తన అధికారిక కార్యాక్రమాలు, సమావేశాల సందర్భంగా స్వీకరించిన బహుమతుల వేలం ప్రారంభమయ్యిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. ఈ వేలంలో పౌరులు ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధానమంత్రి సూచించారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని నమామి గంగే కార్యక్రమానికి విరాళంగా అందజేయనున్నట్లు తెలిపారు. గంగా నది సంరక్షణ, పునరుజ్జీవనానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన పథకం- నమామి గంగే.

సోషల్ మీడియా మాధ్యమం ‘ఎక్స్ ’ పోస్టులో మోదీ ఇలా పేర్కొన్నారు.

‘గత కొన్ని రోజులుగా నేను వివిధ కార్యక్రమాలలో స్వీకరించిన బహుమతుల కోసం ఆన్ లైన్ వేలం జరుగుతోంది. ఈ వేలంలో మన సంస్కృతి, సృజనాత్మకతను ప్రతిబింబించే ఆసక్తికరమైన కళాఖండాలు ఉన్నాయి. వేలం ద్వారా వచ్చిన ఆదాయం నమామి గంగే కార్యక్రమానికి ఉపయోగపడుతుంది. మీరు కూడా ఈ వేలంలో తప్పకుండా పాల్గొనండి.’’

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka

Media Coverage

Operation Sagar Bandhu: India provides assistance to restore road connectivity in cyclone-hit Sri Lanka
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 డిసెంబర్ 2025
December 05, 2025

Unbreakable Bonds, Unstoppable Growth: PM Modi's Diplomacy Delivers Jobs, Rails, and Russian Billions