నవరాత్రుల ఆధ్యాత్మిక ప్రాముఖ్యాన్ని గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు తన అభిప్రాయాలను పంచుకున్నారు. అమ్మవారి పట్ల భక్తితో అపార శక్తి, బలం లభిస్తాయని ఆయన పేర్కొన్నారు.
అమ్మవారి పట్ల భక్తిలో అపారమైన శక్తి ఉందనీ, దేవి మాత ఆరాధన భక్తుల హృదయాలను సానుకూల శక్తితో నింపుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శ్రీ మోదీ అమ్మవారి భక్తి గీతాన్నీ పంచుకున్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
అమ్మవారి పట్ల భక్తిలో అపారమైన శక్తి ఉంది. అమ్మవారిని పూజించడం ద్వారా భక్తుల మనస్సులు సానుకూల శక్తితో నిండిపోతాయి.
माता की भक्ति में विराट शक्ति है। देवी मां की वंदना से श्रद्धालुओं का मन सकारात्मक ऊर्जा से भर जाता है।https://t.co/79ZDpS0dho
— Narendra Modi (@narendramodi) March 22, 2026


