దేశ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని పరిరక్షించడంలో భారత సైనిక బలగాలు ప్రదర్శించే ధైర్యం, పరాక్రమం ప్రతి పౌరునికీ గర్వకారణమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. భారతమాత కోసం సర్వస్వం అర్పించే వారి త్యాగ నిరతి అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు.
ప్రధానమంత్రి పంచుకున్న సంస్కృత శ్లోకం-
‘‘స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి|
ధర్మ్యాద్ధి యుద్ధాఛ్చ్రేయో న్యత్‌క్షత్రియస్య న విద్యతే||’’
ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని గుర్తించినప్పుడు అతడి మనసులో ఎలాంటి సంకోచమూ, భయమూ ఉండకూడదు. ఎందుకంటే, న్యాయపీఠంపై ధర్మాన్నీ, గౌరవాన్నీ కాపాడటానికి చేసే పోరాటమే ఒక యోధుని స్వీయ క్షేమానికి అత్యంత శ్రేష్ఠమైన, గొప్పదైన మార్గమని ఈ శ్లోకం తెలియజేస్తుంది.
देश के मान-सम्मान की रक्षा के लिए भारतीय सेना का शौर्य और पराक्रम सभी देशवासियों को गौरवान्वित करता है। मां भारती के लिए मर-मिटने का उनका जज्बा हर किसी को प्रेरित करने वाला है।
— Narendra Modi (@narendramodi) May 8, 2026
स्वधर्ममपि चावेक्ष्य न विकम्पितुमर्हसि |
धर्म्याद्धि युद्धाच्छ्रेयोऽन्यत्क्षत्रियस्य न विद्यते || pic.twitter.com/FNuJ4tXyvX


