మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ఘటించారు. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారు ఒక మార్గదర్శకప్రాయమైనటువంటి ఆలోచనపరుడు, అంతేకాదు మేధావి కూడాను, మరి స్వాతంత్య్ర పోరాటం లో ఆయన పోషించిన పాత్ర ప్రేరణ ను కలిగించేటటువంటిది అని ప్రధాన మంత్రి అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘‘మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. మార్గదర్శకప్రాయం అయినటువంటి ఆలోచనపరుడు, మేధావి అయిన మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ స్వాతంత్య్ర పోరాటం లో పోషించిన పాత్ర ప్రేరణదాయకం. విద్య రంగం అంటే ఆయన కు మక్కువ. సమాజం లో సోదర భావాన్ని పెంపొందించడం కోసం ఆయన కృషి చేశారు.’’ అని పేర్కొన్నారు.
Tributes to Maulana Abul Kalam Azad on his Jayanti. A pathbreaking thinker and intellectual, his role in the freedom struggle is inspiring. He was passionate about the education sector and worked to further brotherhood in society.
— Narendra Modi (@narendramodi) November 11, 2021


