ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇతరుల సేవకు తమను తాము అంకితం చేసుకుని, ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలనే జాతీయ నిబద్ధతను శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. ఆరోగ్య సేవా వ్యవస్థలను బలోపేతం చేయడానికి, ప్రతి వ్యక్తి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడానికి సమష్టి ప్రయత్నాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.
ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారు. శారీరక దారుఢ్యాన్ని కాపాడుకొనేందుకు సాధ్యమైనంత మేర ప్రయత్నించాలని అందరికీ సూచించారు. ఈ నేపథ్యంలో శారీరక వ్యాయామ ప్రయోజనాలను తెలిపే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి చేసిన పోస్టు:
‘‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇతరులకు సేవ చేయడానికి తమను తాము అంకితం చేసుకుని, ఆరోగ్యకరమైన ప్రపంచం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలు. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం పట్ల మా చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తున్నాం. ఆరోగ్య సేవా వ్యవస్థలను బలోపేతం చేయడానికి, ప్రతి ఒక్కరి శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వడానికి మన సమష్టి ప్రయత్నాలను కొనసాగిద్దాం.’’
‘‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. ఆరోగ్యంగా ఉండేందుకు అన్ని విధాల ప్రయత్నించాలని అందరినీ కోరుతున్నాను.
లాఘవం కర్మసామర్థ్యం దీప్తోగ్నిర్మేదసః క్షయః।
విభిక్తఘనగాతృత్వం వ్యాయామాదుపజాయతే।।’’
వ్యాయామం వల్ల పనిచేసే సామర్థ్యం పెరుగుతుంది. జీర్ణశక్తి మెరుగవుతుంది. ఊబకాయం తగ్గుతుంది. శరీరం దృఢంగానూ, చక్కని రూపురేఖలతోనూ ఉంటుంది.
On World Health Day, we express our gratitude to all those who dedicate themselves tirelessly to the service of others and work towards a healthier planet. We also reaffirm our commitment to building a healthier society. Let us all keep working together to strengthen healthcare…
— Narendra Modi (@narendramodi) April 7, 2026
विश्व स्वास्थ्य दिवस पर मैं सभी देशवासियों के उत्तम स्वास्थ्य की कामना करता हूं। मेरा आग्रह है कि खुद को स्वस्थ रखने के लिए हरसंभव प्रयास जरूर करें।
— Narendra Modi (@narendramodi) April 7, 2026
लाघवं कर्मसामर्थ्यं दीप्तोऽग्निर्मेदसः क्षयः।
विभक्तघनगात्रत्वं व्यायामादुपजायते॥ pic.twitter.com/EEH6gNbodz


