ప్రగతి మైదాన్ లో న్యూ ఎగ్జిబిశన్ కాంప్లెక్స్ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించారు
‘‘ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం తో, తరువాతి 25 సంవత్సరాల భారతదేశాని కి పునాది ని వేయడం జరుగుతోంది’’
‘‘భారతదేశ ప్రజలు, భారతదేశ చరిత్ర, భారతదేశ వ్యాపారం, భారతదేశ తయారీదారులు, భారతదేశ రైతులు గతి శక్తి ఉద్యమాని కి కేంద్ర స్థానం లో ఉన్నారు’’
‘‘ప్రాజెక్టుల ను సకాలం లో పూర్తి చేసే పని సంస్కృతి ని మేం అభివృద్ధి పరచాం అది మాత్రమే కాక, ప్రాజెక్టుల ను అనుకొన్న కాలాని కంటే ముందుగానే సమాప్తి చేసే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి’’
‘‘ప్రభుత్వం అంతా పాలుపంచుకోవాలి అనే వైఖరి ద్వారా, ప్రభుత్వం యొక్క సమష్టి శక్తి ని ఈ పథకాల ను సాకారం చేయడానికై మళ్ళించడం జరుగుతోంది’’
‘‘సంపూర్ణ పాలన తాలూకు ఒక విస్తరణే గతి శక్తి’’

‘పిఎమ్ గతి శక్తి - నేశనల్ మాస్టర్ ప్లాన్ ఫార్ మల్టీ-మాడల్ కనెక్టివిటీ’ ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న ఇక్కడ ప్రారంభించారు.  ప్రగతి మైదాన్ లో న్యూ ఎగ్జిబిశన్ కాంప్లెక్స్ ను కూడా ఆయన ప్రారంభించారు.  ఈ కార్యక్రమం లో కేంద్ర మంత్రులు శ్రీ నితిన్ గడ్ కరీ, శ్రీ పీయూష్ గోయల్, శ్రీ హర్ దీప్ సింహ్ పురీ, శ్రీ సర్బానంద సొణొవాల్, శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, ఇంకా శ్రీ అశ్విని వైష్ణవ్, శ్రీ ఆర్.కె. సింహ్ లతో పాటు ముఖ్యమంత్రులు, లెఫ్టెనంట్ గవర్నర్ లు, రాష్ట్రాల మంత్రులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా పాలుపంచుకొన్నారు.  పారిశ్రామిక రంగం నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్ మన్ శ్రీ కుమార్ మంగళం బిర్ లా,  ట్రాక్టర్స్ ఎండ్ ఫార్మ్ ఇక్విప్ మెంట్స్ సిఎమ్ డి మల్లిక శ్రీనివాసన్ గారు, సిఐఐ ప్రెసిడెంట్ మరియు టాటా స్టీల్ కు సిఇఒ, ఎండి అయిన శ్రీ నరేంద్రన్, రివిగో సహ వ్యవస్థాపకుడు శ్రీ దీపక్ గర్గ్ లు ఈ సందర్భం లో వారి వారి ఆలోచనల ను వెల్లడించారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, శక్తి ని ఆరాధించే మంగళప్రదం అయినటువంటి దినం అష్టమి రోజు, మరి దేశ ప్రగతి యొక్క వేగం సైతం సరికొత్త శక్తి ని అందుకొంటోందన్నారు.  ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం ద్వారా తరువాతి 25 సంవత్సరాల కు భారతదేశ పునాది ని ఈ రోజు న వేయడం జరుగుతోంది అని ఆయన అన్నారు.  ‘పిఎమ్ గతి శక్తి నేశనల్ మాస్టర్ ప్లాన్’ భారతదేశం యొక్క విశ్వాసాన్ని ఆత్మనిర్భరత తాలూకు ప్రతిజ్ఞ ను స్వీకరించేటట్లు చేస్తుందని ఆయన అన్నారు.  ‘‘ఈ మాస్టర్ ప్లాన్ 21వ శతాబ్ది భారతదేశాని కి ఉత్తేజాన్ని (గతి శక్తి ని) అందిస్తుంది’’  అని ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం లోని ప్రజలు, భారతదేశం లోని పరిశ్రమలు, భారతదేశం లోని వ్యాపారం, భారతదేశం తయారీదారులు, భారతదేశం రైతులు గొప్ప ఉద్యమం అయినటువంటి గతి శక్తి కి కేంద్ర స్థానం లో ఉన్నారు అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.  ఇది 21వ శతాబ్ది కి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి దేశం లోని ప్రస్తుత తరానికి, భావి తరాల కు కొత్త ఉత్సాహాన్ని అందిస్తుంది.  దానితో పాటు, వారి మార్గం లో ఎదురయ్యే అడ్డంకుల ను ఇది తొలగిస్తుంది కూడాను అని ఆయన అన్నారు.

