Shri Modi stated that such investments will significantly strengthen India’s position as a global hub for cloud computing and AI. The Prime Minister pointed out that these developments will simultaneously generate employment opportunities, support local supply chains, and accelerate innovation-led growth, affirming that the future of the world’s digital economy is increasingly being shaped in India.

The Prime Minister posted on X:

"India’s digital infrastructure journey is gathering remarkable momentum.
AirTrunk has announced plans to invest around Rs. 3 lakh crore ($30 billion) in India, and develop 5 GW of data centre capacity. This is among the largest proposed investments in the country’s digital infrastructure ecosystem.

Such investments will strengthen India’s position as a global hub for cloud computing and AI, while generating employment opportunities, supporting local supply chains and accelerating innovation-led growth.

It is clear that the future of the world’s digital economy is increasingly being shaped in India!"