ఎక్స్ లన్సీస్,

మీరు మీ యొక్క ఆలోచనల ను వెల్లడి చేసినందుకు మరియు మీ యొక్క కాలాన్ని వెచ్చించినందుకు మరొక్క సారి మీకు ధన్యవాదాలు.  మనం ఈ రోజు న నిర్మాణాత్మకమైనటువంటి మరియు చాలా ఫలప్రదమైనటువంటి చర్చ ను జరిపాము.

          ఈ తరహా సవాళ్ల ను పరిష్కరించడం కోసం ఒక సమష్టి వ్యూహాన్ని రూపొందించుకోవడం కీలకం అనే సంగతి ని మనం అందరమూ అంగీకరిస్తాము.

          మరి, మనం సహకారపూర్వకమైనటువంటి పరిష్కారాల ను అన్వేషించేందుకు సమ్మతి ని వ్యక్తం చేశాము. మనం సంబంధిత జ్ఞానాన్ని, సర్వోత్తమమైనటువంటి అభ్యసాల ను, సామర్థ్యాల ను మరియు వనరుల ను సాధ్యమైనటువంటి అన్ని విధాలు గాను ఒక దేశానికి మరొక దేశం పరస్పర రీతి లో సహకరించుకొందాము.

         కొన్ని భాగస్వామ్య దేశాలు మందులు మరియు సామగ్రి సహా నిర్దిష్టమైనటువంటి అభ్యర్థనల ను సమావేశం లో ప్రస్తావించాయి.  ఈ అంశాల ను నా యొక్క జట్టు శ్రద్ధ గా పరిగణన లోకి తీసుకొన్నది.  మా ఇరుగు పొరుగు దేశాల కోసం మేము మా యొక్క సర్వశ్రేష్ఠ ప్రయత్నాల ను తప్పక చేస్తాము అని మీకు నేను భరోసా ను ఇస్తున్నాను.

         ఒక సమష్టి వ్యూహాన్ని సిద్ధం చేయడం కోసం భాగస్వామ్య స్ఫూర్తి తో, కలసికట్టుగా కృషి చేయడం కోసం సన్నిహిత సమన్వయం నెరపాల్సింది గా మన అధికార గణాన్ని మనం కోరుదాము.

మనలో ప్రతి ఒక్క దేశం నుండి నోడల్ ఎక్స్ పర్ట్ స్ ను మనం గుర్తించాలి; దీని ద్వారా వారు నేటి మన చర్చల కు తరువాయి గా ఇప్పటి నుండి ఒక వారం రోజుల లోపల ఇదే విధం గా ఓ వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించేందుకు వీలు ఉంటుంది.

ఎక్స్ లన్సీస్,

ఈ పోరు ను మనం కలసి జరపవలసివుంది.  మరి మనం ఈ సమరం లో తప్పక గెలవాలి కూడాను.

మన ఇరుగు పొరుగు దేశాల సహకారం ప్రపంచాని కే ఒక ఆదర్శప్రాయం గా నిలవాలి.

మన దేశాల పౌరులు అందరు పండంటి ఆరోగ్యం తో ఉండాలి అని, అలాగే ఈ సాంక్రామిక వ్యాధి ని జయించడం కోసం మనం అంతా ఏకమై చేసేటటువంటి ప్రయత్నాలు ఫలప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ఇక ఇంతటి తో నా యొక్క ఉపన్యాసాని కి నన్ను ముగింపు ను పలకనీయండి.

మీకు ఇవే ధన్యవాదాలు.

అనేకానేక ధన్యవాదాలు.

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
PM Modi holds 'productive' exchanges with G7 leaders on key global issues

Media Coverage

PM Modi holds 'productive' exchanges with G7 leaders on key global issues
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 18 జూన్ 2025
June 18, 2025

Citizens Appreciate PM Modi’s Reforms Driving Economic Surge