ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య నౌకను అద్భుతంగా తీర్చిదిద్ది, ప్రాణం పోసిన రూపకర్తలు, కళాకారులు, నౌకా నిర్మాణ నిపుణులు, భారత నావికాదళం అంకితభావంతో చేసిన కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ఈ నౌక గుజరాత్‌లోని పోర్‌బందర్ నుంచి ఒమన్‌లోని మస్కట్ వరకు తొలి ప్రయాణాన్ని ప్రారంభించిన సందర్భంగా ప్రశంసలు కురిపించారు. పురాతన భారతీయ 'స్టిచ్డ్-షిప్' సాంకేతికతతో నిర్మించిన ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య, భారతదేశపు సుసంపన్నమైన సముద్రయాన సంప్రదాయాలను ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 'గల్ఫ్ ప్రాంతంతో, ఇతర దేశాలతో మనకున్న చారిత్రక సంబంధాలను పునరుద్ధరిస్తూ సాగుతున్న ఈ నౌకా సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి ప్రయాణం సురక్షితంగా, ఎప్పటికీ గుర్తుండిపోయేలా సాగాలని కోరుకుంటున్నాను' అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"ఐఎన్‌ఎస్‌వీ కౌండిన్య పోర్‌బందర్ నుంచి ఒమన్‌లోని మస్కట్‌కు తొలి ప్రయాణాన్ని ప్రారంభించటం అధ్బుతం. పురాతన భారతీయ 'స్టిచ్డ్-షిప్' సాంకేతికతతో నిర్మితమైన ఈ నౌక, భారతదేశపు సుసంపన్నమైన సముద్రయాన సంప్రదాయాలను సగర్వంగా చాటిచెబుతోంది. ఈ విశిష్టమైన నౌకను అద్భుతంగా తీర్చిదిద్దిన రూపకర్తలు, కళాకారులు, నౌకా నిర్మాణ నిపుణులు, భారత నావికాదళ అంకితభావంతో కూడిన కృషిని నేను అభినందిస్తున్నాను. గల్ఫ్ ప్రాంతంతో, అంతకు మించి మనకున్న చారిత్రక సంబంధాలను పునరుద్ధరిస్తూ సాగుతున్న ఈ నౌకా సిబ్బందికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వారి ప్రయాణం సురక్షితంగా, ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా సాగాలని కోరుకుంటున్నాను"

@INSVKaundinya

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Why India's ₹37,500 cr coal gasification push matters for its energy future

Media Coverage

Why India's ₹37,500 cr coal gasification push matters for its energy future
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 14 మే 2026
May 14, 2026

Kisan Kalyan to Viksit Bharat: PM Modi Delivers Jobs, Markets & Dignity Across Rural and Industrial India