మదురైలోని తిరుప్పరన్‌కుండ్రమ్‌లో గల అరుళ్‌మిగు సుబ్రమణ్యస్వామి ఆలయాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు దర్శించి, పూజలు చేశారు.

ఆలయాన్ని ప్రధానమంత్రి సందర్శించిన సందర్భంగా పౌరులకు శాంతి, సమృద్ధి, క్షేమం కోరుకుంటూ ఆశీర్వాదాలను అందించాల్సిందిగా వేడుకున్నారు. భగవాన్ మురుగన్ మనకు శాంతినీ, ధైర్యాన్ని, జ్ఞానాన్నీ ప్రసాదిస్తూ మార్గదర్శకత్వాన్ని అందిస్తూనే ఉంటారన్న ఆశాభావాన్ని ప్రధానమంత్రి వ్యక్తం చేశారు.

‘‘వెట్రివేల్ మురుగనుక్కు అరోగరా’’ అంటూ ప్రధానమంత్రి ప్రార్థించారు. ఆయన తన మనోభావాలను ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్నిపొందుపరుస్తూ:
‘‘వెట్రివేల్ మురుగనుక్కు అరోగరా.
మదురైలోని తిరుప్పరన్‌కుండ్రమ్‌లో గల అరుళ్‌మిగు సుబ్రమణ్యస్వామి ఆలయంలో పూజలు చేశాను.

శాంతి, సమృద్ధులతో పాటు అందరి క్షేమం కోరి ఆశీర్వాదాలు అందించాల్సిందిగా వేడుకున్నాను. భగవాన్ మురుగన్ ఎల్ల వేళలా మనకు శాంతినీ, ధైర్యాన్ని, జ్ఞానాన్నీ ప్రసాదించడంతో పాటు, మార్గదర్శకత్వం వహించాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
Vetrivel Muruganukku Arogara!
— Narendra Modi (@narendramodi) March 1, 2026
Prayed at the Arulmigu Subramaniyaswamy Temple, Thirupparankundram, Madurai.
Sought blessings for peace, prosperity and the well-being of all. May Lord Murugan always guide us with strength, courage and wisdom. pic.twitter.com/RjNVZSXgKB


