ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో సంయుక్త సైనిక కమాండర్ల సదస్సుకు హాజరయ్యారు. “సంసిద్ధ-సముద్ధరిత-సముచిత” సాయుధ బలగాలు ఇతివృత్తంగా  మూడు రోజులపాటు ఈ సమావేశం నిర్వహించబడింది. జాతీయ భద్రత, భవిష్యత్తు కోసం సంయుక్త సైనిక బలగాల దృక్పథం రూపకల్పనసహా వివిధ రకాల అంశాలపై ఈ సందర్భంగా చర్చలు సాగాయి. అదేవిధంగా ‘స్వయం సమృద్ధి’ సాధనసహా సాయుధ బలగాల సన్నద్ధత, రక్షణ పర్యావరణ వ్యవస్థలో పురోగతిని కూడా సమీక్షించారు.

   ఈ సదస్సులో త్రివిధ సాయుధ బలగాల కమాండర్లు, రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ మేరకు ఆర్మీ, నేవీ, వైమానిక దళాల సైనికులు, నావికులు, ఎయిర్‌మెన్‌ తదితర సిబ్బంది మధ్య అనధికారిక పరస్పర సంభాషణ గోష్ఠి కూడా జరిగింది.

ఈ కార్యక్రమంపై ప్రధానమంత్రి ఒక ట్వీట్‌ద్వారా పంపిన సందేశంలో:

   “ఇవాళ ఉదయం భోపాల్‌లో జరిగిన సంయుక్త సాయుధ బలగాల కమాండర్ల సదస్సులో పాల్గొన్నాను. ఇందులో భాగంగా భారత భద్రత వ్యవస్థను పటిష్ఠం చేసే అనేక మార్గాలపై మేం విస్తృతంగా చర్చించాం” అని పేర్కొన్నారు.

 

More details at https://pib.gov.in/PressReleseDetailm.aspx?PRID=1912891

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'

Media Coverage

'BRICS 2026 becomes major Bharat achievement for PM Narendra Modi'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 15 సెప్టెంబర్ 2026
September 15, 2026

A Mandate of Performance: Civic Wins, IPO Surge and Neighbourly Power Reflect Faith in PM Modi’s Leadership