పోలీసు వ్యవస్థ యొక్క బహుళ విధుల ను గురించి మరియుఅంతర్గత భద్రత వ్యవస్థ యొక్క అనేక అంశాల ను గురించి చర్చించడం జరుగుతుంది
క్రొత్త అపరాధ చట్టాల అమలు కు మార్గసూచీ అనే అంశంపై ఈసమావేశం లో చర్చించడం జరుగుతుంది
పోలీసు వ్యవస్థ లో మరియు భద్రత వ్యవస్థ లో భావి కార్యాచరణ ను గురించి ఈ సమావేశం లో చర్చిస్తారు

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2024 వ సంవత్సరం జనవరి 6 వ, 7వ తేదీల లో జయ్‌పుర్ లోని రాజస్థాన్ ఇంటర్‌నేశనల్ సెంటర్ లో జరగనున్న డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ / ఇన్స్‌పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ యొక్క అఖిల భారత సమావేశం 2023 లో పాలుపంచుకోనున్నారు.

 

జనవరి 5 వ తేదీ నాడే ప్రారంభం కానున్న మొత్తం మూడు రోజుల సమావేశం లో సైబర్ క్రైమ్, పోలీసు వ్యవస్థ లో సాంకేతిక విజ్ఞానం, ఉగ్రవాద నిరోధం లో ఎదురవుతున్న సవాళ్ళు, వామపక్ష తీవ్రవాదం, జైళ్ళ సంస్కరణ లు మొదలైన అంశాలు సహా పోలీసు వ్యవస్థ కు మరియు అంతర్గత భద్రత కు సంబంధించిన అనేక అంశాల పైన చర్చించడం జరుగుతుంది. క్రొత్త అపరాధ చట్టాల అమలు కు మార్గసూచీ ని రూపొందించడం పై చర్చోపచర్చలు జరపాలి అనేది ఈ సమావేశం యొక్క మరొక కీలకమైనటువంటి కార్యక్రమం గా ఉండబోతోంది. దీనికి తోడు, ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), డీప్ ఫేక్ తదితర సరిక్రొత్త సాంకేతిక పరిజ్ఞ‌ానాల ల వల్ల ఎదురవుతున్న సవాళ్ళ ను దృష్టి లో పెట్టుకొని పోలీసు వ్యవస్థ కు మరియు భద్రత విభాగానికి రాబోయే కాలం కోసంఅనుసరించదగ్గ కార్యాచరణ సంబంధి రూపురేఖల ను నిర్దేశించడం అనేటటువంటి అంశం పైన కూడాను సమావేశం లో చర్చోపచర్చలు జరుగనున్నాయి. ప్రధాన మంత్రి కి ప్రతి సంవత్సరం లో నివేదించేటటువంటి స్పష్టమైన కార్యాచరణ సంబంధి అంశాల ను గుర్తించడానికి మరియు వాటి విషయం లో పురోతి ని పర్యవేక్షించడానికి ఈ సమావేశం ఒక అవకాశాన్ని అందించనుంది.

 

గుర్తించిన అంశాల విషయం లో జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిల కు చెందిన పోలీసు అధికారులు మరియు నిఘా విభాగం అధికారులు విస్తృత చర్చోపచర్చలు జరిపిన మీదట తుది విడత గా ఈ సమావేశం ఏర్పాటయింది. ప్రతి ఒక్క విభాగం లో రాష్ట్రాల నుండి/కేంద్ర పాలిత ప్రాంతాల నుండి అత్యుత్తమమైన అభ్యాసాల ను ఈ సమావేశం లో నివేదించడం జరుగుతుంది. తద్ద్వారా అత్యుత్తమ అభ్యాసాల ను రాష్ట్రాలు ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రం నేర్చుకొనేందుకు వీలు కలుగుతుంది.

