ఈద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఇంధన, పౌర మౌలిక సదుపాయాలపై జరిగిన దాడులను ఖండించిన ప్రధానమంత్రి

బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. బహ్రెయిన్ రాజుకి పండుగ శుభాకాంక్షలు తెలపడంతోపాటు.. ప్రాంతీయ భద్రతా అంశాలపై ఫలప్రదమైన చర్చలు జరిపారు.

బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు, ఆ దేశ ప్రజలకు ఈద్-ఉల్-ఫితర్ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంభాషణలో ఇరువురు నేతలు పశ్చిమ ఆసియా ప్రాంతంలోని ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు. ఇంధన, పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ప్రధాని మోదీ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దాడులు ప్రపంచ ఆహార, ఇంధన, ఎరువుల భద్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని చెప్పారు. అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను కాపాడటం, షిప్పింగ్ మార్గాలను సురక్షితంగా ఉంచాల్సిన  ప్రాముఖ్యత గురించి ఇరువురు చర్చించారు. బహ్రెయిన్‌లోని భారతీయ సమాజ సంక్షేమం కోసం నిరంతరం మద్దతు అందిస్తున్నందుకు  ఆ దేశ రాజుకి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘బహ్రెయిన్ రాజు  హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఫలప్రదమైన చర్చలు జరిపాను. ఈ సందర్భంగా ఆయనకు, బహ్రెయిన్ ప్రజలకు ఈద్-ఉల్-ఫితర్ శుభాకాంక్షలు తెలియజేశాను.

పశ్చిమ ఆసియా ప్రాంతంలోని ప్రస్తుత పరిస్థితులపై మేం చర్చించాం. ఆ ప్రాంతంలోని ఇంధన, పౌర మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించాం. ఇటువంటి చర్యలు ప్రపంచ ఆహార, ఇంధన, ఎరువుల భద్రతపై చూపే ప్రతికూల ప్రభావంపై చర్చించాం.

అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛను కాపాడటం, షిప్పింగ్ మార్గాలను సురక్షితంగా ఉంచాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా స్పష్టం చేశాం.

బహ్రెయిన్‌లోని భారతీయ సమాజ సంక్షేమం కోసం నిరంతర మద్దతు అందిస్తున్నందుకు ఆదేశ రాజుకి ధన్యవాదాలు తెలియజేశాను.’’

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi hails India’s ‘Mission Drishti’ launch as ‘world’s first OptoSAR satellite’ enters orbit

Media Coverage

PM Modi hails India’s ‘Mission Drishti’ launch as ‘world’s first OptoSAR satellite’ enters orbit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 మే 2026
May 04, 2026

Green Roads, Smart Tolls, Trillion-Dollar Dreams: How PM Modi's Policies are Supercharging a Modern India