ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 1730 మంది కి పైగా ఆదివాసీ అతిథులు, ఎన్‌సిసి కేడెట్ లు, ఎన్ఎస్ఎస్ వలంటియర్ లు, ఆదివాసీ క‌ళాకారుల తో ఈ రోజు న జరిగిన ఒక స్వాగత సత్కారం లో పాలు పంచుకొన్నారు. వీరంతా దేశ రాజధాని లో జరిగే 71వ గణతంత్ర దిన సైనిక ప్రదర్శన లో భాగం పంచుకోబోతున్నారు.

పెద్ద సంఖ్య లో తరలివచ్చిన ఉత్సాహవంతులైనటువంటి సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, వారు గణతంత్ర దిన సైనిక ప్రదర్శన లో ఒక బుల్లి భారతదేశాన్ని కళ్లకు కట్టేటట్టుగా ప్రదర్శనలు ఇస్తారని పేర్కొన్నారు. సైనిక ప్రదర్శన లో భాగం గా వారు ప్రదర్శించే కార్యక్రమాల లో భారతదేశం యొక్క సారాంశాన్ని ప్రపంచం వీక్షించనుందని ప్రధాన మంత్రి అన్నారు.  భారతదేశం కేవలం ఒక భౌగోళికమైన లేదా జనసంఖ్యాసంబంధమైన అస్తిత్వం కాదు అని ఆయన స్పష్టంచేశారు.   

ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్ ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, భారతదేశం 130 కోట్ల మంది ప్రజల కు నివాసం మాత్రమే కాక ఒక చైతన్యభరితమైనటువంటి సంప్రదాయం కలిగినటువంటి దేశం కూడా అని వివరించారు.

 

భారతదేశం ఒక జీవన పంథా అని, ఒక ఆలోచన, అనేక తత్వశాస్త్రాల మేళనం అని, అంతే కాక ఒక సుసంపన్నమైనటువంటి మరియు విశ్వవ్యాప్తమైనటువంటి దృష్టికోణానికి ఒక రూపకం అని అభివర్ణించారు.  భారతదేశం అంటే ఒక విశ్వ పరివారం, భారతదేశం అంటే అన్ని మతాల కు సమానత్వం, భారతదేశం అంటే సత్యం యొక్క విజయోత్సవం, భారతదేశం అంటే ఒక సత్యాన్ని వేరు వేరు విధాలు గా అర్థం చేసుకోవడానికి అనుమతించేటటువంటి ఆలోచన స్రవంతి, భారతదేశం అంటే మొక్కల జాతుల ను మరియు పుష్పించే మొక్కల జాతుల ను ప్రేమించడం తో పాటు పరిరక్షించేది, భారతదేశం అంటే స్వయం సహాయానికి ప్రతిరూపం, భారతదేశం ఒక్క త్యాగం చేసే వారే పరమానందభరితులుగా ఉంటారు అని నమ్ముతుంది; భారతదేశం అంటే ప్రతి ఒక్కరి సంక్షేమం పట్ల నమ్మకం కలిగినటువంటిది; భారతదేశం అంటే మహిళలను ఆరాధించేటటువంటిది; భారతదేశం అంటే మాతృభూమి దైవం కన్న అధికమైన నీతివంతమైనటువంటిది అని నమ్మేది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

భారతదేశం లో గల భౌగోళికమైనటువంటి మరియు సంఘపరమైనటువంటి భిన్నత్వంలో భారతదేశం యొక్క బలం ఇమిడివుంది అని ప్రధాన మంత్రి అన్నారు. 

 

 

Click here to read PM's speech

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Cabinet clears ₹23,731 crore GOBARdhan scheme for compressed biogas

Media Coverage

Cabinet clears ₹23,731 crore GOBARdhan scheme for compressed biogas
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam emphasizing on spirit of selfless service
August 07, 2026

The Prime Minister, Shri Narendra Modi, shared a Sanskrit Subhashitam highlighting the virtue of selfless service and the noble ideal of working for the welfare of others without expecting anything in return:

"किं चन्द्रमाः प्रत्युपकारलिप्सया करोति गोभिः कुमुदावबोधनम्।

स्वभाव एवोन्नतचेतसां सतां परोपकारव्यसनं हि जीवितम्॥"

The Prime Minister posted on X:

किं चन्द्रमाः प्रत्युपकारलिप्सया करोति गोभिः कुमुदावबोधनम्।

स्वभाव एवोन्नतचेतसां सतां परोपकारव्यसनं हि जीवितम्॥