కఠిన పరిస్థితుల్లో శాంతంగా ఉండడానికీ, వివేకాన్ని ఉపయోగించి ఆలోచించడానికీ ప్రాధాన్యాన్ని ఇవ్వాలని సూచిస్తున్న సంస్కృత భాషా సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.
భారత్ యువత... సాధించాలని సంకల్పించునకున్న ప్రతిదీ చేజిక్కించుకొంటారని ప్రధాని అన్నారు. దేశం సత్వర అభివృద్ధి మార్గంలో ముందుకు సాగిపోయేటట్లు చేస్తోంది మన యువత శక్తేనని శ్రీ మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘దేశ యువత మనసులో ఏదైనా సాధించాలని తీర్మానించుకొంటే, దానిని చేసి చూపిస్తారు. మన దేశం ప్రస్తుతం శర వేగంగా అభివృద్ధి మార్గంలో దూసుకుపోతోందంటే అందుకు మన యువశక్తి సామర్థ్యమే కారణం.
వ్యసనే వార్థకృచ్ఛ్రే వా భయే వా జీవనాన్తకే
విమృశన్ వై స్వయా బుద్ధ్యా ధృతిమాన్ నావసీదతి.
కష్టం వచ్చినప్పుడూ, ఆర్థికంగా సంకట స్థితి తలెత్తినప్పుడూ, లేదా ప్రాణాపాయకర స్థితి ఎదురైనప్పుడూ శాంతంగా ఉండి వివేకంతో ఆలోచించే వ్యక్తి ఎన్నటికీ విఫలమయ్యే ప్రసక్తే ఉండదు. కఠిన పరిస్థితుల్లో, నెమ్మదిగా ఉంటూ అన్నీ ఆలోచించి తీసుకొనే నిర్ణయాలు ఆ వ్యక్తిని దు:ఖం నుంచీ, హానీ నుంచీ కాపాడుతాయి’’ అని పేర్కొన్నారు.
देश के युवा जो ठान लेते हैं, उसे करके दिखाते हैं। यह हमारी युवाशक्ति का ही सामर्थ्य है कि हमारा राष्ट्र आज तेज गति से विकास के पथ पर अग्रसर है।
— Narendra Modi (@narendramodi) April 10, 2026
व्यसने वाऽर्थकृच्छ्रे वा भये वा जीवनान्तके।
विमृशन् वै स्वया बुद्ध्या धृतिमान् नावसीदति॥ pic.twitter.com/0l87CoFHHz


