షేర్ చేయండి
 
Comments

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టోక్యో లో ఈ రోజు న ఇండో-పసి ఇకానామిక్ ఫ్రేమ్ వర్క్ ఫార్ ప్రాస్ పెరిటీ (ఐపిఇఫ్) ని ఏర్పాటు చేయడాని కి సంబంధించిన చర్చల ను ప్రారంభించేందుకు నిర్వహించిన ఒక కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. ఈ కార్యక్రమం లో యుఎస్ఎ అధ్య‌క్షుడు శ్రీ‌ జోసెఫ్ ఆర్. బైడెన్, జపాన్ ప్రధాని శ్రీ కిశిదా ఫుమియో కూడా పాల్గొన్నారు. వారితో పాటు ఇతర భాగస్వామ్య దేశాలు అయినటువంటి ఆస్ట్రేలియా, బ్రునెయి, ఇండోనేశియా, కొరియా గణతంత్రం, మలేశియా, న్యూజీలేండ్, ఫిలీపీన్స్, సింగపూర్, థాయీలేండ్ ఇంకా వియత్ నామ్ ల నేతలు కూడాను వర్చువల్ మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.
ఐపిఇఎఫ్ కు సంబంధించినటువంటి కీలకమైన అంశాల ను గురించి ప్రముఖం గా ప్రస్తావించే ఒక సంయుక్త ప్రకటన ను జారీ చేయడం జరిగింది.
ఇండో-పసిఫిక్ రీజియన్ లో ప్రతిఘాతుకత్వాన్ని, స్థిరత్వాన్ని, సమగ్రత ను, ఆర్థిక వృద్ధి ని, నిష్పాక్షికత్వాన్ని మరియు ప్రతిస్పర్ధాత్మకత ను పెంపొందింపచేసే ఉద్దేశ్యం తో ప్రాతినిధ్య దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని బలపరచాలి అనేది ఐపిఇఎఫ్ కోరుకొంటోంది.

ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఐపిఇఎఫ్ తాలూకు ప్రకటన ఇండో-పేసిఫిక్ రీజియన్ ను ప్రపంచ ఆర్థిక ప్రగతి కి చోదక శక్తి గా తీర్చిదిద్దడాని కి లక్షించినటువంటి ఒక సామూహిక ఆకాంక్ష యొక్క ప్రకటన అని పేర్కొన్నారు. భారతదేశం ఇండో-పసిఫిక్ రీజియన్ లో చారిత్రికం గా వ్యాపారపరమైన రాక పోకల కు ఒక కేంద్రం గా ఉండింది. మరి గుజరాత్ లోని లోథల్ లో ప్రపంచం లో కెల్లా అత్యంత పాతది అయినటువంటి వాణిజ్య ప్రధానమైన ఓడరేవు నెలకొంది. ఇండో-పసిఫిక్ ప్రాంతం లో ఎదురయ్యే ఆర్థిక సవాళ్ళ కు తట్టుకొని నిలవడం కోసం ఉమ్మడి మరియు సృజ‌నాత్మక పరిష్కారాల ను వెదకాలని ప్రధాన మంత్రి పిలుపునిచ్చారు.
అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి మరియు ఆటు పోటుల కు తట్టుకొని నిలువగలిగేటటువంటి ఐపిఇఎఫ్ కోసం అన్ని ఇండో-పసిఫిక్ దేశాల తో కలసి పని చేయాలని భారతదేశం కంకణం కట్టుకొందనే అభిప్రాయాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ఐఇపిఎఫ్ ప్రతిఘాతుకత్వం తో కూడిన సరఫరా వ్యవస్థ కు 3 ‘టి’ ల (3 T’s) పునాది అవసరం అని ఆయన నొక్కి చెప్పారు. ట్రస్ట్ (విశ్వాసం), ట్రాన్స్ పరెన్సీ (పారదర్శకత్వం) మరియు టైమ్ లీ నెస్ (సమయబద్ధత) అనేవే ఆ మూడు ‘టి’ లు అని వివరించారు.

ఒక స్వతంత్రంమైనటువంటి, తెరచి ఉంచినటువంటి, అన్ని వర్గాల కు స్థానం ఉండేటటువంటి ఇండో-పసిఫిక్ ప్రాంతం భారతదేశం యొక్క ఆకాంక్ష గా ఉంది. మరి ఇతర భాగస్వామ్య దేశాల మధ్య ఆర్థిక సహకారాన్ని గాఢతరం గా మలచడం కోసం నిరంతర వృద్ధి , శాంతి మరియు సమృద్ధి కీలకం అని భారతదేశం విశ్వసిస్తోంది. ఐపిఇఎఫ్ లో భాగం గా భాగస్వామ్య దేశాల కు సహకరించడాని కి ఈ ప్రాంతం లో ప్రాంతీయ, ఆర్థిక సంధానం, ఏకీకరణ మరియు వ్యాపారం, ఇంకా పెట్టుబడుల కు ప్రోత్సాహాన్ని ఇచ్చే దిశ లో కృషి చేయాలని అభిలషిస్తోంది.
ఐపిఇఎఫ్ ను ఏర్పాటు చేయడం కోసం ఈ రోజు న మొదలైన ప్రక్రియ తో పాటు గా భాగస్వామ్య దేశాల ఆర్థిక సహకారాన్ని బలపరచుకోవడం మరియు ఉమ్మడి లక్ష్యాల ను సాధించే విషక్ష్ లో ప్రత్యేక దృష్టి సారిస్తూ, చర్చల ను మొదలు పెట్టడం జరుగుతుంది.

Explore More
76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగ పాఠం
India's forex reserves rise $12.8 billion to 6-week high of $572.8 billion

Media Coverage

India's forex reserves rise $12.8 billion to 6-week high of $572.8 billion
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM congratulates Saweety Boora for winning the Gold Medal in Women's Boxing World Championships
March 25, 2023
షేర్ చేయండి
 
Comments

The Prime Minister, Shri Narendra Modi has congratulated Boxer, Saweety Boora for winning the Gold Medal in Women's Boxing World Championships.

The Prime Minister tweeted;

"Exceptional performance by @saweetyboora! Proud of her for winning the Gold Medal in Women's Boxing World Championships. Her success will inspire many upcoming athletes."