 

ప్రధాన మంత్రి 2014 వ సంవత్సరం మొదలుకొని డిజిపి సమావేశం పట్ల ఎంతో ఆసక్తి ని కనబరచారు. ఇదివరకటి ప్రధానులు ప్రతీకాత్మకం గా ఈ సమావేశాల కు హాజరు కాగా, ఆ పద్ధతి కి భిన్నం గా ప్రస్తుత ప్రధాన మంత్రి సమావేశం లో అన్ని ప్రధాన సదస్సుల లో స్వయం గా పాలుపంచుకొంటున్నారు. సమావేశం దృష్టి కి తీసుకు వచ్చిన అన్ని విషయాల ను ప్రధాన మంత్రి ఓపిక గా ఆలకించడం ఒక్కటే కాకుండా స్వేచ్ఛాయుక్తమైన మరియు లాంఛనప్రాయం కానటువంటి చర్చల ను ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ విధం గా చేయడం వల్ల క్రొత్త క్రొత్త ఆలోచన లు తెర మీద కు వచ్చేందుకు వీలు కలుగుతోంది. అల్పాహార వేళ లో, భోజన వేళ లో మరియు రాత్రిపూట భోజనం వేళలో నిర్దిష్ట అంశాల పైన అరమరికల కు తావు ఉండనటువంటి చర్చలు ఈ సంవత్సరం సమావేశం లో చోటు చేసుకోవాలని కూడా సంకల్పించడమైంది. ఇది పోలీసు విభాగం లో సీనియర్ అధికారుల కు వారి వారి ఆలోచనల ను వెల్లడి చేయడానికి మరియు పోలీసు విధులు, ఇంకా అంతర్గత భద్రతల కు సంబంధించి వారి వారి సిఫారసుల ను సమర్పించడాని కి ఒక అవకాశాన్ని ఇవ్వబోతోంది.

 

ప్రధాన మంత్రి 2014 వ సంవత్సరం మొదలుకొని దేశవ్యాప్తం గా డిజిపి సమావేశాల ను ప్రతి ఏటా నిర్వహించడాన్ని సైతం ప్రోత్సహించారు. ఈ సమావేశాన్ని 2014 వ సంవత్సరం లో గువాహాటీ లో; 2015 లో రణ్ ఆఫ్ కచ్ఛ్ లోని ధోర్‌ డో లో; 2016 లో హైదరాబాద్ లోని నేశనల్ పోలీస్ అకైడమి లో; 2017 లో టేకన్‌పుర్ లోని బిఎస్‌ఎఫ్ అకైడమి లో; 2018 లో కేవడియా లో; 2019 లో పుణె లోని ఐఐఎస్ఇఆర్ లో; 2021 లో లఖ్‌నవూ లోని పోలీసు ప్రధాన కేంద్రం లో; మరి అలాగే 2023 వ సంవత్సరం లో దిల్లీ లోని పూసా లో గల నేశనల్ ఎగ్రికల్చర్ సైన్స్ కాంప్లెక్స్ లో నిర్వహించడం జరిగింది. ఈ సంప్రదాయాని కి కొనసాగింపు గా తాజా సమావేశాన్ని ఈ సంవత్సరం లో జయ్ పుర్ లో నిర్వహించడం జరుగుతున్నది.

 

ఈ సమావేశాల లో కేంద్ర హోం శాఖ మంత్రి, జాతీయ భద్రత విషయాల సలహాదారు, దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి, కేబినెట్ సెక్రట్రి, భారత ప్రభుత్వం లో సీనియర్ అధికారులు, రాష్ట్రాల /కేంద్ర పాలిత ప్రాంతాల డిజిపి లు, కేంద్రీయ సాయుధ పోలీసు బలగాల మరియు కేంద్రీయ పోలీసు సంస్థ ప్రధానాధికారులు, తదితరులు పాలుపంచుకోనున్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi hails India’s ‘Mission Drishti’ launch as ‘world’s first OptoSAR satellite’ enters orbit

Media Coverage

PM Modi hails India’s ‘Mission Drishti’ launch as ‘world’s first OptoSAR satellite’ enters orbit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 మే 2026
May 04, 2026

Green Roads, Smart Tolls, Trillion-Dollar Dreams: How PM Modi's Policies are Supercharging a Modern India