భారత 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వివిధ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు….

   ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ట్వీట్‌పై స్పందిస్తూ... “ప్రధానమంత్రి@AlboMP గారూ.. మీకు ధన్యవాదాలు. అలాగే ఆస్ట్రేలియా దినోత్సవం సందర్భంగా మీతోపాటు స్నేహశీలురైన ఆస్ట్రేలియా ప్రజలందరికీ నా శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు.

   నేపాల్‌ ప్రధానమంత్రి ప్రచండ ట్వీట్‌పై స్పందిస్తూ... “ప్రధానమంత్రి @cmprachanda గారూ.. మీకు కృతజ్ఞతలు. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యావాదాలు!” అని పేర్కొన్నారు.

   భూటాన్‌ ప్రధానమంత్రి ట్వీట్‌పై స్పందిస్తూ... “ప్రధానమంత్రి @PMBhutan డాక్టర్‌ లోతే షేరింగ్‌ గారూ.. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యావాదాలు! మన రెండుదేశాల అభివృద్ధి, శ్రేయస్సు దిశగా మన విశిష్ట భాగస్వామ్యానికి భారత్‌ సదా నిబద్ధతతో ఉంటుంది” అని పేర్కొన్నారు.

   మాల్దీవ్స్‌ అ        ధ్యక్షుడు సొలీహ్‌ ట్వీట్‌పై స్పందిస్తూ... “అధ్యక్షులు @ibusolih గారూ.. మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యావాదాలు!” ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలతో కూడిన భారత-మాల్దీవ్స్‌ భాగస్వామ్యం సుస్థిర పురోగమనం ఎంతో ఆనందదాయకం” అని పేర్కొన్నారు.

   ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నెతన్యాహు ట్వీట్‌పై స్పందిస్తూ... “ప్రధానమంత్రి @netanyahu గారూ.. మా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు ధన్యావాదాలు! మన వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కాగలదని ఆశిస్తున్నాను” అని పేర్కొన్నారు.

   ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్యాన్యుయెల్‌ మాక్రాన్‌ ట్వీట్‌పై స్పందిస్తూ... “నా ప్రియమిత్రులైన అధ్యక్షులు @EmmanuelMacron గారూ.. మా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు కృతజ్ఞతలు. భారత జి-20 అధ్యక్షత, భారత-ఫ్రాన్స్‌ వ్యూహాత్మక భాగస్వామ్య 25వ వార్షికోత్సవం విజయవంతమయ్యే దిశగా మన ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాను. భారత-ఫ్రాన్స్‌ స్నేహబంధం ప్రపంచానికి శ్రేయస్కరం” అని పేర్కొన్నారు.

   మారిషస్‌ ప్రధానమంత్రి కుమార్‌ జుగనాథ్‌ ట్వీట్‌పై స్పందిస్తూ... “ప్రధానమంత్రి PM @KumarJugnauth గారూ.. ధన్యావాదాలు! ఆధునిక గణతంత్రాలుగా మన రెండు దేశాల ప్రగతి భాగస్వామ్యం ప్రజా కేంద్రకంగా ముందుకు సాగుతోంది. మారిషస్‌తో మా ప్రతిష్టాత్మక భాగస్వామ్యం మరింత బలపడాలని ఆకాంక్షిస్తున్నాను” అని పేర్కొన్నారు.

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending

Media Coverage

Centre releases Rs 1.09 lakh crore tax devolution; Uttar Pradesh gets biggest share to accelerate development spending
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Governor of Jharkhand meets Prime Minister
August 03, 2026