పంజాబ్ కేసరి లాలా లాజ్‌పత్ రాయ్ జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. తల్లి భారతి బానిసత్వ సంకెళ్లు తెంచివేయడానికి ఆయన తన సర్వస్వాన్నీ ధారపోశారని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన జీవితం దేశంలో ప్రతి తరానికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘మాతృభూమి అమర సంతానం పంజాబ్ కేసరి లాలా లాజ్‌పత్ రాయ్‌కి.. ఆయన జయంతి సందర్భంగా శ్రద్ధాంజలి. తల్లి భారతి బానిసత్వ సంకెళ్లను తెంచివేయడానికి ఆయన తన సర్వస్వాన్నీ అర్పించారు. ఆయన త్యాగపూరిత జీవితం దేశంలో ప్రతి ఒక్క తరానికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది’’ అని పేర్కొన్నారు.
मातृभूमि की अमर संतान पंजाब केसरी लाला लाजपत राय को उनकी जयंती पर आदरपूर्ण श्रद्धांजलि। मां भारती को गुलामी की बेड़ियों से मुक्त कराने के लिए उन्होंने अपना सर्वस्व अर्पित कर दिया। उनका बलिदानी जीवन देश की हर पीढ़ी के लिए प्रेरणास्रोत बना रहेगा। pic.twitter.com/QGua6VZB1t
— Narendra Modi (@narendramodi) January 28, 2026


