మహాత్మ గాంధీ వర్థంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేందత్ర మోదీ మహాత్మ గాంధీ కి శ్రద్ధాంజలి సమర్పించారు. ఈ రోజు న, అమర వీరుల దినం కూడా కావడం తో, సాహసపూర్వకం గా మన దేశాన్ని రక్షించిన మహనీయులు అందరికీ ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి ఘటించారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘బాపు ను ఆయన వర్ధంతి నాడు స్మరించుకొంటున్నాను. ఆయన ఉత్తమమైనటువంటి ఆశయాల కు లోకప్రియత్వాన్ని పెంపొందింపచేయడం కోసం మనం అందరం పాటుపడాలి.
ఈ రోజు న, అమర వీరుల దినం నాడు, ధైర్యాన్ని మరియు సాహసాన్ని ప్రదర్శించడం ద్వారా మన దేశాన్ని రక్షించినటువంటి మహానుభావులు అందరికీ నేను ఇదే శ్రద్ధాంజలి ని ఘటిస్తున్నాను. వారు చేసిన సేవ ను, వారి యొక్క శౌర్యాన్ని ఎప్పటికీ స్మరించుకొంటూ ఉంటాం.’’ అని పేర్కొన్నారు.
Remembering Bapu on his Punya Tithi. It is our collective endeavour to further popularise his noble ideals.
— Narendra Modi (@narendramodi) January 30, 2022
Today, on Martyrs’ Day, paying homage to all the greats who courageously safeguarded our nation. Their service and bravery will always be remembered.


