మహిళల స్వయం ఉపాధి దిశ గా చేస్తున్న కృషి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
ముంబయి లోని చూనాభట్టీ లో గల సోమైయా మైదాన్ లో ముంబయి కి చెందిన 27,000 మంది మహిళల కు బిఎమ్ సి పథకం ద్వారా స్వయం ఉపాధి కోసం కుట్టు మిషన్, చక్కీ, మసాలా తయారీ యంత్రం మొదలైన వివిధ ఉపకరణాలు, యంత్రాల ను పంపిణీ చేయడం వల్ల వారికి సాధికారత లభించిందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్ ణవీస్ ఒక ట్వీట్ లో తెలియ జేశారు.
ఉప ముఖ్యమంత్రి ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ,
‘‘మహిళా సాధికారత కు మరింత కృషి చేయడం అభినందనీయం’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Commendable effort to further women empowerment. https://t.co/Z9vKfQHPpn
— Narendra Modi (@narendramodi) May 16, 2023


