పార్లమెంట్ ప్రత్యేక సమావేశం ఈ రోజు మొదలవుతున్న సందర్భంలో, దేశం మహిళలకు సాధికారత కల్పించే దిశగా చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోనుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. తల్లులనూ, అక్కచెల్లెళ్లనూ గౌరవిస్తే దేశాన్ని గౌరవించినట్లేనని ఆయన తెలిపారు. ఈ భావనతో, ఈ మార్గంలో దేశం దృఢసంకల్పంతో ముందుకు కదులుతోందని ప్రధాని అన్నారు.
సంస్కృత భాషలో ఉన్న ఓ సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి ఇలా పంచుకున్నారు:
‘‘వ్యుచ్ఛన్తీ హి రశ్మీభిర్విశ్వమాభాసి రోచనమ్
తా త్వాముషర్వసూయవో గీర్భి: కణ్వా అహుషత్’’
మహిళ తన జ్ఞాన కాంతితో అజ్ఞాన చీకటిని పారదోలి ప్రపంచాన్ని వెలుగులతో నింపుతుంది. ఈ కారణంగా, సమృద్ధిని, సద్గుణాలను అలవరుచుకోవాలని ఆకాంక్షించే వారు మహిళలను సదా గౌరవిస్తారు, వారి పట్ల ఆదరాన్ని కనబరుస్తారని ఈ సంస్కృత సూక్తి మనకు చెబుతోంది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘ఈ రోజు నుంచి మొదలవుతున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశంలో మహిళలకు సాధికారతను అందించడానికి మన దేశం చరిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకోబోతోంది. మన తల్లులనూ, అక్కచెల్లెళ్లనూ గౌరవించడం దేశాన్ని గౌరవించుకోవడమే అవుతుంది. ఈ భావనతో, మనం ఈ మార్గంలో దృఢనిశ్చయులమై ముందుకు సాగుతున్నాం.
‘‘వ్యుచ్ఛన్తి హి రశ్మీభిర్విశ్వమాభాసి రోచనమ్
తా త్వాముషర్వసూయవో గీర్భి: కణ్వా అహుషత్’’ అని పేర్కొన్నారు.
आज से शुरू हो रही संसद की विशेष बैठक में हमारा देश नारी सशक्तिकरण के लिए ऐतिहासिक कदम उठाने जा रहा है। हमारी माताओं-बहनों का सम्मान राष्ट्र का सम्मान है और यही भावना लेकर हम इस दिशा में दृढ़ता से आगे बढ़ रहे हैं।
— Narendra Modi (@narendramodi) April 16, 2026
व्युच्छन्ती हि रश्मिभिर्विश्वमाभासि रोचनम्।
ता त्वामुषर्वसूयवो… pic.twitter.com/8KWT1WLSje