 

‘పనులు జరుగుతున్నాయి’ అనే సంకేతం కాలక్రమం లో విశ్వాస లోపాని కి ఒక ప్రతీక గా మారిపోయింది అని ప్రధాన మంత్రి అన్నారు.  ప్రగతి కి  వేగం, తహతహ లతో పాటు ఉమ్మడి ప్రయాస లు అవసరమవుతాయి అని ఆయన అన్నారు.  ఈ కాలపు 21వ శతాబ్డి భారతదేశం పాత వ్యవస్థల ను, పాత అభ్యాసాల ను వదలివేస్తోంది అని ఆయన అన్నారు.

‘ప్రగతి కోసం పని

ప్రగతి కోసం సంపద

ప్రగతి కోసం ప్రణాళిక

ప్రగతికే ప్రాధాన్యం-

ఇదే ఈ నాటి మంత్రం గా ఉంది’ అని ఆయన అన్నారు.

 ‘‘మేం ప్రాజెక్టుల ను నిర్దేశిత సమయ సీమ కు లోబడి పూర్తి చేసే ఒక పని సంస్కృతి ని అభివృద్ధి చేయడం ఒక్కటే కాకుండా, ప్రస్తుతం ప్రాజెక్టుల ను కాలాని కంటే ముందుగానే సమాప్తి చేయడం కోసం కృషి జరుగుతున్నది’’ అని కూడా ఆయన అన్నారు.

మౌలిక సదుపాయాల కల్పన మన దేశం లో చాలా రాజకీయ పక్షాల కు ఒక ప్రాథమ్యం గా ఉండలేకపోయింది అంటూ ప్రధాన మంత్రి విచారాన్ని వ్యక్తం చేశారు.  ఇది వారి ఎన్నికల వాగ్దాన పత్రం లో అయినా చోటు చేసుకోవడం లేదు.  ప్రస్తుతం పరిస్థితి ఎంతవరకు వచ్చింది అంటే కొన్ని రాజకీయ పక్షాలు దేశాని కి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాల కల్పన ను విమర్శించడం మొదలుపెట్టాయి అని ప్రధాన మంత్రి అన్నారు.  సుస్థిరమైనటువంటి అభివృద్ధి కోసం నాణ్యమైన మౌలిక సదుపాయాల ను నిర్మించడం అనేది ఒక నిరూపణ అయినటువంటి మార్గం అనే సంగతి ని ప్రపంచం అంతటా ఆమోదించడం వాస్తవం అని, ఇది అనేక ఆర్థిక కార్యకలాపాలకు తావు ఇచ్చి పెద్ద ఎత్తున ఉపాధి ని సృష్టిస్తుంది అని ప్రధాన మంత్రి వివరించారు.

స్థూలమైన ప్రణాళిక రచన కు, సూక్ష్మ స్థాయి లో అమలు చేయడం లో ఉత్పన్నం అయ్యే సమస్యల కు మధ్య ఒక పెద్ద అంతరం ఏర్పడడానికి తోడు, సమన్వయం లోపించడం, అవసరమైన ముందస్తు సమాచారం కొరవడడం, గిరి గీసుకొని ఆలోచించడం, హద్దులు ఏర్పరచుకొని పని చేస్తుండడం వంటివి నిర్మాణాలు నిలచిపోవడానికి, బడ్జెటు వృథా పోవడానికి దారి తీస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు.  ఇలా అయితే, శక్తి ఇంతలంతలు కావడానికి బదులు ముక్కచెక్కలు గా విడిపోతుంది అని ఆయన అన్నారు.    మాస్టర్ ప్లాన్ ఆధారం గా పని చేయడం అనేది వనరుల ను గరిష్ఠం గా వినియోగించుకోవడానికి తోడ్పడి, మరి పిఎమ్ గతి శక్తి నేశనల్ మాస్టర్ ప్లాన్ ఈ లోపాల ను సరిదిద్దుతుంది అని ఆయన వివరించారు.

