మాతా త్రిపుర సుందరి ఆలయ ప్రాంగణంలోని పనులను సమీక్షించిన ప్రధానమంత్రి

త్రిపురలోని ఉదయ్ పూర్ లో మాతా త్రిపుర సుందరి ఆలయంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థన చేశారు. "భారతీయులంతా ఆరోగ్యంగానూ, సుభిక్షంగానూ ఉండాలని కోరుకున్నాను" అని శ్రీ మోదీ తెలిపారు.

 

మాతా త్రిపుర సుందరీ ఆలయ ప్రాంగణంలోని పనులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమీక్షించారు. ఈ ఆలయాన్ని సందర్శించడంతోపాటు , త్రిపుర రాష్ట్రంలోని ప్రకృతి అందాలను చూసేందుకు వీలుగా దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

 

‘‘ఎక్స్’’ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"నవరాత్రి మొదటి రోజు, దుర్గాదేవిని పూజించే సందర్భంలో త్రిపురలోని ఉదయ్ పూర్ లో ఉన్న మాతా త్రిపుర సుందరి ఆలయంలో ప్రార్థన చేసే అవకాశం లభించింది. భారతీయులందరి క్షేమం, సుఖశాంతుల కోసం అమ్మవారిని ప్రార్థించాను.”

 

"మాతా త్రిపుర సుందరి ఆలయ ప్రాంగణంలోని పనులను సమీక్షించాను. అధిక సంఖ్యలో భక్తులు, పర్యాటకులు త్రిపురను సందర్శించాలనీ, ఆలయంలో పూజలు చేయడంతోపాటు, త్రిపుర ప్రాంత అందాలను చూసేందుకు ప్రాధాన్యతనిస్తున్నాం."

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
VP Radhakrishnan in Ladakh, PM Modi in Kolkata as India marks Yoga Day

Media Coverage

VP Radhakrishnan in Ladakh, PM Modi in Kolkata as India marks Yoga Day
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 19 జూన్ 2026
June 19, 2026

Appreciation for India’s Domestic Growth and Rising Global Influence under PM Modi’s Leadership