భారతదేశ పరిపాలనా వ్యవస్థ నిర్మాణంలో విప్లవాత్మక ఘట్టాన్ని సూచించే ప్రారంభోత్సవం
సేవా తీర్థ్‌లో ప్రధానమంత్రి కార్యాలయం, జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్ సచివాలయం
కర్తవ్య భవన్-1, 2లో ఆర్థిక, రక్షణ, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం,

ఫిబ్రవరి 13, 2026న మధ్యాహ్నం సుమారు 1:30 గంటలకు సేవా తీర్థ్ భవన సముదాయం పేరును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆవిష్కరిస్తారు. అనంతరం ప్రధానమంత్రి.. సేవా తీర్థ్, కర్తవ్య భవన్-1, 2లను అధికారికంగా ప్రారంభిస్తారు. సాయంత్రం సుమారు 6 గంటలకు సేవా తీర్థ్ వద్ద బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

ఈ ప్రారంభోత్సవం భారతదేశ పరిపాలనా వ్యవస్థ నిర్మాణంలో విప్లవాత్మక ఘట్టాన్ని సూచించటమే కాక.. ఆధునిక, సమర్థవంతమైన, సులభతరమైన, పౌరులే కేంద్రంగా పాలనా వ్యవస్థను ఏర్పాటు చేయటానికి ప్రధానమంత్రి ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తుంది.

కేంద్ర ప్రభుత్వ కీలక కార్యాలయాలు, మంత్రిత్వ శాఖలు దశాబ్దాల తరబడి సెంట్రల్ విస్టా ప్రాంతంలో పలుచోట్ల పాత, వేర్వేరు భవనాల్లో పనిచేశాయి. కార్యాలయాలు వేర్వేరు చోట్ల ఉండటం వల్ల పరిపాలనా సామర్థ్యం తగ్గటం, సమన్వయ లోపాలు, నిర్వహణ ఖర్చులు పెరగటం, అసౌకర్యవంతమైన పని వాతావరణ వంటి సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా కొత్తగా నిర్మించిన భవన సముదాయాలు.. పరిపాలనా విధులను ఆధునిక, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాయి.

గతంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయం, జాతీయ భద్రతా మండలి సచివాలయం, కేబినెట్ సచివాలయాలు ఇకపై సేవా తీర్థ్‌లో ఉంటాయి.

ఆర్థిక మంత్రిత్వ శాఖ, రక్షణ, కుటుంబ సంక్షేమ, కార్పొరేట్ వ్యవహారాలు, విద్య, సంస్కృతి, న్యాయ, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, వ్యవసాయ, రైతు సంక్షేమ, రసాయనాలు, ఎరువులు, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలతో సహా పలు కీలక మంత్రిత్వ శాఖలు కర్తవ్య భవన్-1, 2లో ఉంటాయి.

ఈ భవన సముదాయాల్లో డిజిటల్ సదుపాయాలున్న కార్యాలయాలు, పౌర సేవా విభాగాలు, కేంద్రీకృత రిసెప్షన్ సౌకర్యాలున్నాయి. ఈ ప్రత్యేక వసతులు ఉద్యోగుల మధ్య సహకారాన్ని, పనితీరులో సామర్థ్యాన్ని పెంపొందించటమే కాక, పారదర్శకమైన పాలన, మెరుగైన పౌర భాగస్వామ్యం, ఉద్యోగుల సంక్షేమానికి తోడ్పడతాయి. 4 స్టార్ గృహ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ఈ భవనాల్లో పునరుత్పాదక ఇంధన వ్యవస్థలు, నీటి సంరక్షణ చర్యలు, వ్యర్థాల నిర్వహణ పరిష్కారాలు, అత్యుత్తమ నిర్మాణ శైలి వంటి పర్యావరణహితమైన వసతులున్నాయి. ఈ చర్యలు పర్యావరణంపై ప్రభావాన్ని గణనీయంగా తగ్గించడమే కాక, పనితీరు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ భవన సముదాయాల్లో స్మార్ట్ యాక్సెస్ కంట్రోల్ సిస్టమ్స్, నిఘా వ్యవస్థలు, అత్యాధునిక అత్యవసర ప్రతిస్పందన మౌలిక సదుపాయాల వంటి సమగ్ర భద్రతా వ్యవస్థలున్నాయి. ఇవి అధికారులు, సందర్శకులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కల్పిస్తాయి.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s maternal mortality drops nearly 80% since 1990: Global study

Media Coverage

India’s maternal mortality drops nearly 80% since 1990: Global study
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 29 మార్చి 2026
March 29, 2026

Citizens Praise PM Modi for The Visionary Shift: Empowering Every Citizen in an Uncertain World