2014వ సంవత్సరం లో ప్రధాన మంత్రి పదవి ని తాను స్వీకరించినప్పుడు పనులు నిలచిపోయిన వందల కొద్దీ ప్రాజెక్టుల ను సమీక్షించిన సంగతి ని, ప్రాజెక్టు లు అన్నిటి ని ఒకే వేదిక వద్ద కు తీసుకు వచ్చి, అవరోధాల ను తొలగించేందుకు యత్నించినట్లు ఆయన గుర్తు కు తెచ్చారు.  సమన్వయ లోపం కారణం గా తల ఎత్తిన జాప్యాల ను నివారించడం పై ప్రస్తుతం శ్రద్ధ తీసుకోవడం పట్ల సంతృప్తి ని వ్యక్తం చేశారు.  యావత్తు ప్రభుత్వం పాల్గొనే  వైఖరి కారణం గా, ప్రభుత్వం యొక్క సామూహిక శక్తి ని ఈ పథకాల ను సాకారం చేయడం కోసం మళ్ళించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి చెప్పారు.  ఈ కారణం గా, దశాబ్దాల పాటు అసంపూర్తి గా ఉన్న  అనేక ప్రాజెక్టులు  ప్రస్తుతం పూర్తి అవుతున్నాయని ఆయన అన్నారు.  పిఎమ్ గతి శక్తి మాస్టర్ ప్లాన్ అనేది ప్రభుత్వ ప్రక్రియల ను, ప్రభుత్వం తో సంబంధం గల వివిధ వర్గాల ను ఒక చోటు కు తీసుకు రావడం ఒక్కటే కాకుండా వేరు వేరు రవాణా పద్ధతుల ను ఏకీకృతం చేయడానికి కూడా తోడ్పడుతుందని ఆయన అన్నారు.  ‘‘ఇది ఒక సమగ్రమైనటువంటి పాలన తాలూకు పొడిగింపే’’ అని ఆయన అన్నారు.

భారతదేశం లో మౌలిక సదుపాయాల కల్పన తాలూకు వేగాన్ని పెంచడం కోసం చేపట్టిన చర్యల ను గురించి ప్రధాన మంత్రి ఒక్కటొక్కటి గా వివరించారు.  భారతదేశం లో అంతర్ రాష్ట్ర సహజ వాయువు సరఫరా కు ఉద్దేశించిన ఒకటో గొట్టపు మార్గం 1987 వ సంవత్సరం లో పని చేయడం మొదలైందని ఆయన చెప్పారు.  దీని తరువాత 2014వ సంవత్సరం వరకు, అంటే 27 ఏళ్ళ లో, 15,000 కిలో మీటర్ల పొడవు కలిగిన సహజ వాయు గొట్టపు మార్గాన్ని నిర్మించడమైందన్నారు.  ప్రస్తుతం దేశం అంతటా చూస్తే 16,000 కి.మీ. కి పైగా పొడవున గ్యాస్ పైప్ లైన్ సంబంధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.  ఈ పనుల ను రాబోయే 5-6 సంవత్సరాల లో పూర్తి చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది అని కూడా ఆయన అన్నారు.

2014 వ సంవత్సరాని కన్నా మునుపటి అయిదేళ్ళ లో కేవలం 1900 కి.మీ. రైల్ వే లైనులు డబ్లింగ్ కు నోచుకొన్నాయని ప్రధాన మంత్రి అన్నారు.  గడచిన 7 సంవత్సరాల లో 9 వేల కిలో మీటర్ లకు పైగా రైల్ వే లైను ల డబ్లింగ్ జరిగిందని ఆయన తెలిపారు.  2014 కన్నా పూర్వం అయిదేళ్ళ లోను, 3000 కి.మీ. రైలు మార్గాల విద్యుతీకరణ జరుగగా, గడచిన 7 ఏళ్ళ లో 24000 కి.మీ. కి పైగా రైలు మార్గాల ను విద్యుతీకరించినట్లు శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు.  2014 కంటే పూర్వం మెట్రో రైలు దాదాపు 250 కి.మీ. మేర మాత్రమే నడుస్తూ వచ్చింది అని ప్రధాన మంత్రి అన్నారు.  ఇప్పుడు మెట్రో ను 700 కి.మీ. వరకు విస్తరించడమైంది, అంతేకాదు 1000 కి.మీ. నూతన మెట్రో మార్గం తాలూకు పనులు కొనసాగుతున్నాయన్నారు.  2014 వ సంవత్సరానికి పూర్వం అయిదేళ్ళ లో, 60 పంచాయతీల ను మాత్రమే ఆప్టికల్ ఫైబర్ తో కలపడం సాధ్యమైందన్నారు.  గడచిన 7 ఏళ్ళ లో మేం ఒకటిన్నర లక్షల కు పైగా గ్రామ పంచాయతీల ను ఆప్టికల్ ఫైబర్ తో జత పరచాం అని ఆయన చెప్పారు.

దేశం లో రైతుల ఆదాయాన్ని, మత్స్యకారుల ఆదాయాన్ని పెంచాలి అనే ఉద్దేశ్యం తో ప్రాసెసింగ్ కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన ను కూడా త్వరిత గతి న విస్తరించడం జరుగుతోంది అని ప్రధాన మంత్రి అన్నారు.  2014 వ సంవత్సరం లో దేశం లో మెగా ఫూడ్ పార్కు లు రెండే ఉన్నాయి.  ఇవాళ దేశం లో 19 మెగా ఫూడ్ పార్కు లు కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.  ఇక వీటి సంఖ్య ను 40 కి పైబడేటట్లుగా చేయాలి అనేది లక్ష్యం గా ఉంది.  2014 వ సంవత్సరం లో అయిదంటే అయిదే జల మార్గాలు ఉన్నాయి.  ప్రస్తుతం భారతదేశం లో 13 జల మార్గాలు క్రియాశీలం గా ఉన్నాయి.  ఓడరేవుల లో నౌకల కు టర్న్ ఎరౌండ్ టైము  2014 వ సంవత్సరంలో 41 గంటలు గా ఉన్నది కాస్తా ప్రస్తుతం 27 గంటల కు దిగి వచ్చింది అని ప్రధాన మంత్రి వివరించారు.  దేశం ‘వన్ నేశన్, వన్ గ్రిడ్’ ప్రతిజ్ఞ ను నెరవేర్చుకొన్నది అని ఆయన అన్నారు.  భారతదేశం లో ప్రస్తుతం 4.25 లక్షల సర్క్యూట్ కిలో మీటర్ ల మేరకు విద్యుత్తు ప్రసార మార్గాలు ఉన్నాయని, అదే 2014 వ సంవత్సరం లో 3 లక్షల సర్క్యూట్ కిలో మీటర్ ల సామర్ధ్యం మాత్రమే ఉండిందని ఆయన వివరించారు.

నాణ్యమైన మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచడం వల్ల భారతదేశం వ్యాపార రాజధాని గా రూపొందాలన్న కల ను పండించుకో గలుగుతుందన్న ఆశాభావాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.  మన లక్ష్యాలు అసాధారణమైనవి గా ఉన్నాయి.  మరి వాటిని సాధించాలి అంటే అసాధారణమైనటువంటి ప్రయాసలు అవసరపడుతాయి అని ఆయన అన్నారు.  ఈ లక్ష్యాల ను సాధించడం లో పిఎమ్ గతి శక్తి అత్యంత సహాయకారి కాగలుగుతుంది.  ప్రభుత్వ సౌకర్యాల ను ప్రజల కు అందుబాటు లోకి తీసుకుపోయే పని లో జెఎఎమ్ (జన్ ధన్, ఆధార్, మొబైల్) త్రయం ఒక క్రాంతి ని ప్రవేశపెట్టినట్లుగానే మౌలిక సదుపాయల కల్పన రంగం లో పిఎమ్ గతి శక్తి అనేది అదే పని ని చేస్తుంది అని ఆయన అన్నారు.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties

Media Coverage

India's new FTA playbook looks beyond trade and tariffs to investment ties
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 జనవరి 2026
January 14, 2026

Viksit Bharat Rising: Economic Boom, Tech Dominance, and Cultural Renaissance in 2025 Under the Leadership of PM Modi